ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం లభించింది. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు ఆయన నాయకత్వం వహించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది.దీనికి గ్రాండ్ మార్షల్‌గా అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ సందర్బంగా ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'యే భారత్‌కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..తగ్గేదేలే'.. అంటూ పుష్ప డైలాగ్‌తో ఉత్సాహపరిచాడు.
భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నట్లు తెలిపాడు. ఇక గ్రాండ్ మార్షల్‌గా వ్యవహిరించిన ఐకాన్ స్టార్ అల్లురన్‌కి అక్కడి మేయర్ ఆమమ్స్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ బహుకరించాడు. ఇండియా పరేడ్‌కి అల్లు అర్జున్ రావడంతో న్యూయర్క్ వీధులు కిక్కిరిసిపోయాయి. అసోసియేషన్ ఛైర్మన్ అంకుర్ వైద్య సహా వివిధ సంఘాల ప్రతినిధులు సహా పలువురు ప్రవాస భారతీయులు ర్యాలీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
It was a pleasure meeting the Mayor of New York City . Very Sportive Gentleman. Thank You for the Honours Mr. Eric Adams . Thaggede Le ! @ericadamsfornyc @NYCMayorsOffice pic.twitter.com/LdMsGy4IE0
— Allu Arjun (@alluarjun) August 22, 2022
Comments
Please login to add a commentAdd a comment