Khila Warangal
-
అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు
ఖిలా వరంగల్: వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి జరిపి ఇద్దరు మహిళలను రక్షించారు. నగరంలోని శివనగర్‌కు చెందిన బోనాసి స్వర్ణలత అలియాస్ కావేరి కొన్నాళ్లుగా తన ఇంట్లో రహస్యంగా వ్యభిచారం సాగిస్తోంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్‌కు చెందిన ఒకరు, కాకినాడకు చెందిన మరో యువతిని బలవంతంగా ఈ రొంపిలోకి దింపి వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: లిప్ట్ ఇస్తానంటూ నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని.. ముందస్తు సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు శివనగర్‌లోని ఆమె ఇంటిపై సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ఇద్దరు మహిళల్ని, ఖిలా వరంగల్‌కు చెందిన విటుడు స్వామిని అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. వారినుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.5,260 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకొని విచారణ కోసం మిల్స్ కాలనీ పోలీసులకు నిందితులను అప్పగించి నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, సంతోష్, శ్రీనివాస్‌జీ తెలిపారు. -
రామప్ప దగ్గర భూముల ధరకు రెక్కలు
హాలో సునీల్ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. యునెస్కో గుర్తింపు కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. గుర్తింపుతో రెట్టింపు ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. వారం తిరక్కుండానే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. ఇక్కడే డిమాండ్ రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భద్రాకాళి ఆలయం పర్యాటక కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. బొగత జలపాతం ఢోకాలేదు తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్ టూరిజం సర్క్యూట్లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది. హోటళ్లు రిసార్టులు రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి. -
కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, వరంగల్ అర్బన్: ఖిలా వరంగల్ మండలం నక్కలపెళ్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మహాలక్ష్మీ కాటన్ మిల్లులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారని పోలీసులు వెల్లడించారు. అయితే, అప్పటికే మంటలు తీవ్రమవడంతో గోదాంలో నిల్వ చేసిన పత్తి బెయిళ్లన్నీ కాలిపోయినట్లు తెలిసింది. ప్రమాదంలో రెండు కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మిల్లు యాజమాని వాపోయారు. కాగా, ఘటనపై అగ్నిమాపక అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
ఖిలా వరంగల్ : రోడ్డు భద్రత అందరి బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివలింగయ్య పిలుపునిచ్చారు. 29వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వరంగల్ ఉప రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23 నుంచి 29 వరకు జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వైద్యశాఖ అధికారులు, ఆటోరిక్షా డ్రైవర్లు, విద్యాసంస్థల బస్సుల డ్రైవర్లు, కళాశాల యాజమాన్యాలు, ప్రజలు, యువతకు అవగాహన, క్విజ్ పోటీలతో పాటు బైక్ ర్యాలీలు, హెల్మెట్ వాడకంపై అవగాహన, కళాబృందాలచే ఆటపాటలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలతో రోజుకు 1.50 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, 6 లక్షల మంది క్షతగాత్రులవుతున్నారని పేర్కొన్నారు. నిమిషానికి ఒక యాక్సిడెంట్లో ఒక్కరు మృత్యువాత పడుతున్నారని చెప్పారు.. డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే సుమారు 90 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. 23న జాతీయ రహదారి భద్రతపై కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ, ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సు ఉంటుందని తెలిపారు. 24న కిట్స్ కళాశాలలో ప్రైవేట్ విద్యాసంస్థల డ్రైవర్లకు అవగాహన, 25న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రహదారి భద్రతపై లఘుచిత్రాల ప్రదర్శన, కరపత్రాల పంపిణీ, వాహన తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 26న రవాణాశాఖ ఉప కార్యాలయం భవనంలో రక్తదాన శిబిరం, రోడ్డు భద్రతపై అవగాహన, 27న రహదారి భద్రతపై ఎఫ్ఎం రేడియో ద్వారా అవగాహన, మండలాల్లో ప్రచార రథాలు ప్రారంభం, వాహన తనిఖీలు, వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహ, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 28న రోడ్డు భద్రతపై ఆటోరిక్షా డ్రైవర్లకు అవగాహన, డ్రైవింగ్ లైసెన్సు మేళా, స్కూల్, కళాశాల యాజమాన్యాలు, విద్యార్థి తల్లి దండ్రులు, డ్రైవర్లు, క్లీనర్లకు అవగాహన సదస్సులు ఉం టాయన్నారు. 29న ముగింపు వేడుకులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాణ రక్షణ కోసం ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ను వినియోగించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపొద్దని సూచించారు. హాజరుకానున్న సీపీ.. ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం 10.30 గంటలకు రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రారంభమవుతాయని, ముఖ్యఅతిథులుగా సీపీ విశ్వనాథరవీందర్, డీసీపీ బి. వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ డి.మురళీధర్ రావు, టీఎస్ఆర్టీసీ రిజినల్ మేనేజర్ టి. సూర్యకిరణ్, ఆర్టీఏ మెంబర్ కాటారపు రాజు, రోడ్డు సేఫ్టీ ఫౌండర్ హైదరాబాద్ రీజియన్ అధికారి కె.వినోద్‌కుమార్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. వాహనదారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని డీటీసీ శివలింగయ్య కోరారు. ఈ సమావేశంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడుతున్న డీటీసీ శివలింగయ్య -
కొత్త మండలాలు ఆరు
సాక్షి, హన్మకొండ : జిల్లాల పునర్విభజనమ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్లో ఆరు కొత్త మండలాలను పేర్కొన్నారు. ప్రస్తుత వరంగల్ జిల్లాలో ఖిలావరంగల్, కాజిపేట, ఐనవోలు, చిల్పూరు, వేలేరు... కరీంనగర్ జల్లాలో ఇల్లందకుంట మండలం కొత్తగా ఏర్పడనున్నాయి. కాజిపేట, చిల్పూరు, వేలేరు, ఇల్లందకుంట హన్మకొండ జిల్లాలో... ఖిలావరంగల్, ఐనవోలు వరంగల్ జిల్లాలో ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంతంలో 35 వేలు, పట్టణ ప్రాంతంలో 1.50 లక్షల జనాభా ఉంటేనే కొత్త మండలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పడుతున్న ఆరు మండలాల్లో ఖిలావరంగల్‌లో అత్యధికంగా 1,59,669, అత్యల్పంగా ఐనవోలు మండలంలో 36,810 జనాభా ఉంది. హన్మకొండ, వరంగల్, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, మొగుళ్లపల్లి, జమ్మికుంట, భీమదేవరపల్లి మండలాలను విభజిస్తూ కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ముసాయిదా రూపొందించారు. వరంగల్æ జిల్లా ధర్మసాగర్, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలాల్లోని గ్రామాలతో కొత్తగా వేలేరు మండలం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జనాభా 40,042గా ఉంది. విభజన తర్వాత ఆయా మండలాల్లో గ్రామాల వారీగా జనాభా వివరాలిలా.. వేలేరు మండలం.. వేలేరు–9662, పీచర–5306, సోడాషపల్లి–1347, మల్లికుదురు–2442, గుండ్లసాగర్–1216, కొత్తకొండ–4610, మల్లారం–3986. కట్కూరు–4189, కన్నారం–1896, ఎర్రబెల్లి–2877, ముస్తాఫ్పూర్–2511, మొత్తం 40042 ధర్మసాగర్ మండలం.. ధర్మసాగర్–9350, నారాయణగిరి–4494, ముప్పారం–3223, దేవునూరు–2563, సోమదేవరపల్లి–1468, ఎల్కుర్తి–4779, జానకిపుపూర్–1460, క్యాతంపల్లి–1548, తాటికాయల–3486, పెద్దపెండ్యాల–7152, ధర్మాపూర్–2418, మల్లక్‌పల్లి–3449, ఉనికిచర్ల–2953, మొత్తం–48343 భీమదేవరపల్లి మండలం.. వంగర–6081, భీమదేవరపల్లి–2579, రత్నగిరి–1811, మాణిక్యపూర్–2183 కొప్పూర్–3055, కొత్తపల్లి–4199, ముల్కనూరు–9075, ముత్తారం(పీ.కే)–1208, గట్లనర్సింగాపూర్–4626, కన్నారం–1896, మొత్తం–37713 చిల్పూర్ మండలం.. చిల్పూర్–3668, శ్రీపతిపల్లి–1766, చిన్నపెండ్యాల–4006, కొండాపూర్–1671, లింగంపల్లి–3278, మల్కాపూర్–4030, వెంకటాద్రిపేట–2239, కృష్ణాజీగూడెం–2417, ఫతేపూర్–2484, పల్లగుట్ట–3758, రాజవరం–5119, నష్కల్–3691, మొత్తం 38127 ఘన్పూర్(స్టేçÙన్) మండలం.. పామునూరు–2331, కొత్తపల్లి–1529, మీదిగొండ–2751, రాఘవపూర్–1814, చాగల్–4520, నమిలికొండ–2770, విశ్వనాథపూర్–1330, తానేదార్పల్లి–1668, ఇప్పగూడ–8195, సముద్రాల–3315, ఘనపురం(స్టేçÙన్)–12721, శివునిపల్లి–6242, తాటికొండ–4990, మొత్తం–54176 కాజీపేట మండలం... కాజీపేట–53774, సోమిడి–44430, మడికొండ–19229, తరాలపల్లి–3053, కడిపికొండ–8685, కొత్తపల్లి–1219, బట్టుపల్లి–2096, అమ్మవారిపేట–421, శాయంపేట–19474, రాంపూర్–5277, మొత్తం 157649 హన్మకొండ మండలం.. హన్మకొండ–79323, కుమారపల్లి–56182, పలివేల్పుల–4046, లష్కర్‌సింగారం–82931, గోపాల్పూర్–9620, వడ్డేపల్లి–4355, మొత్తం 2,36,457 వరంగల్ మండలం.. దేశాయిపేట–11830, లక్ష్మిపూర్–81298, మట్టెవాడ–22905, గిర్మాజీపేట–30650, రామన్నపేట–6820, పైడిపల్లి–11396, కొత్తపేట–1587, ఏనుమాముల–13126, మొత్తం 153503 ఖిలావరంగల్ మండలం.. ఖిలావరంగల్–19110, ఉర్సు–102597, రంగశాయిపేట–21868, అల్లిపూర్–1329, తిమ్మాపూర్–7513, మామునూరు–6319, నక్కలపల్లి–928, మొత్తం 159664 ఐనవోలు మండలం.. ఐనవోలు–7441, సింగారం–2189, పున్నేలు–4900, నందనం(6747, కక్కిరాలపల్లి(2877, పంథిని–4165, కొండపర్తి–6439, వనమాలకనపర్తి–2052, మొత్తం 36810 వర్ధన్నపేట మండలం.. వర్ధన్నపేట–13715, చెన్నారం–2747, ఉప్పరపల్లి–2231, నల్లబెల్లి–4527, కట్రా్యల–3690, ఇల్లంద–7252, బండౌతాపూర్–2837, దమ్మన్నపేట–3932, దివిటిపల్లి–883, రామవరం–1470, కొత్తపల్లి–2079, ల్యాబర్తి–3193, మొత్తం 48556 ఇల్లందకుంట మండలం.. ఇల్లందకుంట–3765, చిన్నకోమటిపల్లి–1314, వావిలాల=6131, వంతడుపుల–1234, బూజునూర్–3346, రాచపల్లి–3487, టేకుర్తి–2337, సిరిసేడ్–5086, పత్తర్లపల్లి–1087, మల్యాల–4512, కానగర్తి–2539, వేములపల్లి–2993, మొట్లపల్లి–2617, మొత్తం 404448. మొగుళ్లపల్లి మండలం.. దుబ్యాల– 1801, రాఘవరెడ్డిపేట– 1681, అకినెపల్లె–2139, పొత్తుగల్–1048, కురుక్షాల–1100, పెద్దకోమటిపల్లి–1752, పర్లపల్లె–2831, మెట్పల్లి–1549, గుండ్లకార్తి–592, గుడిపహాడ్–1059, పిడిశాల–2746, ముల్కలపల్లె–3991, ఇస్సిపేట–4736, అంకుశాపూర్–747, మేదరలమెట్ల–1114, రంగాపురం–3259– మొత్తం–33777. -
మూడు ఇన్.. మూడు ఔట్
ఇదీ వరంగల్ మండల పరిస్థితి.. పోచమ్మమైదాన్ : జిల్లాలోనే ఎక్కువ జనాభా కలిగిన మండలంగా పేరొందిన వరంగల్ మండ లం కొత్త మండలాల ఏర్పాటుతో రెండుగా చీలిపోనుంది. వరంగల్, హన్మకొండ పరిధిలోని పలు గ్రామాలను కలుపుకోని ఖిలావరంగల్, వరంగల్ మండలాలుగా వేరు చేస్తున్నారు. ప్రజలకు అనువుగా ఉండే ప్రాంతాలను ఖిలావరంగల్, వరంగల్ మండలాలకు కలిపుతున్నారు. 1997లో హన్మకొండ నుంచి వరంగల్ మండలంను వేరు చేశారు. ప్రస్తుతం ఈ మండలంలోని 2011 సంవత్సరంలో 3లక్షలకు పైగా వరంగల్ మండలం జనాబా పెరిగింది. అర్బన్ పరిధిలో 1.5లక్షలకే ఒక మండలం ఉండాల్సి ఉంది. ప్రస్తుత వరంగల్ మండలంలోని ఎనిమిది గ్రామాలు ఉండగా మూ డు గ్రామాలు ఖిలా వరంగల్, ఉర్సు, రంగశాయిపేట విడిపోయి.. హన్మకొండ మండలం నుంచి తిమ్మాపూర్, అల్లీపూర్, నక్కలపల్లి కలిసి ఖిలా వరంగల్ మండలంగా ఏర్పడుతాయి. ఇక వరంగల్‌లో గిర్మాజీపేట, రామన్నపేట. మట్టెవాడ, దేశాయిపేట, లక్ష్మీపురం మిగలనుండగా హన్మకొండ నుంచి మళ్లీ ఏనుమాముల, కొత్తపేట, పైడిపల్లి వచ్చి కలుస్తాయి. తద్వారా మళ్లీ ఎనిమిది మండలాల్లో వరంగల్ కొత్త రూపు సంతరించుకోనుండగా 1.6లక్షల జనాభా ఉంటుంది. ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో కార్యాలయం ఖమ్మం రోడ్డులోని ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో నూతనంగా ఏర్పాటయ్యే ఖిలావరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి అద్దె భవనం కోసం వేటలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఖిలావరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సొంత భవనం నిర్మించనున్నారు. -
కోటలో తొలిసారిజెండా పండుగ
సాక్షి, హన్మకొండ : కాకతీయుల కోట వేదికగా స్వాతం త్య్ర వేడుకలు కనుల పండువగా జరగనున్నాయి. 68వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఖిలావరంగల్ ముస్తాబైంది. శుక్రవారం ఉదయం 9గంటలకు కాకతీయ కీర్తితోరణాలు, ఖుష్‌మహల్ మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను డిప్యూటీ సీఎం సన్మానిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తొలి స్వాతంత్య్ర వేడుకలకు వేదికగా ఖిలావరంగల్‌ను ఎంపిక చేశారు. ఏర్పాట్లు పూర్తి.. పోలీసులు, సైనిక దళాల కవాతు చేసేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీఐపీలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలకు ఈ వేడుకలు తిలకించేందుకు అనువుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థలాన్ని సిద్ధం చేశారు. ఇక్కడ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు కళారూపాలను, ఆ తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాలను ప్రదర్శిస్తారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలకు ఉపముఖ్యమంత్రి ప్రశాంస పత్రాలను అందిస్తారు. ఈ వేడుల సందర్భంగా పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ భద్రతా వ్యవహారాలను ఏఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు ఓఎస్డీలు, పది మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 20మంది ఎస్పైలతో పాటు వివిధ విభాగాలకు చెందిన కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటారు. ఇండోర్ స్టేడియంలో అట్ హోం వేడుకలు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సాయంత్రం 5గంటలకు హన్మకొండ ఇండోర్ స్టేడియంలో అట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, పాత్రికేయులు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సెయింట్‌పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్, అతిథి మానసిక వికలాంగుల కేంద్రం, ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, కరీమాబాద్ సీవీ హైస్కూల్, హసన్‌పర్తి సూజాత విద్యానికేతన్ హైస్కూల్, మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సెయింట్ థామస్ గ్రామర్ హైస్కూల్, నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలభవన్, శ్లోకా హైస్కూల్‌కు చె ందిన విద్యార్థులు కళా ప్రదర్శలను ఇస్తారు. గర్వించదగ్గ రీతిలో వేడుకలు : కలెక్టర్ ఖిలావరంగల్ : కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటలో 68వ స్వాతంత్య్ర వేడుకలు జిల్లా ప్రజలు గర్వంచదగ్గరీతిలో జరగనున్నాయని జిల్లా కలెక్టర్ కిషన్ తెలిపారు. ఖిలావరంగల్ కోటలో పంద్రాగస్టు వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్ కిషన్, నగర పాలక సంస్థ క మిషనర్ సువర్ణపాండదాస్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ప్రాంతాలలోనే 68వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణరుుంచిందని, ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేడుకలు కోటలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖుష్‌మహల్ పక్కనే ఉన్న స్థలంలో జాతీయ పతాకావిష్కరణ జరుగుతుందని తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులకు, సామన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో అడిషనల్ ఎస్పీ యాదయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రక రణ్, ఆర్డీఓ మాధవరావు ఉన్నారు.