indoor stadium
-
మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
కిక్ బాక్సింగ్ లీగ్ ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: విశాఖ నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం కిక్ బాక్సింగ్ ఇండియా లీగ్‌ను రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు 12 వెయిట్ కేటగిరీల్లో రెండు కాంటాక్ట్స్ విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ కేంద్రం అన్ని విధాలు క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. ఎంఎల్సీ పి.వి.ఎన్ మాధవ్, మేడపాటి రవీంద్ర, నిర్వాహక కమిటీ ప్రతినిధులు కె.నరసింహారావు, సునీల్‌కుమార్, సతీష్ పాల్గొన్నారు. -
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు మద్దతు: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహణకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ లీగ్‌కు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య, బేస్‌లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ యజమాని అభిషేక్ రెడ్డి సోమవారం కేటీఆర్‌ను కలిసి ఈ లీగ్ మ్యాచ్ బాల్‌ను, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు జెర్సీని ఆయనకు అందజేశారు. ఈనెల 5 నుంచి 27 వరకు ఏడు జట్ల మధ్య గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ లీగ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు సహ యజమాని శ్యామ్ గోపు, బెంగళూరు టార్పెడోస్ సహ యజమాని యశ్వంత్ బియ్యాల తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ జిల్లాలో ఇండోర్ స్టేడియం ప్రారంభం
-
ఒడిషాలో 89 స్టేడియాలు!
భువనేశ్వర్: భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ క్రీడల పట్ల తమ ప్రాధాన్యతను చూపించిన ఒడిషా ప్రభుత్వం ఇప్పుడు తమ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టింది. ఒడిషాలో మొత్తం రూ. 693.35 కోట్ల వ్యయంతో 89 మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాలను నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ కింద 18 నెలల వ్యవధిలోనే ఈ నిర్మాణాలు పూర్తవుతాయి. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారివంటివి ఎదురైనప్పుడు వసతి కేంద్రాలుగా, ఆస్పత్రులుగా కూడా ఉపయోగించుకునే విధంగా ఈ స్టేడియాలను నిరి్మస్తున్నారు. 2023లో భారత్‌లో హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రూర్కెలాలో ‘బిర్సా ముండా’ పేరుతో అధునాతన హాకీ స్టేడియాన్ని రూ. 120 కోట్ల వ్యయం తో ఒడిషా ప్రభుత్వం ఇప్పటికే నిర్మిస్తోంది. -
క్రీడల్లో సిక్కోలు నెంబర్ వన్
రణస్థలం/రణస్థలం రూరల్: ఒలింపిక్స్, కామ న్వెల్త్, ఆసియా క్రీడల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 25మంది క్రీడాకారులు పాల్గొనడం అరుదైన విషయమని, ప్రశంసనీయమని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రీడా వికాస కేంద్రాన్ని (ఇండోర్ మినీ స్టేడియం) ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అధ్యక్షతన మంత్రులు ముత్తంశెట్టి, ధర్మాన కృష్ణదాస్‌లు ప్రారంభించారు. అనంతరం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడాకారులకు తలమానికం అయిన కోడి రామ్మూర్తి స్టేడియంను గత ప్రభుత్వం విస్మరించిందని, సీఎం జగన్‌తో మాట్లాడి 2020లో స్టేడియంను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే పైడిభీమవరంలో పరిశ్రమలు అధికంగా ఉన్నందున కార్పొరేట్ సామాజిక బాధ్యతగా రూ.10 లక్షల వ్యయంతో జిమ్ ఏర్పాట య్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్‌కు సూచించారు. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాలను, భావనపాడు, ఉద్దానం కొబ్బరి తోటలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు. క్రీడా వికాస కేంద్రానికి వైఎస్సార్ క్రీడా వికాస కేంద్రంగా పేరు పెడుతున్నామని తెలిపారు. 14 రోజులపాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో నవరత్నాలతోసహా 19 బిల్లులు ఆమోదించామని, ప్రభుత్వ వచ్చిన రెండు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న ఘనత దేశంలో ఒక్క సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. క్రీడాకారుల కీర్తి శాశ్వతం.. మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం స్థాపన సాధ్యమవుతుందన్నారు. రాజకీయ నాయకులకు ఐదేళ్లపాటే పదవీ కాలం ఉంటుందని, అదే క్రీడాకారులుగా రాణిస్తే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. కరణం మల్లేశ్వరి, పీవీ సింధు, సచిన్ టెండూల్కర్ వంటి క్రీడాకారులు ప్రపంచానికి గుర్తింపు తెచ్చారని తెలిపారు. వచ్చే బడ్జెట్లో క్రీడలకు అధిక నిధులు కేటాయించేలా చూడాలని క్రీడాశాఖమంత్రికి సూచించారు. సీఎం జగన్మోహన్రెడ్డిలాంటి నాయకుడు మరో 30 ఏళ్లు సీఎంగా కొనసాగాలన్నారు. ఇవే తన చివరి ఎన్నికలని, వచ్చేసారి మళ్లీ పోటీ చేయనని, అయినా జీవితాంతం జగన్ అండగా నిలుస్తానని అన్నారు. ఎంపీ బెల్లాన చంధ్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ క్రీడావికాస కేంద్రంలో వాలీబాల్, 200 మీటర్ల ట్రాక్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు కోచ్‌ను నియమించాలని కోరారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడ సమీపంలో 5 ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేయాలని, ఎస్.ఎం.పురం పెద్ద చెరువును పర్యాటకంగా అభివృద్ధి పర్చాలని కోరారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడారు. క్రీడా వికాస కేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేసినందుకు ఇంజనీర్లు, కాంట్రాక్టకు షీల్డ్‌లు ఇచ్చి దుశ్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, సెట్‌శ్రీ సీఈవో వి.వి.ఆర్.ఎస్ మూర్తి, డీఎస్డీవో బి. శ్రీనివాసరావు, కోచ్ శ్రీధర్, అంబేడ్కర్ యూనివర్సిటీ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీవో ఎం.వి.రమణ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఇండోర్ స్టేడియం పూర్తయ్యేదెప్పుడో?
సాక్షి, జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన ఇప్పటికి ఒక్క ఇండోర్ స్టేడియం కూడా లేదు. గతంలో నిర్మాణం ప్రారంభించిన ఏళ్లు గడుస్తున్నా... మోక్షం రావడం లేదు. దీంతో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాక్టిస్ చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇన్డోర్ స్టేడియాలపై ఆధారపడాల్సి వస్తుంది. దూర భారంతో పాటు వ్యయ ప్రయాసాలతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేద, మద్యతరగతి క్రీడాకారులు క్రీడలకు దూరమవుతున్నారు. నిధులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో ఇండోర్ స్టేడియం పనులు నిలిచిపోయాయి. మంజురు అయిన డబ్బులతో చేపట్టిన కాస్త పనులు అసంపూర్తిగా ఉండి విద్యార్థులను నిరాశలోకి నెట్టుతున్నాయి. పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. 2011లో ప్రారంభం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అవరణలో 2011లో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ ద్వారా ఇండోర్ స్టేడియం మంజూరైంది. ఇండోర్ స్టేడియానికి మొత్తం రూ. 40 లక్షలు ఖర్చును అంచనా వేయగా, ప్రభుత్వం రూ. 20 లక్షలు కేటాయించడంతో 2015లో కేవలం గోడలు వరకు మాత్రమే నిర్మించారు. దీంతో ఇంకా 20 లక్షలు అవసరమని అంచనా వేసారు. ప్రస్తుతం ఏళ్ల క్రితం అంచనా కాబట్టి మరింత ఖర్చు పెరిగే ఆవకాశం ఉంది. నిరాశలో విద్యార్థులు.. నిర్మాణం పూర్తి కాకపోవడంతో క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. ఫలితంగా క్రీడలకు దూరం కావాల్సి వస్తుందని క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. సంబందిత కళాశాలకు చెందిన విద్యార్థులు క్రీడా మెలకువలు మెరుగు పరుచుకునేందుకు కరీంనగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఆర్థికభారం పెరుగుతోంది. స్థానికంగా సౌకర్యాలు కల్పిస్తే ఇలాంటి దుస్థితి ఉండదని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మందికి ఆటల్లో ప్రావీ ణ్యం సాధించాలని ఉన్నా సౌకర్యాలు లేక మిన్నకుండి పోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇండోర్ స్టేడియం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పనులు పూర్తి చేయాలి క్రీడాకారుల కోసం నిర్మాణం చేపట్టిన ఇన్డోర్ స్టేడియం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో రాణించలేక పోతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. త్వరగా పూర్తి చేస్తే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది – అంజలి, విద్యార్థిని, జగిత్యాల ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది జిల్లాలో ఇండోర్ స్టేడియం లేక విద్యార్థులు, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసక్తి ఉన్న ఏమి చేయలేని పరిస్థితి నెలకోంది. కరీంనగర్, హైదారాబాద్‌కు వెళ్లి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. త్వరగా పూర్తి చేస్తే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదు. – సుమన్, విద్యార్థి, జగిత్యాల -
వావ్ ‘బ్రేవ్’
-
విద్యార్థుల చేతుల్లోనే దేశాభివృధ్ధి
అనంతపురం సప్తగిరిసర్కిల్ : దేశాభివృద్ధి విద్యార్థుల చేతుల్లోనే ఉందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేకన్న తెలిపారు. గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో సైనికుల సహాయార్థం అనంతపురం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాక్సింగ్ టోర్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు కార్యదర్శి తిమ్మారెడ్డి, సభ్యులు పెంచలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ అంతర్గతంగాను, ఆర్మీ వ్యవస్థ బహిర్గతంగా దేశానికి రక్షణ అందిస్తున్నాయన్నారు. దేశ సంరక్షణకు లింగభేదం అక్కర్లేదని చెప్పారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. టోర్నీ ద్వారా సమకూరిన నగదును మాజీ సైనికులకు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చైర్మెన్ హరికృష్ణ, కార్యదర్శి మహేష్ అందించారు. విజేతలకు ప్రశంసా పత్రాలలు అందజేశారు. అనంతరం సబ్–జూనియర్ జిల్లా బాలుర జట్టును ఎంపిక చేశారు. వీరు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి సబ్–జూనియర్ క్రీడా పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో అక్బర్ అలీ, వేదవతి, ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి శివ పాల్గొన్నారు. సబ్–జూనియర్ బాలుర జట్టు 34 కిలోల విభాగం–హరీష్, 40–యోగానంద, 42–మనోహర్, 44–వినయ్, 46–వెంకటేష్, 48–మదన్, 50–గోవర్ధన్, 53–నాగరాజు, 60–కిషోర్, 65–కిరణ్, 70–హాజి మలంగ్ -
ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
భీమవరం టౌన్ : స్థానిక డీఎన్నార్ కళాశాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జేఎ¯Œæటీయూకే అంతర కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ముగిశాయి. బాలుర విభాగంలో పి.సుమంత్(వీఆర్ఎస్ వైఎన్నార్ కళాశాల, ఒంగోలు), జీవీ సురేంద్ర (కైట్, కోరంగి), పి.రాహుల్ కిశోర్ (వీఈడీ, విజయనగరం), డి.అనిల్‌కుమార్ (డీఎన్నార్, భీమవరం), బీహెచ్ వీఎస్‌ఎస్‌ఎన్ ప్రవీణ్(పొట్టి శ్రీరాములు, విజయవాడ) ఎస్కే కార్తిముల్‌్బ(కైట్, కోరంగి), జి.అనిల్ కుమార్ (సెయింట్ ఆన్స్, చీరాల) గెలుపొందినట్టు నిర్వాహకులు ప్రకటించారు. టోర్నమెంట్‌కు జెఎన్టీయూకే అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.శ్యామ్‌కుమార్ నాని ప్రసాద్(విజయవాడ), చంద్రశేఖర్ (వైజాగ్) సెలక్షన్ కమిటీ మెంబర్లుగా వ్యవహరించారు. విజేతలను డీఎన్నార్ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, సభ్యులు అభినందించారు. -
హేండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక
ఏలూరు రూరల్ : వచ్చేనెల 1, 2 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీ ల్లో పాల్గొనే జిల్లా హేండ్‌బాల్ జూనియర్ జట్టును జిల్లా హేండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పీఆర్ఎం లెనిన్, టి.కొండలరావు బుధవారం ప్రకటించారు. మంగళవారం ఏలూరు ఇండోర్‌స్టేడియంలో విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. జిల్లా జట్టు ఇదే.. ఎం.సుకుమార్, ఎ.చందు, ఎస్కే కాశీం(కేపీడీటీ, ఏలూరు), ఇ.ప్రవీణ్, బి.సాయికుమార్, డి.చంటి, కె.పండు, టి.గణేష్(ఎస్పీడీటీ, ఏలూరు), బి.వెంకటేశ్వరరావు (సింగన్నగూడెం), పి.ముకుల్ జీ(టీపీగూడెం), కె.శ్రీను, ఎం.శివకష్ణ(భీమడోలు), ఎ.శ్రీ హర్ష(బుట్టాయిగూడెం), కె.ఆకాష్(కోపల్లి), డి.ప్రశాంత్( ఏలూరు పోలీస్ స్కూల్), జి.జయరాజు (ఆకివీడు), స్టాండ్‌బైగా కె.సునీల్‌కుమార్, పి.సాల్మన్‌రాజు, బి.వెంకటేష్, ఎం.వెంకటేష్ ఎంపికయ్యారు. -
తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: స్థానిక ఇండోర్ స్టేడియంలో సీనియర్ తైక్వాండో జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గురుస్వామి తెలిపారు. ఎంపికైన జట్టు అక్టోబర్‌లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో జరిగే సీనియర్ అంతర్ జిల్లాల పోటీలలో పాల్గొంటుందన్నారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలు బాలురు 54 కేజీల విభాగం పి. బవాసీ 58 కేజీల విభాగం రామాంజినేయులు 63 కేజీల విభాగం వెంకటరమణ 68 కేజీల విభాగం శర్మాస్‌వలి 74 కేజీల విభాగం జయరాం కుమార్ 80 కేజీల విభాగం సురేంద్ర 87 కేజీల విభాగం ఉమా మహేష్ బాలికలు 46 కేజీల విభాగం ముబీనా ఖానుమ్ -
19న భూమిపూజ
హిందూపురం అర్బన్ : స్థానిక ఎంజీఎం మైదానంలోని ఇండోర్ స్టేడియంలో అభివృద్ధి పనులకు ఈనెల 19వlతేదీ ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజ చేస్తారని ఆయన పీఏ బాలాజీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కార్మిక, క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలిసి స్టేడియం అభివృద్ధి పనులు, నిధులు మంజూరుపై ఎమ్మెల్యే చర్చించారని ఆయన తెలిపారు. రూ.17 కోట్లతో స్టేడియంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టడానికి మంత్రి ఆమోదించారని తొలివిడతగా రూ.6 కోట్లు మంజూరు చేశారని వివరించారు. -
ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి
కోలారు : కన్నడ సినీ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి వేడుకలను ఆదివారం నగరంలోని గాంధీవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నడ సేన అధ్యక్షుడు కళావిద విష్ణు మాట్లాడుతూ... రాజ్‌కుమార్ జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్నారు. కన్నడ భాష , సంస్కృతికి అనిరత సేవలు అందించిన డాక్టర్ రాజ్‌కుమార్ జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండు చేశారు. నగరంలో కొత్తగా నిర్మించిన ఇండోర్ స్టేడియంకు డాక్టర్ రాజ్‌కుమార్ పేరు పెట్టాలన్నారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ అభిమానుల సంఘం అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్‌కుమార్ అభిమానుల సంఘం గౌరవా ద్యక్షుడు ధన్‌రాజ్, పాత్రికేయుడు గణేష్, చేతన్‌బాబు, కోనా మంజునాథ్ తదితరులు ఉన్నారు. ముళబాగిలులో... ముళబాగిలు : కన్నడ నటుడు డాక్టర్ రాజకుమార్ జయంతి వేడుకలను ఆదివారం జయ కర్ణాటక ఆధ్వర్యంలో పట్టణంలోని సంత మైదానంలో ఘనంగా నిర్వహించారు.అ భిమానులు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా కసాప మాజీ కార్యదర్శి శంకర్ కేసరి మాట్లాడుతూ... డాక్టర్ రాజ్‌కుమార్ చిత్రాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జయక ర్ణాటక అధ్యక్షుడు నందకిశోర్, శక్తి ప్రసాద్, రాజు, శివప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయంలో బెంగుళూరులో మరణించిన క సాప మాజీ అధ్యక్షుడు పుండలీక హాలంబి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. -
భరించాల్సిందే!
ఏలూరు (మెట్రో) :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వరాలు ప్రకటించకపోగా.. జనమంతా తాను చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందేనని పరోక్షంగా స్పష్టం చేశారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. పరిశ్రమలకు రైతులు భూములు ఇవ్వాల్సిందేనని పునరుద్ఘాటించారు. గురువారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన చంద్రన్న స్వయం ఉపాధి కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తుందుర్రులో నిర్మించే ఆక్వా పార్క్ వల్ల ఎటువంటి నష్టం లేదన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణాన్ని భీమవరం, వీరవాసరం, నరసాపురం, మొగల్తూరు మండలాల ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆక్వా పార్క్ నుంచి వచ్చే వ్యర్థాలను, కలుషితాలను సముద్రంలోకి వదులుతారని ముఖ్యమంత్రి చెప్పగా, సముద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుందుర్రు ఆక్వా పార్క్ నుంచి వ్యర్థాలను నేరుగా అక్కడికి ఎలా తరలిస్తారన్న సందేహాలకు తెరలేపారు. పరిశ్రమలు లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని, పరిశ్రమలు కావాలంటే రైతులు భూములు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి పనికీ భూములు అవసరమని, రైతులు భూ సేకరణను అడ్డుకోవద్దని కోరారు. కొల్లేరు కాంటూర్‌పై స్పష్టత ఏదీ కొల్లేరు కాంటూరు కుదింపు విషయంలోనూ చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రకటన చేయలేదు. కాంటూర్‌ను కుదించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కొల్లేరు నాయకులు కోరగా.. ఎప్పటిలా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరుకు కాస్త ఊరట పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీని ఆదరించిన జిల్లా అని, ఈ జిల్లాకు అన్ని అంశాల్లో ప్రాధాన్య ఇస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఏలూరు ఎమ్మెల్యే, మేయర్ కలసి ప్రణాళికలు రూపొందిస్తే ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్ఎస్ఆర్కు పదవి రోగులకు సేవలు అందించేందుకు నిరంతరం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోనే ఉండే ఎమ్మెల్సీ రాము సూర్యారావు (ఆర్ఎస్ఆర్) మాస్టారు వంటి నాయకులు సమాజానికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి సలహా కమిటీ చైర్మన్‌గా ఆయనను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇసుక సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, పేద ప్రజలకు ఇసుక అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. కాపుల కోరిక నెరవేరింది : చినరాజప్ప ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కాపుల చిరకాల కోరిక సీఎం చంద్రబాబు ద్వారా నెరవేరిందన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల రుణంతోపాటు బ్రాహ్మణులకు రూ.50 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. కాపు మహిళల అభివృద్దికి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పారిశ్రామికవేత్తలను రప్పించి పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కాపుల సాధికారిత కోసం ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్ షేక్ నూర్జహాన్ ప్రసంగించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, శాసనమండలి విప్ అంగర రామ్మోహన్, జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, పులపర్తి రామాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులు, పితాని సత్యనారాయణ, బూరుగుపల్లి శేషారావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ కె.భాస్కర్ పాల్గొన్నారు. -
నిర్మాణం జాప్యం.. నిధులు వెనక్కి
ఆగిపోయిన ఆరు స్టేడియాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్న ఏడు మినీ స్టేడియాలు కర్నూలులో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల జాడే లేదు కల్లూరు: ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఏడాదిన్నర కాలంగా వివిధ కారణాలతో స్టేడియం నిర్మాణాలు చేపట్టలేదు. తాజాగా పాణ్యం, ఆదోని, బనగానపల్లె, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, మంత్రాలయం నియోజక వర్గాల్లో స్టేడియం నిర్మాణాలను పూర్తిగా నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన రూ. 2.10 కోట్ల నిధులు మొత్తం రూ. 12.60కోట్లు వెనక్కి వెళ్లాయి. ఆత్మకూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, డోన్, ఆలూరు, నంద్యాల, పత్తికొండలో మినీ స్టేడియం నిర్మానాలు నత్తనడకన సాగుతున్నాయి. కర్నూలు జిల్లా కేంద్రంలో రూ.6.72 కోట్లతో అవుట్డోర్ స్టేడియంలో చేపట్టిన క్రీడాభవనం, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులూ నిదానంగా సాగుతున్నాయి. ఇక కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల జాడే కనిపించడం లేదు. ఇటీవల కర్నూలులో నిర్మిస్తున్న స్టేడియం పనులను కలెక్టర్ విజయమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు ముందుకెళ్లకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి చివరికల్లా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. లేకపోతే రూ. 5 లక్షలు జరిమానా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎనిమిది నియోజకవర్గాల్లోనూ మార్చి చివరిలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
వేగం
ముంచుకొస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు 12లోగా ముందస్తు ప్రక్రియ పూర్తి ఆ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలతో నేతలు బిజీ ఆస్తిపన్ను రాయితీపై త్వరలో ప్రకటన సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. అధికారులు దీనికి సంబంధించిన పనులలో... అధికార పార్టీ నేతలు ప్రారంభోత్సవాలు... శంకుస్థాపనలలో బిజీగా ఉన్నారు. గత నాలుగైదు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇవి ఊపందుకున్నాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు వేగం పెరిగింది. ఇటీవ ల ఐడీహెచ్ కాలనీలో రెండు పడకగదుల ఇళ్ల ప్రారంభోత్సవం... ఇంటింటికీ రెండు రంగుల చెత్తడబ్బాల పంపిణీని సీఎం లాంఛనంగా ప్రారంభించడం తెలిసిందే. సోమవారం మధురానగర్‌లో అధికారులు రెండు రంగుల చెత్త డబ్బాల పంపిణీ చేశారు. లాలాపేటలో రూ.3.80 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియంను ఇటీవల మంత్రి పద్మారావు ప్రారంభించారు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఈ తరహా కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయి. ముషీరాబాద్ తదితర నియోజకవర్గాల్లో కాంట్రాక్టులు పూర్తి కాని రహదారులకు సైతం లాంఛనంగా శంకుస్థాపనలు చేసినట్లు తెలుస్తోంది. 15 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ డిసెంబర్ 12లోగా వార్డుల (డివిజన్ల) రిజర్వేషన్లతో సహా పోలింగ్‌కు సంబంధించిన ముందస్తు ప్రక్రియలు పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. వీరి సమాచారం ఆధారంగా 15 తరువాత ఎప్పుడైనా ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభానికి అవకాశం ఉండదు. ఈలోగానే వీటిని పూర్తి చేయాలి. ఇక మిగిలింది కేవలం 15 రోజులే. అందుకే అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. త్వరలో ఆస్తిపన్ను రాయితీ నగరంలోని మురికివాడలతో పాటు చిన్న ఇళ్లలో నివసిస్తున్న వారికి ఆస్తిపన్ను రాయితీ అతి త్వరలో అమలులోకి రాానుంది. ఆస్తిపన్ను రూ.1200లోపు ఉన్న వారికి రూ.101 మాత్రమే వసూలు చేయాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలను జీహెచ్ఎంసీ సోమవారం ప్రభుత్వానికి నివేదించింది. ఆమోదం పొందగానే దీనిపై ప్రకటన వెలువడుతుంది. దీని ద్వారా 5,09,187 ఇళ్ల యజమానులకు ప్రయోజనం కలుగనుంది. నీరు, విద్యుత్తు బిల్లులు రెండూ కలిసి నెలకు రూ.300 మించకుండా వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రహదారుల వైపు చూపు మరోవైపు 1000 కి.మీ. బీటీ రోడ్లు, 500 కి.మీ. వైట్‌టాపింగ్ రోడ్లకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే 912 బీటీ రహదారులకు రూ.337 కోట్లతో టెండర్లు పిలిచారు. నిరుద్యోగ యువతకు చెత్త సేకరణ ఆటోట్రాలీల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఈలైబ్రరీలు, జి మ్లపైనా శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే కూకట్‌ప ల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో డబుల్బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు జరగ్గా... మరికొన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపులకు రు ణాల పంపిణీని వేగవంతం చేశారు. మోడల్ మా ర్కెట్లు, మల్టీపర్పస్ హాళ్లు, చెరువుల సుందరీకర ణ, పబ్లిక్ టాయ్లెట్ల పనులపైనా దృష్టి సారించారు. -
తెలుగు టైటాన్స్ లోగో ఆవిష్కరణ
ఆగస్టు 4 నుంచి 7 వరకు గచ్చిబౌలిలో ప్రొ కబడ్డీ లీగ్ సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆడే తెలుగు టైటాన్స్ జట్టు లోగో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ లీగ్ జులై 18 నుంచి ఆగస్టు 23 వరకు జరుగుతుంది. ఇందులో తెలుగు టైటాన్స్ జట్టు ఆడే హోమ్ మ్యాచ్‌లు ఆగస్టు 4 నుంచి 7 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి. టైటాన్స్ జట్టులో ఇద్దరు ఇరాన్ క్రీడాకారులతో పాటు ఒక కొరియన్ క్రీడాకారుడు ఉన్నారు. మిగిలిన వాళ్లంతా తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు. కబడ్డీకి తగిన ప్రోత్సాహం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోగో ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. జట్టు యజమాని శ్రీరామినేని శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
శ్రీజకు టీమ్ స్వర్ణం
దక్షిణాసియా టీటీ టోర్నీ న్యూఢిల్లీ: దక్షిణాసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇక్కడి టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో శ్రీజ, శ్రుతి అమృతే, దీప్తి సెల్వకుమార్, మరియా రోనీలతో కూడిన భారత జూనియర్ బాలికల జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను భారత్ 3-0 స్కోరుతో ఓడించింది. టీమ్ విభాగంలో ఆకుల శ్రీజ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. -
ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు
సరూర్‌నగర్(రంగారెడ్డి జిల్లా): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు జూన్ 2న నగరంలోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కళాకారులు, ప్రజలు పాల్గొనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనాథరావు సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాటు కార్యక్రమాలను పరిశీలించారు. -
ఢిల్లీపై టైటాన్స్ విజయభేరి
ప్రొ కబడ్డీ లీగ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీపై 45-26 తేడాతో నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ వేదికపై నాలుగు మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకోగా... వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. సొంత వేదికల్లో జరిగిన మ్యాచ్‌లను ఓటమి లేకుండా ముగించిన టైటాన్స్... ఇదే ఘనతతో ఉన్న ‘యు ముంబ’ సరసన నిలిచింది. ఈ లీగ్‌లో వైజాగ్ వేదికగా ఇదే చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు పోటెత్తారు. మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు జోరు కనబరిచారు. పదో నిమిషంలోనే జట్టు లోనా సాధించింది. ప్రథమార్ధం 20-12తో ముగించగా ఆ తర్వాత కూడా ఢిల్లీ ఆటగాళ్లను కుదురుకోనీయలేదు. ఓవరాల్‌గా రాహుల్ 12 రైడ్ పాయింట్లు, సుకేశ్ హెగ్డే 7 పాయింట్లు సాధించారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో తర్వాతి దశలో మ్యాచ్‌లు జైపూర్‌లో జరుగుతాయి. కబడ్డీపై అభిషేక్ సినిమా! ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ కబడ్డీ ఆటపైనే పూర్తి స్థాయిలో సినిమా తీయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. -
కోటలో తొలిసారిజెండా పండుగ
సాక్షి, హన్మకొండ : కాకతీయుల కోట వేదికగా స్వాతం త్య్ర వేడుకలు కనుల పండువగా జరగనున్నాయి. 68వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఖిలావరంగల్ ముస్తాబైంది. శుక్రవారం ఉదయం 9గంటలకు కాకతీయ కీర్తితోరణాలు, ఖుష్‌మహల్ మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను డిప్యూటీ సీఎం సన్మానిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తొలి స్వాతంత్య్ర వేడుకలకు వేదికగా ఖిలావరంగల్‌ను ఎంపిక చేశారు. ఏర్పాట్లు పూర్తి.. పోలీసులు, సైనిక దళాల కవాతు చేసేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీఐపీలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలకు ఈ వేడుకలు తిలకించేందుకు అనువుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థలాన్ని సిద్ధం చేశారు. ఇక్కడ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు కళారూపాలను, ఆ తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాలను ప్రదర్శిస్తారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలకు ఉపముఖ్యమంత్రి ప్రశాంస పత్రాలను అందిస్తారు. ఈ వేడుల సందర్భంగా పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ భద్రతా వ్యవహారాలను ఏఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు ఓఎస్డీలు, పది మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 20మంది ఎస్పైలతో పాటు వివిధ విభాగాలకు చెందిన కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటారు. ఇండోర్ స్టేడియంలో అట్ హోం వేడుకలు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సాయంత్రం 5గంటలకు హన్మకొండ ఇండోర్ స్టేడియంలో అట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, పాత్రికేయులు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సెయింట్‌పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్, అతిథి మానసిక వికలాంగుల కేంద్రం, ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, కరీమాబాద్ సీవీ హైస్కూల్, హసన్‌పర్తి సూజాత విద్యానికేతన్ హైస్కూల్, మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సెయింట్ థామస్ గ్రామర్ హైస్కూల్, నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలభవన్, శ్లోకా హైస్కూల్‌కు చె ందిన విద్యార్థులు కళా ప్రదర్శలను ఇస్తారు. గర్వించదగ్గ రీతిలో వేడుకలు : కలెక్టర్ ఖిలావరంగల్ : కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటలో 68వ స్వాతంత్య్ర వేడుకలు జిల్లా ప్రజలు గర్వంచదగ్గరీతిలో జరగనున్నాయని జిల్లా కలెక్టర్ కిషన్ తెలిపారు. ఖిలావరంగల్ కోటలో పంద్రాగస్టు వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్ కిషన్, నగర పాలక సంస్థ క మిషనర్ సువర్ణపాండదాస్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ప్రాంతాలలోనే 68వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణరుుంచిందని, ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేడుకలు కోటలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖుష్‌మహల్ పక్కనే ఉన్న స్థలంలో జాతీయ పతాకావిష్కరణ జరుగుతుందని తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులకు, సామన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో అడిషనల్ ఎస్పీ యాదయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రక రణ్, ఆర్డీఓ మాధవరావు ఉన్నారు. -
ముందుకు సాగని ‘ఇండోర్’
ఇల్లెందు : క్రీడారంగాన్ని ప్రోత్సహించాలంటే అందుకు అనువైన సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఇందుకోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికకు అవసరమైన పోటీలు నిర్వహించేందుకు ఇండోర్ స్టేడియం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాలో రెండు స్టేడియాల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభం కాగా, మిగిలిన వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక్కో స్టేడియం నిర్మాణానికి రూ.1.10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. 2012-13 మార్చిలో స్టేడియాల నిర్మాణానికి పలు చోట్ల స్థలాలను అన్వేషించారు. జిలాల్లో ఖమ్మం, కొత్తగూడెం, వైరాలో ఇప్పటికే ఉన్న స్టేడియాలను అధునికీకరించి, మిగతా నియోజకవర్గాల్లో నూతనంగా నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో పినపాక, మధిర నియోజకవర్గం చింతకానిలో స్థలాలు లభించటంతో నిర్మాణం చేపట్టారు. ఇక ఇల్లెందు, భద్రాచలం, పాలేరు, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాలు లభించక పనులు ప్రారంభించ లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వమైనా.. చొరవ తీసుకుని స్టేడియాలను నిర్మిస్తుందా అని క్రీడాభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2012-13లో జిల్లాలో ఒక్కో స్టేడియం నిర్మాణానికి రూ. 1.10 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇక ఇప్పటికే నిర్మితమై ఉన్న ఖమ్మం స్టేడియం ఆధునికీకరణకు రూ.20 లక్షలు, కొత్తగూడెంనకు రూ.5 ల క్షలు, వైరాకు రూ.60 లక్షలు మంజూరు చేశారు. మిగితా వాటిలో ఒక్కో స్టేడియం నిర్మాణానికి 5 నుంచి 10 ఎకరాల స్థలం అవసరం కాగా, ఆ భూమి దొరకకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. స్థల సమస్యతోనే నిర్మాణాల్లో జాప్యం : డీఎస్ఓ ఈ విషయమై జిల్లా డీఎస్ఓ కబీర్‌దాస్‌ను వివరణ కోరగా ...చింతకాని, పినపాకలో స్టేడియాలు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. మిగతా స్టేడియాల నిర్మాణానికి స్థలాలు లభించకపోవటం సమస్యగా మారిందన్నారు. ఇటీవల నూతన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన క్రీడల కార్యక్రమంలో ప్రతి పంచాయతీ కేంద్రంలో 2 నుంచి 3 ఎకరాలు, మండల కేంద్రంలో 5 నుంచి 7 ఎకరాలకు తగ్గకుండా స్థలాలు సేకరించాలని జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులకు లేఖలు పంపించిందన్నారు. అయితే నూతన ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే స్టేడియాల నిర్మాణం ఆధారపడి ఉంటుందన్నారు. -
స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్‌కు 200 మంది హాజరు
హుడాకాంప్లెక్స్: రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. 2014-15 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో అడ్మిషన్ల కొరకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 200 మంది బాలబాలికలు ఇందులో పాల్గొన్నారని జిల్లా క్రీడాధికారి ఇ.వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ సెలక్షన్ ట్రయల్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా నుంచి 20 మంది చొప్పున బాలబాలికలను ఎంపిక చేసి వచ్చే నెలలో హకీంపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సెలక్షన్స్‌కు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. గురువారం కూడా సెలక్షన్ ట్రయల్స్ జరుగుతాయి. -
హ్యాండ్‌బాల్ విజేత: ఎల్బీ స్టేడియం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ క్రీడలు ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ క్రీడల్లో భాగంగా హ్యాండ్‌బాల్ పురుషుల టీమ్ టైటిల్‌ను ఎల్బీ స్టేడియం జట్టు చేజిక్కించుకుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఎల్బీ స్టేడియం జట్టు 32-27 స్కోరుతో భవాన్స్ కాలేజిపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఎల్బీ స్టేడియం 15-10తో ఆధిక్యాన్ని సాధించింది. రాజ్ కుమార్, భగత్ సింగ్,వాస్‌లు చక్కటి నైపుణ్యాన్ని కనబర్చారు. భవాన్స్ కాలేజి జట్టులో వంశీ, అనిల్ రాణించారు. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో ఎల్బీ స్టేడియం జట్టు 17-11తో రంగారెడ్డి జిల్లా జట్టుపై, భవాన్స్ కాలేజి జట్టు 18-10తో సాయ్ హాస్టల్ జట్టుపై గెలిచాయి. విజేతలకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రైతు తృప్తిగా జీవించాలన్నదే లక్ష్యం
- సాగునీరు సక్రమంగా అందాలి - తాగునీటి సమస్య పరిష్కరించా - నరసన్నపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణదాస్ నరసన్నపేట, న్యూస్‌లైన్: రైతులంతా తృప్తిగా జీవించాలని, పేదవాడి ముఖంలో నిరంతరం చిరునవ్వు కని పించాలన్నదే లక్ష్యమని నరసన్నపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కరించానని చెప్పారు. సక్రమంగా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నానన్నారు. ‘న్యూస్‌లైన్’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. న్యూస్‌లైన్: రైతులకు ఏమి చేయాలనుకుంటున్నారు? కృష్ణదాస్: వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కోట్లాది రూపాయలతో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించాను. వీటిలో కొన్ని మరమ్మతులకు గురై పని చేయడం లేదు. వీటన్నింటిని బాగు చేయించి రైతులకు సక్రమంగా సాగునీరు అందేలా చూస్తాను. న్యూస్‌లైన్: వంశధార ఓపెన్ హెడ్ చానల్స్ విషయంలో ఏమి చేయాలని అనుకుంటున్నారు..? కృష్ణదాస్: నరసన్నపేట, పోలాకి, జలుమూరులో కొంత ప్రాంతం రైతులకు సాగునీరు సరఫరా చేసేందుకు వంశధార ఓపెన్‌హెడ్ చానల్స్ నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపాను. వైఎస్ హయాంలో దీన్ని మంజూరు చేయించాను. అప్పట్లో రూ. 25 కోట్లతో పూర్తి కావాల్సిన ఈ పథకాలు ఆ తరువాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ. 90 కోట్లు బడ్జెట్‌కు చేరుకుంది. జగన్మోహన్రెడ్డి సీఎం అయిన వెంటనే వీటి కోసం ఒత్తిడి చేసి నిధులు మంజూరు చేయించి ఓపెన్‌హెడ్ చానల్స్ నిర్మాణం తొందరగా జరిగేలా చూస్తా. న్యూస్‌లైన్: తాగునీటి సమస్యపై మీరు ఏమంటారు? కృష్ణదాస్: చాలా వరకు తాగునీటి సమస్య పరిష్కరించాను. ప్రధానంగా తీర ప్రాంత ప్రజలకు ఈ సమస్య ఎదురు కాకుండా వైఎస్ హయాంలో 40 గ్రామాలకు ప్రత్యేక పథకం రూపొందించా. ఈ పథకాన్ని మరింత మెరుగు పరిచి ఎక్కడా మంచినీటి సమస్య లేకుండా చూస్తా. న్యూస్‌లైన్: నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి? కృష్ణదాస్: ప్రతీ గ్రామానికి రోడ్డు నిర్మాణం జరిగింది. ఉడా నిధులతో టౌన్లో, నాబార్డు నిధులతో గ్రామీణ ప్రాంతాలకు లింక్ చేస్తూ రోడ్ల నిర్మాణం జరిగింది. మరిన్ని రోడ్ల పూర్తికి కృషి చేస్తా. న్యూస్‌లైన్: పేదలకు ఇళ్ల మంజూరుపై ఏమంటారు? కృష్ణదాస్: తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలోపలే దివంగత నేత వైఎస్‌ని నరసన్నపేటకు ఆహ్వానించాను. నరసన్నపేట, సత్యవరం సభల్లో 800 ఇళ్లు మంజూరు చేశారు. 70 శాతం వరకు నిర్మాణం పూర్తయ్యాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు గృహ నిర్మాణాలపై శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పటికీ చాలామంది ఇళ్ల కోసం తిరుగుతున్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాను. న్యూస్‌లైన్: నరసన్నపేటలో ఇండోర్‌స్టేడియం ఏర్పాటు కలగానే మిగిలిపోయింది? కృష్ణదాస్: ఇండోర్‌స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం. ప్రభుత్వం కూడా స్పందించి స్థల సేకరణ కోసం ఆదేశాలు జారీ చేసింది. న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో ప్రజాస్పందన ఎలా ఉంది? కృష్ణదాస్: ప్రజా స్పందన చాలాబాగుంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, ఫ్యాన్ గుర్తుకు ఓటు ఎప్పుడు వేయాలా అని జనం ఎదురు చూస్తున్నారు. -
55 కేజీ విజేత రామ్మూర్తి
హుడా కాంప్లెక్స్, న్యూస్‌లైన్: జాతీయ స్థాయి జూనియర్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో 55 కేజీ విభాగంలో రామ్మూర్తి విజేతగా నిలిచాడు. జ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగాయి. 55, 60, 65, 70, 75, 80, 85 కేజీ విభాగాల్లో మిస్టర్ ఇండియా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పాటు తెలంగాణ నుంచి పలువురు బాడీబిల్డర్లు పాల్గొన్నారు. 55 కేజీ విభాగంలో మొదటి స్థానం దక్కించుకున్న రామ్మూర్తి (తమిళనాడు)కి హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముద్దగౌని రాంమోహన్‌గౌడ్ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్‌మోర్, కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయ చైర్మన్ సుదర్శన్ యాదవ్, తెలంగాణ అమెచ్యూర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బెన్ని ఫ్రాన్సిస్, నర్సింగంరెడ్డి, పి.మల్లారెడ్డి, సలీం, దయానిధి, శ్రీనివాస్, సంజీవ్, కె.శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విజేత మధురానగర్ షాట్స్
ఇంటర్ క్లబ్ బ్మాడ్మింటన్ టోర్నీ జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ అంతర్ జిల్లా ఇంటర్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మధురానగర్ షాట్స్ జట్టు విజేతగా నిలిచింది. మధురానగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో 5 జిల్లాలకు చెందిన 13 క్లబ్‌లు పాల్గొన్నాయి. శనివారం జరిగిన ఈ పోటీల ఫైనల్లో మధురానగర్ షాట్స్ 3-0తో మధురానగర్-సీపై విజయం సాధించింది. వివేక్ (షాట్స్) 15-10, 15-9తో నవనీత్‌పై నెగ్గగా... సృష్టి (షాట్స్) 15-8, 15-10తో కేయూరపై గెలుపొందింది. అన ంతరం డబుల్స్ విభాగంలో ఏవీ రాజు-అనిల్ రెడ్డి జోడి (షాట్స్) 15-7, 15-6తో శేషాద్రి-రవి జంటను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో మధురానగర్-సి 3-1తో మధురానగర్-ఎపై, మధురానగర్ షాట్స్ 3-0తో సరూర్‌నగర్-బిపై గెలుపొందాయి. విజేతలకు హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు సోమరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడోత్సాహం
జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కడపలోని ఆ శాఖ పరెడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న క్రీడలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. ఎస్పీ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, పోలీస్ సిబ్బంది ఆరు జట్లుగా పోటీల్లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్ సహా వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ క్రీడాంశాల్లో పోలీసులు పోటీ పడ్డారు. ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్‌లోనూ తమ సత్తా చాటారు. మున్సిపల్ స్టేడియంలో బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించారు. మొత్తమ్మీద ఈ పోటీలు పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపాయి. - న్యూస్‌లైన్, కడప అర్బన్ -
స్పోర్ట్స్ డేలో అలరించిన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: స్ప్రింగ్‌ఫీల్డ్స్ స్కూల్ వార్షిక స్పోర్ట్స్ డేను ఇటీవల నిర్వహించారు. మాసబ్‌ట్యాంక్, టోలిచౌకి రెండు శాఖలకు చెందిన స్కూల్స్ సంయుక్తంగా సినర్జీ-2014 పేరిట కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ డేను నిర్వహించింది. ఇందులో ఇరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఇందులో ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన ఫిట్నెస్ డ్రిల్స్, ఎరోబిక్స్, కరాటే, జిమ్నాస్టిక్స్ వేదికపై విద్యార్థులు చేసి చూపించారు. ఈ సందర్భంగా చదువుల్లో, క్రీడల్లో రాణించిన విద్యార్థులకు రూ. 10 వేల చొప్పు నగదు బహుమతితో పాటు, రోలింగ్ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్ వర్ష బెందే ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
కోచ్‌లకు ‘కోచింగ్’
తణుకు, న్యూస్‌లైన్: నైపుణ్యం గల కోచ్‌లు అందుబాటులో ఉంటేనే భవిష్యత్తులో ఏ క్రీడలోనైనా మంచి ఫలితాలు వస్తాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన దేశంలో కోచ్‌ల కొరత ఉన్నందున శిక్షణ ద్వారా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోచ్‌ల శిక్షణ శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 300 బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులో ఉన్నా నైపుణ్యం కలిగిన కోచ్‌లు 50కి మించి లేరని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్‌లో రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లే అద్భుతంగా రాణిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు చోట్ల కోచ్‌లకు ఈ ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో ఈ తరహాలో కోచింగ్ ఇవ్వడం దేశంలో ఇదే మొదటి సారి కావడం విశేషం. గతంలో చీరాలలో రెండు సార్లు శిబిరాలు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ అనంతరం ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో పురస్కారాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి కేసీ పున్నయ్యచౌదరి కూడా పాల్గొన్నారు. -
సౌత్‌జోన్ కబడ్డీ: రన్నరప్ ఆంధ్ర
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక 40-30తో ఆంధ్రను ఓడించి విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలోనూ కర్ణాటకకే టైటిల్ లభించింది. ఫైనల్లో కర్ణాటక 12-11తో సర్వీసెస్‌ను ఓడించింది. ఆంధ్ర జట్టుకు చెందిన శివ జ్యోతి ‘బెస్ట్ ప్లేయర్’ పురస్కారం గెలుచుకుంది. మహిళల సెమీఫైనల్స్‌లో కర్ణాటక 49-23తో పాండిచ్చేరిపై, ఆంధ్ర 50-39తో తమిళనాడుపై నెగ్గాయి. పురుషుల సెమీఫైనల్స్‌లో సర్వీసెస్ 39-28తో తమిళనాడుపై, కర్ణాటక 30-10తో హైదరాబాద్‌పై నెగ్గాయి. -
అంధుల క్రికెట్ విజేత టీవీ టవర్స్ జట్టు
హుడా కాంప్లెక్స్, న్యూస్‌లైన్: రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ టోర్నమెంట్‌ను మూసారంబాగ్ టీవీ టవర్ జట్టు గెలుచుకుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వైజాగ్ టీమ్‌పై నాలుగు వికెట్ల తేడాతో మూసారంబాగ్ టీవీ టవర్స్ నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన టీవీ టవర్స్ 10 ఓవర్లలో 113 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన వైజాగ్ టీమ్ 10 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి ఉండగా 17 పరుగులు సాధించి 2 వికెట్లను కోల్పోయింది. విజేతకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి రూ.15 వేలు, రన్నరప్‌కి రూ.10వేల నగదు అందించారు. -
ఇక నేవీ సంరంభం
=రేపట్నుంచి వేడుకలు ప్రారంభం =నెల రోజులపాటు కార్యక్రమాలు, 4న నేవీడే =నౌకాదళం సర్వ సన్నద్ధం విశాఖపట్నం, న్యూస్‌లైన్ : తూర్పు నౌకాదళ సంబరాలకు ఏటా మాదిరిగా విశాఖ వేదిక కానుం ది. ఈ నెల పదో తేదీన ప్రారంభమయ్యే ఈ వేడుకలు డిసెంబర్ 4న నేవీ డేతో ముగియనున్నాయి. సెలెం ట్ సర్వీస్ పేరిట నౌకాదళ సత్తాను చాటే విన్యాసాలకు సాగరతీరం మరోమారు స్వాగతం పలకనుంది. ఈస్ట్రన్ ఫ్లీట్ యుద్ధ నౌకలు తూర్పుతీరం వెంట కొలువుతీరి కనువిందు చేయనున్నాయి. నౌకాదళ సేవలకు అద్దం పట్టే నేవీ మేళా ప్రత్యేక ఆకర్షణ కానుంది. నెలరోజుల పాటు సంబ రంగా సాగే వివిధ కార్యక్రమాలకు ఆదివారం తెరలేవనుంది. ఏటా చిన్నారుల చిత్ర లేఖనంతో ప్రారంభించడం ఆనవాయితీ. చిన్నారులతో పా టు ప్రత్యేక బాలలకు సయితం వేరే కే టగిరీలో పోటీలు నిర్వహిస్తారు. వీరు యుద్ధ నౌకల్లో ఎక్కి సాహస విన్యాసాల్ని వీక్షించేందుకుఅనుమతిస్తున్నారు. పోర్ట్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల పదో తేదీన చిత్ర లేఖనం పోటీలు జరుగుతాయి. ప్రేమ సమాజంలో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. వినసొంపైనా నేవీ బ్యాండ్ వుడా పార్కులో 17న సంగీతాభిమానుల్ని ఓలలాడించనుంది. డే ఎట్ సీ పేరిట ఈ నెల 20న విన్యాసాల్ని ని ర్వహించనున్నారు. విద్యార్థులకు ఈ నెల 19, 20 తేదీల్లోనూ, ప్రత్యేక బా లలకు 22న, ప్రజల కోసం 23, 24 తేదీల్లో యుద్ధ నౌకల్ని డాక్లో బెర్తుల వద్దకే తీసుకురానున్నారు. ఆర్కే బీచ్ లో డిసెంబర్ 4న అకాశంలో డోర్నియర్లు, ఫైటర్లు విన్యాసాలు చేస్తుం డగా సాగరం నుంచి నేలపైకి వచ్చి శత్రు శిబిరాల్ని తుదముట్టించడం, జలాంతర్గామి ఒక్కసారిగా సముద్రంలో పైకి లేవడం, నౌకల నుంచే యుద్ధ విమానాలపై దాడిలాంటి విన్యాసాలతో విస్మయపరిచే ఆపరేషన్స్‌తో వేడుకలకు ముగింపు పలికేందుకు నేవీ సర్వసన్నద్ధమైంది. -
ఉద్యోగ గర్జన
‘స్వర్ణభారతి’ జనసంద్రమైంది. ఉద్యోగుల గర్జనతో హోరెత్తింది. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగాలకైనా సిద్ధమన్న వారి నినాదాలతో విశాఖ మార్మోగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక సంఘాలకు చెందిన వేలాదిమందితో ఇండోర్ స్టేడియం కిక్కిరిసిపోయింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సభలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఉద్వేగంగా ప్రసంగించారు. హైకోర్టు శిక్ష విధించినా ఉద్యోగుల పోరాటం ఆగదన్నారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 7వ తేదీన సమైక్య సభ జరిపి తీరుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి అవసరమైతే సంవత్సరంపాటైనా సమ్మె చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ‘పేదరికం, అమాయకత్వంతో కూడిన తెలంగాణ అనే ఒక ఆడపిల్లను కాస్త డబ్బు, సంస్కారం, గడుసుతనంతో కూడిన ఆంధ్ర పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్లి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే విడిపోవచ్చు. కానీ విడాకులు అన్నది చివరి ప్రాధాన్యత మాత్రమే’ అని అప్పటి ప్రధాన మంత్రి జవహార్‌లాల్ నెహ్రూ నిజామాబాద్‌లో బహిరంగ సభలో వ్యాఖ్యానించినట్టు ఏపీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చె ప్పారు. బుధవారం ఉదయం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పేరుతో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో భారీ సభకు ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అన్ని ఉద్యోగ సంఘాల రాష్ట్ర స్థాయి నాయకులతోపాటు వందల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర నినాదాల్లో స్టేడియం హోరెత్తిపోయింది. విద్యార్థులు చేసిన ఫ్లాష్‌మాబ్ అందరిన్నీ ఆకట్టుకుంది. ప్రజా సంఘాల నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా, సోనియా గాంధీ, కేసీఆర్, చంద్రబాబునాయుడు, చిరంజీవి, ఇతర రాజకీయ నాయకుల వ్యవహార శైలిని పాటల రూపంలో తూర్పారబట్టారు. అశోక్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ విభజనపై అప్పట్లో జరిగిన ఉద్యమాల సమయంలో జాతీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోవడం నుంచి తెలంగాణతో కలిపి రాష్ట్రం ఏర్పడడం, రాజధానిగా హైదరాబాద్ ఎదుగుదల వరకు అన్ని అంశాలను విశదీకరించారు. 1969లో ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ముల్కీ రూల్స్‌పై తెలంగాణ ప్రజలందరూ ఉద్యమించారన్నారు. 1972లో జై ఆంధ్రా ఉద్యమంతో బయటకు వెళ్లిపోవాలని కొంత మంది ఉద్యమించిన సమయంలో.. ‘భార్యాభర్తలు కొట్టుకోకూడదు. మీకు హైదరాబాద్ అనే అబ్బాయి ఉన్నాడు. వాడి కోసమైనా కలిసి ఉండాలి’ అని దేశ అత్తగారిలాంటి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇద్దరికీ సర్ది చెప్పి కాపురాన్ని నిలబెట్టిందన్నారు. ‘కట్నం ఇచ్చేటప్పుడు నీ ఆస్తి, నా ఆస్తి అని కొట్టుకొనే భార్యాభర్తలు పిల్లాడి చదువు విషయానికి వచ్చే సరికి భార్య నగలిస్తుంది, భర్త అన్ని రకాల రుణాలు తీసుకుంటాడు. ఆ రకంగా హైదరాబాద్ అనే పిల్లాడి భవిష్యత్తు కోసం అందరూ రక్తందారి పోసి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజినీర్లా చేశాం’ అని చెప్పుకొచ్చారు. ఆ రోజున అత్తగారు కుటుంబం సంక్షేమం కోసం భార్యాభర్తలు కలిసుండాలని చెబితే ప్రస్తుతం తెలంగాణ మేనత్తలా సోనియాగాంధీ మాత్రం విభజించాలని చూస్తోందన్నారు. 60 ఏళ్లు సంపాదించినదంతా భార్య, పిల్లడి కోసం ధారపోస్తే.. ఎదిగిన కొడుకులాంటి హైదరాబాద్‌ను తీసుకొని భార్య(తెలంగాణ) వెళ్లిపోతే ముసలి వయసులో ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో అదే పరిస్థితి సీమాంధ్రకు వచ్చిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే విజయనగరానికి చెందిన కేసీఆర్ తెలంగాణ వెళ్లి అబద్దాలతో ఉద్యమాన్ని నిర్మించాడని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లేని రాష్ట్రాన్ని ప్రజలెవరూ ఊహించుకోలేరని, సమైక్య రాష్ర్టం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమబాట పట్టాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఏపీఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విభజన నిర్ణయాన్ని యూపీఏ వెనక్కి తీసుకొనే వరకు సమ్మె చేస్తామన్నారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.వి.రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరికీ తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై యూపీఏ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎన్నికల్లో గట్టి బుద్ది చెబుతామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు నడిపితే సమైకాంధ్ర కోసం విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు ఉద్యమిస్తున్నారన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూని యన్ నాయకుడు దామోదర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోడానికే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, అదే జరిగితే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్టుల సమితి కన్వీనర్ వి.వి.రమణమూర్తి మాట్లాడుతూ నాయకులు లేకపోయినా సమైక్యాంధ్ర ఉద్యమం గ్రామాలకు కూడా పాకిందన్నారు. ఏ పోరాటానికైనా జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారన్నారు. నాన్‌పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ బాలమోహన్‌దాస్ మాట్లాడుతూ సమైక్యాంధ్రను సాధించుకోవాలంటే అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు. అనంతరం విద్యార్థి యువజన జేఏసీ నాయకుడు ఆడారి కిషోర్‌కుమార్, డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఉదయ్‌కుమార్, నాయవాదుల సంఘం నాయకుడు కర్రి ఆదిబాబు, జీవీఎంసీ గుర్తింపు యూనియన్ నాయకుడు ఆనందరావు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు ప్రసంగించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఏపీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ ైచైర్మన్ కె.ఈశ్వరరావు మాట్లాడుతూ జిల్లా మంత్రి బాలరాజును రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆయన ఇంటిని ముట్టడిం చినా, ఆయన మాత్రం తనపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి.గోపాలకృష్ణ, అన్ని సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.