కోటలో తొలిసారిజెండా పండుగ | Independence day celebrations | Sakshi
Sakshi News home page

కోటలో తొలిసారిజెండా పండుగ

Published Fri, Aug 15 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

కోటలో తొలిసారిజెండా పండుగ

కోటలో తొలిసారిజెండా పండుగ

సాక్షి, హన్మకొండ : కాకతీయుల కోట వేదికగా స్వాతం త్య్ర వేడుకలు కనుల పండువగా జరగనున్నాయి. 68వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఖిలావరంగల్ ముస్తాబైంది. శుక్రవారం ఉదయం 9గంటలకు కాకతీయ కీర్తితోరణాలు, ఖుష్‌మహల్ మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను డిప్యూటీ సీఎం సన్మానిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తొలి స్వాతంత్య్ర వేడుకలకు వేదికగా ఖిలావరంగల్‌ను ఎంపిక చేశారు.
 
ఏర్పాట్లు పూర్తి..
పోలీసులు, సైనిక దళాల కవాతు చేసేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీఐపీలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలకు ఈ వేడుకలు తిలకించేందుకు అనువుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థలాన్ని సిద్ధం చేశారు. ఇక్కడ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు కళారూపాలను, ఆ తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాలను ప్రదర్శిస్తారు.
 
అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలకు ఉపముఖ్యమంత్రి ప్రశాంస పత్రాలను అందిస్తారు. ఈ వేడుల సందర్భంగా పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ భద్రతా వ్యవహారాలను ఏఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు ఓఎస్డీలు, పది మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 20మంది ఎస్పైలతో పాటు వివిధ విభాగాలకు చెందిన కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటారు.
 
ఇండోర్ స్టేడియంలో అట్ హోం వేడుకలు
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సాయంత్రం 5గంటలకు హన్మకొండ ఇండోర్ స్టేడియంలో అట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, పాత్రికేయులు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
 
సెయింట్‌పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్, అతిథి మానసిక వికలాంగుల కేంద్రం, ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, కరీమాబాద్ సీవీ హైస్కూల్, హసన్‌పర్తి సూజాత విద్యానికేతన్  హైస్కూల్, మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సెయింట్ థామస్ గ్రామర్ హైస్కూల్, నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలభవన్, శ్లోకా హైస్కూల్‌కు చె ందిన విద్యార్థులు కళా ప్రదర్శలను ఇస్తారు.
 
గర్వించదగ్గ రీతిలో వేడుకలు : కలెక్టర్
ఖిలావరంగల్ : కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటలో 68వ స్వాతంత్య్ర వేడుకలు జిల్లా ప్రజలు గర్వంచదగ్గరీతిలో జరగనున్నాయని జిల్లా కలెక్టర్ కిషన్ తెలిపారు. ఖిలావరంగల్ కోటలో పంద్రాగస్టు వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్ కిషన్, నగర పాలక సంస్థ క మిషనర్ సువర్ణపాండదాస్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ప్రాంతాలలోనే 68వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణరుుంచిందని, ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేడుకలు కోటలో నిర్వహిస్తున్నామని చెప్పారు.
 
ఖుష్‌మహల్ పక్కనే ఉన్న స్థలంలో జాతీయ పతాకావిష్కరణ జరుగుతుందని తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులకు, సామన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో అడిషనల్ ఎస్పీ యాదయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రక రణ్, ఆర్డీఓ మాధవరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement