సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక 40-30తో ఆంధ్రను ఓడించి విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలోనూ కర్ణాటకకే టైటిల్ లభించింది. ఫైనల్లో కర్ణాటక 12-11తో సర్వీసెస్‌ను ఓడించింది.
ఆంధ్ర జట్టుకు చెందిన శివ జ్యోతి ‘బెస్ట్ ప్లేయర్’ పురస్కారం గెలుచుకుంది. మహిళల సెమీఫైనల్స్‌లో కర్ణాటక 49-23తో పాండిచ్చేరిపై, ఆంధ్ర 50-39తో తమిళనాడుపై నెగ్గాయి. పురుషుల సెమీఫైనల్స్‌లో సర్వీసెస్ 39-28తో తమిళనాడుపై, కర్ణాటక 30-10తో హైదరాబాద్‌పై నెగ్గాయి.
సౌత్‌జోన్ కబడ్డీ: రన్నరప్ ఆంధ్ర
Published Mon, Dec 23 2013 12:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement