ఆంధ్రప్రదేశ్
► ఏపీ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో మరో మార్పు చేపట్టిన ప్రభుత్వం
మంత్రులు, అధికారుల పేషీల్లో సిబ్బంది కాలపరిమితి విధిస్తూ ఉత్తర్వులు
మంత్రుల పేషీలు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీ కార్యాలయాల్లోని సిబ్బందివి వర్తింపు
మూడేళ్లకు మించి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు
క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫోర్ ఉద్యోగి వరకు వర్తింపు
పేషీల్లో బదిలీలకు సంబంధించి నిలుపుదలకు కేవలం సీఎంవోకే అధికారం
డిసెంబర్ 31లోగా మార్పుచేర్పులు జరగాలని స్పష్టం చేసిన ప్రభుత్వం
► గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మించిన టీడీపీ కార్యాలయంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ఎమ్మెల్యే ఆర్కే
అక్రమ నిర్మాణమంటూ, భవనం కూల్చివేసి భూమిని సీఆర్‌డీఏ సరెండర్ చేసుకోవాలని పిటిషన్
సర్వే నెంబర్ 392లో 3.65 ఎకరాల పోరంబోకు భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణం
99 సంవత్సరాల పాటు లీజులకు తీసుకున్నట్టు పిటిషన్‌లో పేర్కొన్న ఆర్కే
ఇది అక్రమమని హైకోర్టు దృష్టికి తెచ్చిన ఆర్కే న్యాయవాది
వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను ఇతరులకు కేటాయించడం పర్యావరణ చట్టాలకు విరుద్ధం
గతంలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పిందని పేర్కొన్న ఆర్కే
గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషన్
తెలంగాణ
► బ్లాక్ డే సందర్భంగా హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధింపు
నగరంలో బైక్ ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు నిషేధం
► నేడు భారత్ - వెస్టిండీస్ మధ్య మ్యాచ్
ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం
స్టేడియం వద్ద 1800 మంది పోలీసులతో భారీ భద్రత
అర్థరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు
వెస్టిండీస్‌తో మొత్తం మూడు టీ20లు ఆడనున్న భారత్
జాతీయం
► బాబ్రీ మసీదు కూల్చివేసి నేటికి 27 ఏళ్లు
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత
ఉత్తరప్రదేశ్‌లో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసు ఉన్నతాధికారులు
పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment