న్యూఢిల్లీ: స్వాతంత్రోద్యమాన్ని తిరగరాయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) బయలుదేరిందంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శల దాడి చేశారు. స్వాతంత్య్ర వేడుకల పేరుతో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ముసుగు వేసుకున్నాయని దుయ్యబట్టారు.
పాట్నాలోని జనతాదళ్ యునైటెడ్ నేషనల్ సమావేశంలో నితీష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల పాత్ర లేదని, ఇప్పుడు దాన్ని కూడా తిరగరాస్తారని ఎద్దేవా చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకుల గురించి ప్రస్తావిస్తూ ....స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకుడు ఎవరు? అని ప్రశ్నించారు. జాతిపిత బాపూజీ సారథ్యంలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త అర్థాలను తెచ్చిపెట్టారంటూ బీజేపీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ ఉత్సవాలను బాపు మహోత్సవ్‌గా ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
అసలు బాపూజీ హత్య ఎందుకు జరిగిందో అందరికీ తెలుసన్నారు. కేవలం గాంధీజీ హిందువులను ముస్లీంలను ఏకం చేస్తున్నందుకే అనే విషయాన్ని గ్రహించండి అన్నారు. అవసరమనుకుంటే బీజేపీ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను తుడిచి పెట్టి మరీ కొత్త విషయాలు రాసేవారంటూ ఎద్దేవా చేశారు. జాతి పిత గాంధీని సైతం పక్కన పెట్టే రోజు వస్తుందని తెలుసుకోండి అని చెప్పారు. గాంధీజీని హత్య చేసినవాడి కోసం ఏం చేస్తున్నారో కూడా గమనించండి అని పిలుపునిచ్చారు. తాను బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అలాంటి విషయాల్లో దూరంగా ఉన్నానని కుమార్ స్పష్టం చేశారు.
తాను ఆ సమయంలో వారితో పనిచేస్తున్నాను కాబట్టే ఏం మాట్లడలేదని, పైగా ఇలాంటి అర్థం పర్థం లేని వాటికి ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు జూన్‌లో కేంద్ర హోంమంత్రి ముఖ్యమంత్రుల సమావేశానికి పిలిచినప్పుడూ తాను దానిని దాటవేసి, అప్పటి డిప్యూటీ మంత్రి తార కిషోర్ ప్రసాద్‌ని పంపించినట్లు తెలిపారు. నితీష్ గత నెలలో ఆర్జేడియూతో జతకట్టి సంకీర్ణ ప్రుభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తదనంతరం నితీష్ పెద్ద ఎత్తున్న బీజేపీ పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని సృష్టించే లక్ష్యంతో వివిధ నేతలను కలుసుకున్నారు కూడా. ఇప్పటికే నితీష్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తోపాటు వామపక్ష నేతలను కలిశారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్ తదితరులను కూడా నితీష్ కలవనున్నారు.
(చదవండి: ప్రధాని పదవిపై వ్యామోహం లేదు.. తేల్చేసిన నితీశ్ కుమార్)
Comments
Please login to add a commentAdd a comment