కేరళ క్రీడాకారిణిని నిలువరిస్తున్న ఆంధ్ర జట్టు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ (సౌత్ జోన్)లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. ఇక్కడి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల విభాగంలో హైదరాబాద్, మహిళల విభాగంలో ఆంధ్ర జట్టు సెమీస్ చేరుకున్నాయి.
ఈ పోటీల్లో రెండో రోజు శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 33-25 స్కోరుతో కేరళ జట్టుపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. హైదరాబాద్ జట్టులో మహేందర్‌రెడ్డి, మల్లేష్ రాణించారు. మహిళల విభాగంలో ఆంధ్ర 39-36తో కేరళను చిత్తు చేసింది. ఫలితంగా లీగ్‌లో వరుసగా రెండో విజయంతో సెమీస్ స్థానం దక్కించుకుంది. పురుషుల విభాగంలో హైదరాబాద్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, సర్వీసెస్...మహిళల విభాగంలో ఆంధ్రతో పాటు తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి జట్లు సెమీస్‌కి చేరాయి.