సాక్షి, హైదరాబాద్: స్ప్రింగ్‌ఫీల్డ్స్ స్కూల్ వార్షిక స్పోర్ట్స్ డేను ఇటీవల నిర్వహించారు. మాసబ్‌ట్యాంక్, టోలిచౌకి రెండు శాఖలకు చెందిన స్కూల్స్ సంయుక్తంగా సినర్జీ-2014 పేరిట కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ డేను నిర్వహించింది. ఇందులో ఇరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.
ఇందులో ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన ఫిట్‌నెస్ డ్రిల్స్, ఎరోబిక్స్, కరాటే, జిమ్నాస్టిక్స్ వేదికపై విద్యార్థులు చేసి చూపించారు. ఈ సందర్భంగా చదువుల్లో, క్రీడల్లో రాణించిన విద్యార్థులకు రూ. 10 వేల చొప్పు నగదు బహుమతితో పాటు, రోలింగ్ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్ వర్ష బెందే ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
స్పోర్ట్స్ డేలో అలరించిన విద్యార్థులు
Published Fri, Jan 31 2014 12:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement