sports day
-
గోదారి ఒడిలో ఎగసిన క్రీడాతరంగం..
సాక్షి,తూర్పు గోదావరి: అమ్మ ఒడి ఆలోచనకు అంకురమైతే ఆటపాటలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాలకు దారి చూపుతాయి. పిల్లల మస్తిష్క వికాసంలో చదువుతో పాటు క్రీడలూ ఎంతో దోహదపడతాయి. చదువే ప్రాణంగా పరిగణించేవారు కొందరైతే క్రీడల ద్వారా దేశ కీర్తిని పెంచాలనే వారు మరి కొందరుంటారు. క్రీడారంగంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ►అమలాపురానికి చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్ జిల్లా నుంచి తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడాడు. ఇది జిల్లా క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయమేనని చెప్పాలి. ఈ ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించగా వారిలో మన సాత్విక్ ఒకరు. సహ క్రీడాకారుడు చిరాగ్‌శెట్టితో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన సాత్విక్‌కు ఈ నెల 7న అమలాపురం ప్రజలు ఘన స్వాగతం పలికారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానంటూ భవిష్యత్ ప్రణాళికను ముందుగానే ప్రకటించాడు. సాత్విక్‌ను ప్రోత్సహిస్తూ ఒలింపిక్స్‌కు ముందే జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ►కూనవరం మండలం పీరా రామచంద్రపురం వలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజా రజిత 2019 అసోంలో జరిగిన జాతీయ పరుగు పోటీల్లో రజత పతకం సాంధించింది. త్వరలో కెన్యాలో నిర్వహించే అండర్–20 జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో దేశం తరఫున ఆమె పాల్గోనుంది. ►నేపాల్‌లో 2021 ఫిబ్రవరిలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో మామిడికుదురుకు చెందిన బోయి అర్జున్, అప్పనపల్లికి చెందిన బొంతు గీతికావేణి బంగారు పతకాలు సాధించారు. ►కాలికట్లో మార్చిలో జరిగిన 32వ సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో యానాం విద్యార్థిని సూదా తేజస్వి 1,500 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించింది. ►2020 డిసెంబర్లో పాయకరావుపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా జట్టు 34 బంగారు పతకాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ►జనవరిలో గుంటూరు జిల్లాలో జరిగిన వైఎస్సార్ స్మారక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల జిల్లా జట్టు ద్వితీయ స్థానం, మహిళల జిల్లా జట్టు ఆరో స్థానం దక్కించుకున్నాయి. ►పిఠాపురంలో ఫిబ్రవరి 2న రాష్ట్రస్థాయి రగ్బీ ఇన్స్ట్రక్టర్స్ రిఫ్రెషర్ కోర్స్ కం ప్రాక్టికల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. ►ఫిబ్రవరి 3న అమలాపురంలో జిల్లా స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో 120 మంది సత్తా చూపారు. ►ఫిబ్రవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పురోహితుల క్రికెట్ లీగ్ పోటీల్లో 12 జట్లుకు చెందిన 140 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ►మార్చి 3న రాజానగరం మండలం సంపత్‌నగరంలో 32వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ►పెద్దాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బిరదా సాయి సింధూజ జాతీయ సీనియర్ సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపికైంది. ధ్యాన్‌చంద్ పుట్టిన రోజే.. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో జన్మించిన భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ పుట్టిన రోజైన ఆగస్టు 29న జాతీ య క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన సారథ్యంలో భారత హాకీ జట్టు 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించి, భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించింది. చరిత ఘనం జిల్లాకు చెందిన డాక్టర్ సుంకర హనుమంతరావు 1948 ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సి ఉండగా ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లడంతో ఆగిపోయారు. 1952లో ఒలింపిక్స్‌లో ఆడాల్సి ఉన్న ఆయన సోదరుడు సుంకర వెంకట రమణారావు సాధనలో గాయం కారణంగా వెళ్లలేకపోయారు. ‘‘ఫాదర్ ఆఫ్ ఏపీ ఫుట్‌బాల్’’గా ఖ్యాతికెక్కిన సుంకర సుంకర భాస్కరరావు తన జీవితాన్ని క్రీడారంగానికే అంకితమిచ్చారు. రాజమహేంద్రవరంలో పుట్టి, పెరిగిన ఆయన 1975లో జిల్లా ఒలింపిక్ సంఘాన్ని స్థాపించారు. ఆయన అధ్యక్షుడుగా, అనపర్తికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు మల్లికార్జునరావు కార్యదర్శిగా క్రీడాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషి ఆరంభమైంది. పొట్టి శ్రీరాములు ఆలిండియా గోల్డ్‌కప్ టోర్నమెంట్లను సుంకర భాస్కరరావు నిర్వహించేవారు. 1978లో ఇండియా, స్వీడన్ మహిళా ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. క్రీడారంగానికి ఆయన అందించిన సేవలను గౌరవిస్తూ రాజమహేంద్రవరం గాంధీపురంలోని మున్సిపల్ పాఠశాలకు ‘సుంకర భాస్కరరావు’ పేరు పెట్టారు. జిల్లా ఒలింపిక్ సంఘానికి 1993లో వైడీ రామారావు, పిఠాపురానికి చెందిన ఎస్ఎస్వీ రత్నం అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2014 వరకూ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వైడీ రామారావు, పద్మనాభం పలు కార్యక్రమాలు నిర్వహించారు. 2016 నుంచి చుండ్రు గోవిందరాజు, కె.పద్మనాభం అధ్యక్ష కార్యదర్శులుగా సేవలందిస్తున్నారు. -
పీవీ సింధూ బయోపిక్‌లో దీపిక పదుకొనే!?
సాక్షి, హదరాబాద్: పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్... వెండితెరపై సందడి చేయనున్నారు. అదేంటి.. వీరంతా సినిమాల్లో నటిస్తున్నారా..! అని అనుకోకండి. వీరి జీవిత కథలతో సినిమాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు అప్పుడే పట్టాలపై కూడా ఎక్కేశాయి. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ స్టార్స్ పి.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్‌లకు సంబంధించిన బయోపిక్‌లు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మిథాలీరాజ్ బయోపిక్కు ‘శభాష్ మిత్తూ’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా..సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు. పీవీ సింధూ బయోపిక్కు సంబంధించి ఇంకా పాత్రల ఎంపికలోనే ఉంది. గల్లీ గ్రౌండ్ నుంచి అంతర్జాతీయ గ్రౌండ్ వరకు తమ సత్తా చాటిన మన హైదరాబాదీ క్రీడాకారుల బయోపిక్‌లు వెండితెరలపై కనువిందు చేయనున్నాయి. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారి బయోపిక్‌లకు సంబంధించిన వివరాలతో గల్లీ గ్రౌండ్ టూ బయోపిక్ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులు మన హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం. క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ దొరై, బ్యాడ్మింటన్ స్టార్స్ పీ.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్‌ల బయోపిక్‌లు నిర్మించేందుకు బాలీవుడ్ ముందుకొచ్చింది. ఒకప్పుడు గల్లీ గ్రౌండ్లో మొదలైన వీరి ప్రస్థానం దశల వారీగా అంతర్జాతీయ గ్రౌండ్లపై తమ సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. మారోసారి వీరికి సంబంధించిన బయోపిక్‌లతో వెండితెరపై కూడా వీరి సత్తాను చూపించడానికి రెడీ అవుతున్నారు. సింధూగా దీపిక? సింధూ బయోపిక్‌లో నటించే వారి వివరాలను మాత్రం సోనూసూద్ అప్పుడే వెల్లడించట్లేదు. బయోపిక్ నిర్మిస్తున్నట్లు ప్రకటించినప్పుడు సోనుసూద్‌కు ఎంతోమంది హీరోయిన్లు కాల్స్ చేసి మరీ మేం చేస్తామంటే మేం చేస్తామంటూ పోటీ పడ్డ విషయాన్ని ఆయన వివరించారు. అయితే పీవి ముఖానికి, తన ఎత్తు, పర్సనాలిటికి సంబంధించి సెట్ అయ్యేది ఒకే ఒక్కరు బాలివుడ్ టాప్ స్టార్ దీపిక పదుకొనే. గతంలోనే ఆమెను సోనుసూద్ సంప్రదించగా అంగీకరించారు. అప్పుడు తన కాల్షీట్స్ లేని కారణంగా బయోపిక్ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే.. ఇటీవల కాలంలో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత.. సింధూగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిలో నిజం లేదని సోనుసూద్ “సాక్షి’కి తెలిపారు. అన్నీ కలిసొస్తే దీపిక నటించే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చారు సోనుసూద్.! మిథాలీ, సింధు, సైనాలపై బాలీవుడ్, పుల్లెలపై టాలీవుడ్ ఇటీవల కాలంలో మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌ల ఆటకు యావత్ భారతం ఫిదా అయ్యింది. సింధూని ప్రపంచస్థాయి పోటీల్లో నిలబెట్టిన ఘనతను కోచ్ పుల్లెల గోపిచంద్ సొంతం చేసుకున్నారు. వీరి జీవిత చరిత్రలను బయోపిక్‌గా తీసేందుకు బాలివుడ్, టాలివుడ్ ముందుకొచ్చింది. సింధూపై బయోపిక్‌ని నిర్మించేందుకు ప్రముఖ నటుడు సోనుసూద్, మిథాలీరాజ్‌పై ‘వయోకామ్–18’, సైనా నెహ్వాల్‌పై సినిమా నిర్మించేందుకు ‘టీ సిరీస్’ సంస్థలు ముందుకు రాగా..కోచ్ పుల్లెల గోపిచంద్పై నిర్మించేందుకు టాలివుడ్‌కు చెందిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ముందుకొచ్చారు. లాక్డౌన్ ఎఫెక్ట్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కొంత షూటింగ్ జరిగి నిలిచిపోయాయి. లాక్డౌన్ లేకపోతే ఈ ఏడాది దసరా, క్రిస్మస్ టైంకి ఈ మూడు బయోపిక్‌లు విడుదలయ్యేవి. ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వచ్చే ఏడాది దసరా నాటికి ఈ మూడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పీ.వి.సింధూ బయోపిక్ మాత్రం వచ్చే ఏడాది ఇచివర్లో కానీ..2022 సమ్మర్లో కానీ విడుదలయ్యే అవాకాశం ఉందని సోనుసూద్ ‘సాక్షి’తో చెప్పారు. శ్రద్థా టు పరిణీతి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించేందుకు 2018లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కసరత్తులు చేసింది. తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో కూడా సైనా బయోపిక్‌లో నటిస్తున్నట్లు వెల్లడించింది. సరిగ్గా ఏడాది తిరిగేలోపు ఆమె స్థానంలో పరిణీతిచోప్రా చేరి శ్రద్ధ పక్కకు తప్పుకుంది. శ్రద్ధ కపూర్ కంటే పరిణీతి చోప్రానే సైనాలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. ప్రొఫెషన్ టూ పర్సనల్ లైఫ్ మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌లు చిన్నతనం నుంచి వారికి ఆయా ఆటలపై మక్కుల ఎలా వచ్చింది. ఆ సమయాల్లో వీరికి ఎవరెవరు ఏ విధమైన సాయం చేశారు, ఎవరెవరు విమర్శించారు, సంతోషాలు, విచారాలు ఇలా అన్ని అంశాలను పొందుపరుస్తూ ఈ బయోపిక్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలోని గల్లీల్లో ఆడుకునే వీరు ప్రపంచస్థాయికి ఎదిగిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు దర్శకులు సిద్ధమవుతున్నారు. పుల్లెల గోపీచంద్ చిన్న పాటి గ్రౌండ్ నుంచి అర్జున అవార్డు స్థాయి వరకు ఎలా వచ్చాడు, సింధూను ప్రపంచ పోటీలకు ఎలా తీసికెళ్లగలిగాడు అనే ప్రతి ఒక్క అంశాన్ని బయోపిక్‌లో చూపించనున్నారు. వారి ప్రొఫెషనల్ ఆటనే కాదు పర్సనల్ లైఫ్‌ని ఎంతవరకు పక్కన పెట్టారు, చిన్నపాటి సరదాలను కూడా వదులుకున్న సందర్భాలను కూడా ప్రేక్షకులకు ఈ బయోపిక్‌ల ద్వారా తెలపనున్నారు. తాప్సీ, పరిణీతిచోప్రా, సుధీర్బాబులే యాప్ట్ ఇటీవల విడుదలైన మిథాలీ బయోపిక్ ‘శభాష్ మిత్తూ’లో హీరోయిన్ తాప్సీ పొన్ను అచ్చుగుద్దినట్లు మిథాలీరాజ్లాగానే ఉంది. సైనా నెహ్వాల్‌తో కలసి నెట్ ప్రాక్టీస్ చేసిన బాలీవుడ్ నటి పరిణీతిచోప్రా సేమ్ సైనాను దించేసింది. ఇక పుల్లెల గోపీచంద్ పాత్రలో మన టాలివుడ్ హీరో సుధీర్‌బాబు కనువిందు చేయనున్నారు. ఈ ముగ్గురి క్రీడాకారుల ముఖాలకు ఇంచుమించు మ్యాచ్ అవుతున్న తాప్సీ, పరిణీతి, సుధీర్‌బాబులను సెలెక్ట్ చేసుకోవడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. వీరికి సంబంధించిన అప్డేట్స్ ఇటీవల కాలంలో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో రావడంతో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. చక్కగా యాప్ట్ అయ్యే క్యారెక్టర్లను ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో పొగడ్తల వెల్లువెత్తుతున్నాయి. ఆమె చెప్పిన వన్వర్డ్ ఆన్సర్‌తో ఫిదా అయ్యా మహిళల ప్రపంచ కప్‌కు ముందు జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మీ ఫేవరెట్ మేల్ క్రికెటర్ ఎవరంటూ ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మిథాలీరాజ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి యావత్ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. ఇదే క్వశ్చన్‌ను మీరు మేల్ క్రికెటర్‌ను ఎందుకడగరంటూ ప్రశ్నించింది. ఆ సన్నివేశం ఇంకా నా కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఆమె డేర్, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ నాకెంతో నచ్చాయి. మిథాలీలా నటించమని నన్ను అడగ్గానే యస్ చెప్పేశా. ఆ ఒక్క ఆన్సర్‌తో ఫిదా అయ్యాను. శభాష్ మిత్తూలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – తాప్సీ పొన్ను, బాలీవుడ్ నటి తనలా చేయడం గొప్ప అనుభూతి గ్రౌండ్లో సైనా నెహ్వాల్ ఆడుతున్న ఆటకు బాగా కనెక్ట్ అవుతాను. నేను అసలు ఎప్పుడూ ఉహించలేదు సైనాపై బయోపిక్ వస్తుందని..అందులో నేనే నటిస్తానని. తనతో కలసి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ, నేర్చుకుంటూ నటించడం చాలా అనుభూతిగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా అందర్నీ మెప్పిస్తాననే ధీమా ఉంది. – పరిణీతి చోప్రా, బాలీవుడ్ నటి గోపి.. నా ఇన్స్పిరేషన్ గోపి (గోపీచంద్) నా ఇన్స్పిరేషన్.. ఒక వ్యక్తిగా నేను పరిణితి చెందడంలో గోపి పాత్ర చాలా ఉంది. అతనితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ గర్వంగా అనిపిస్తుంది. ఆరోజుల్లో ఇద్దరం కలసి ఆడటం, ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాం. అతని బయోపిక్ ద్వారా రాబోయే తరం గోపిని ఆదర్శంగా తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటే వచ్చే ఏడాది చివర్లో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. – సుధీర్‌బాబు, సినీ హీరో కలసి ఆడాం.. అతనే చెయ్యడం హ్యాపీ ఒకప్పుడు నేనూ, హీరో సుధీర్‌బాబు కలసి విజయవాడలో బ్యాడ్మింటన్ ఆడాం. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు అతనే నా బయోపిక్‌లో నటించడం ఆనందంగా ఉంది. ప్రారంభ దినాల్లో మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఈ స్థాయికి ఎలా వచ్చేమనే విషయాలు ఈనాటి యువతకు బయోపిక్‌ల ద్వారా తెలపడం ఆనందంగా ఉంది. – పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ కోచ్. చాలా హ్యాపీగా ఉన్నా నా మీద బయోపిక్ రావడం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా పరిణీతి చోప్రా నాలా నటిస్తుంది. నానుంచి ఆమెకు కావల్సిన టిప్స్ అన్నీ ఇచ్చాను. షూటింగ్ అంతా పూర్తయ్యి రిలీజ్ అయితే ప్రేక్షకులతో కలసి చూడాలనిపిస్తుంది. – సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కష్టానికి గుర్తింపు బయోపిక్ చిన్నప్పటి నుంచి ప్రపంచస్థాయి వరకు నేను పడిన కష్టం, శ్రమకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, ప్రజల మన్నలను అందుకున్నాను. కానీ నేను పడిన కష్టం, ఆరోజుల్లో ఏ విధమైన వసతులు లేకుండా పట్టుబట్టి మరీ ఆటపై పట్టు సాధించడాన్ని ఇప్పుడు బయోపిక్ ద్వారా యావత్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం జరగడం ఆనందంగా ఉంది. విదేశీ గడ్డపై నా గెలుపు అనంతరం మువ్వెన్నెల జెండా రెపరెపలాడిన సమయంలో ఎంత సంతోషంగా ఉందో..ఇప్పుడు బయోపిక్ ద్వారా నా జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. – పీ.వి.సింధూ, బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్ రావడం ఆదర్శమనిపిస్తుంది ఒకప్పుడు క్రికెట్ అంటే అమ్మాయిలకెందుకు అనేవాళ్లు. మేం ప్రపంచకప్ పోటీల్లో ఆడిన ఆటకు తతి ఒక్కరూ ఫిదా అయ్యారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. అంతేకాకుండా తమ అమ్మాయిలను క్రికెట్ కెరీర్‌గా మలుచుకోమని పంపండం సంతోషంగా ఉంది. నా గురించి బయోపిక్ రావడం నిజంగా నేటితరం వారికి ఆదర్శమనిపిస్తుంది. – మిథాలీరాజ్ దొరై, ఇండియన్ క్రికెటర్ -
స్పోర్ట్స్ హాస్టల్‌కు సుస్తీ
వరంగల్ స్పోర్ట్స్: హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఆవరణలో ఉన్న వరంగల్ రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ భవనానికి సుస్తి చేసింది. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరింది. పగుళ్లు ఏర్పడి, పెచ్చులూడిన పైకప్పు నుంచి ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు భవనంలోని గోడలు తడిసి పాకురు పట్టాయి. అయినా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నేడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాస్టల్ స్థితిగతులు, క్రీడాకారుల వసతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా చెప్పుకుంటున్న వరంగల్ అందుకు తగ్గట్టుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. క్రీడాకారులకు పెద్ద పీట, క్రీడల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న పాలకుల హామీలు కాగితాల్లోనే పరిమితమయ్యాయి. జేఎన్‌ఎస్‌లోని వరంగల్ రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్లో అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, జిమ్నాస్టిక్స్ క్రీడల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ మూడు ఆటల క్రీడాకారుల్లో ప్రస్తుతం 108 మంది క్రీడాకారులు ఉంటున్నట్లు డీఎస్ఏ అధికారులు చెబుతున్నారు. అందులో 38మంది బాలికలు కాగా, మిగిలిన వారు బాలురు ఉంటున్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా రెండేళ్ల క్రితం బాలురను స్టేడియం ఆవరణలో నిర్మించిన కొత్త భవనంలోకి మార్చారు. బాలికలు మాత్రం పాత భవనంలోనే ఉంటున్నారు. ఇందులోనే క్రీడాకారులకు భోజనం వడ్డిస్తుంటారు. ఇక కొత్తగా నిర్మించిన భవన నిర్మాణంలో జరిగిన లోపాల వల్ల వర్షాలు కురిసిన ప్రతీసారీ వర్షపు నీరు హాస్టల్ వరండాలోకి చేరుతోంది. దీంతో క్రీడాకారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్టు లేదు.. ప్రమాదకరంగా భావించే జిమ్నాస్టిక్తోపాటు సాధారణంగా గాయాలు తగిలే అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్ క్రీడాకారులకు కనీసం ప్రాథమిక చికిత్స అందించే మందులు లేవు. చిన్నపాటి దెబ్బలు తగిలినప్పుడు క్రీడాకారులకు అప్లై చేసే పెయిన్ కిల్లర్ జెల్ కూడా హాస్టల్ క్రీడాకారులకు అందుబాటులో లేదు. అంతేకాదు జ్వరమొస్తే వేసుకునే పారాసెటమాల్ టాబ్లెట్లు కూడా లేకపోవడం విశేషం. జ్వరమొచ్చినా, చిన్న పాటి గాయమైన సంబందిత కోచ్ క్రీడాకారుడిని వెంటబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 108 మంది క్రీడాకారుల హెల్త్బడ్జెట్ రూ.3 వేలే.. స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటున్న 108 మంది క్రీడాకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ రూ.3వేలే కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న తరుణంలో కనీసం డెంగీ పరీక్ష చేసి, పది రోజులకు మందులు వాడాలంటేనే ఒక్కరికి కూడా ఆ సొమ్ము సరిపోదన్న విషయం తెలిసిందే. అలాంటి సమయంలో క్రీడాకారుడికి మేజర్‌గా గాయాలైన, ఇంకేమైనా మొదట ఖర్చు చేసి ఆ తర్వాత ‘సాట్’కు బిల్లులు పంపిస్తే అప్పుడు ఖర్చులు వెచ్చిస్తుందట. ఇదీ మన ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యం. కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపించాం శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, సాట్ చైర్మన్, ఎండీలకు ప్రతిపాదనలు పంపించాను. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వారానికోసారి స్పోర్ట్స్ హాస్టల్లో మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరాం. పిల్లలకు జ్వరం వచ్చినా, చిన్న గాయమైనా మేము దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్తాం. – ధనలక్ష్మి, డీవైఎస్ఓ, వరంగల్ అర్బన్ జిల్లా -
ఆంటీ కూతురా.. అమ్మో అప్సరా..
మెడికోల డ్యాన్సులతో వైద్య కళాశాల ఆడిటోరియం హోరెత్తింది.స్పోర్ట్స్ డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవం కనుల పండువగా సాగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తోటి విద్యార్థులు ఉత్సాహ పర్చడంతో సంబరం అంబరాన్ని అంటింది. అనంతపురం న్యూసిటీ: ‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సరా ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది. చామంతి పువ్వా.. పువ్వా నీకు బంతి పూల మేడకట్టనా. రంగేలి రవ్వా..రవ్వా.. నా సోకులన్నీ రంగరించనా, జామురాతిరి జాబిలమ్మా జోలపాడనా ఇలా.. అంటూ మెడికోలు వేసిన స్టెప్పులతో వైద్య కళాశాల ఆడిటోరియం అదిరిపోయింది’. స్పోర్ట్స్ డే సందర్భంగా శుక్రవారం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత నెల 18 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో వెయ్యి మంది విద్యార్థులు, వైద్యులు, నాన్ టీచింగ్ స్టాఫ్, మినిస్టీరియల్ స్టాఫ్‌కు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన 300 మందికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, ఎస్ఎస్బీఎన్ కళాశాల కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి, బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలో చదువుతో పాటు క్రీడలకు సమప్రాధాన్యత కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎస్బీఎన్ కళాశాల కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందన్నారు. స్పోర్ట్స్, గేమ్స్ మీట్లో 2కే15, 2కే16 విద్యార్థులు 52 పాయింట్లతో ఓవరాల్ చాంఫియన్‌షిప్ సాధించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సపాల్ డాక్టర్ జేసీ రెడ్డి, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషాదేవి, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ మాధవి, డాక్టర్ హేమలత, డాక్టర్ దుర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ ఆదిరెడ్డి పరదేశీనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్వీఐటీలో ఘనంగా స్పోర్ట్స్ డే
హంపాపురం (రాప్తాడు) : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని ఎస్వీఐటీ కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని హంపాపురం సమీపంలోని శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్ కళాశాల 7వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం కళాశాలలో స్పోర్ట్స్ డే నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. కళాశాల వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి , ప్రిన్సిపాల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడలు అవసరమన్నారు. అనంతరం పోటీల్లో గెలుపోందిన కళాశాల విద్యార్థులకు కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి బహుమతులను అందేజేశారు. ఈసందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ఆకట్టుకున్నాయి. కళాశాల ట్రెజరర్ రామసుబ్బమ్మ, సెక్రటరి సౌజన్య, ఏఓ మధుసూదన్‌రెడ్డి, పీడీ శ్రీనివాసులు నాయక్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
సగర్వంగా... సంతోషంగా...
* రాష్ట్రపతి భవన్లో ‘స్పోర్ట్స్ డే’ అవార్డుల ప్రదానం * ఖేల్‌రత్న అందుకున్న సింధు, సాక్షి, దీప, జీతూరాయ్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ పరువు నిలబెట్టిన క్రీడారత్నాలకు జాతీయ క్రీడాదినోత్సవాన ఘనంగా సత్కారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది ముగ్గురు మహిళలకు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు దక్కింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన క్రీడాపురస్కారాల వేడుకలో తెలుగమ్మాయి పి.వి. సింధుతో పాటు రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. షూటర్ జీతూరాయ్ కూడా ఈ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒకే ఏడాది నలుగురు క్రీడాకారులకు అత్యున్నత క్రీడాపురస్కారం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గతంలో బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్‌లకు 2009లో రాజీవ్ ఖేల్త్న్ర అందజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతియేటా ఆగస్టు 29న క్రీడాదినోత్సవాన్ని నిర్వహించే సంగతి తెలిసిందే. రియోలో బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు రజతం, రెజ్లింగ్‌లో సాక్షి కాంస్యం గెలిచారు. ఇక దీప జిమ్నాస్టిక్స్‌లో అసాధారణ విన్యాసంతో ఆకట్టుకుంది. తృటిలో కాంస్యం చేజారినా.. ఆమె చేసిన ప్రాణాంతక ప్రొడునోవా విన్యాసానికి గొప్ప గౌరవం లభించింది. ‘ఖేల్త్న్ర’ అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 7.5 లక్షల నగదు, సర్టిఫికెట్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. మరో 15 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు స్వీకరించారు. ఆరుగురు కోచ్‌లు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. క్రీడల్లో ప్రతిభకు పదునుపెడుతున్న పలు సంస్థలకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డులు ఇచ్చారు. పర్వతారోహకుడు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఇన్స్పెక్టర్ జనరల్ హర్భజన్ సింగ్‌కు ‘టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్’ అవార్డు లభించింది. అర్జున అవార్డును అందుకోవాల్సిన క్రికెటర్ రహానే అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమానికి రాలేదు. తెలుగు వెలుగులు ఈ సారి జాతీయ క్రీడాదినోత్సవ వేదికపై తెలుగువారికి చక్కని గుర్తింపు లభించింది. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు అత్యున్నత క్రీడాపురస్కారం అందుకుంటే... అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థారుులో పోటీపడే అథ్లెట్లను తయారు చేస్తున్న సీనియర్ కోచ్ నాగపురి రమేశ్‌కు ద్రోణాచార్య అవార్డు లభించింది. మాజీ అథ్లెట్ సత్తి గీత ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. అవార్డు గ్రహీతలు రాజీవ్ ఖేల్త్న్ర (పతకం, రూ. 7.5 లక్షలు): పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్). ద్రోణాచార్య (ట్రోఫీ, రూ. 7 లక్షలు): నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), రాజ్ కుమార్‌శర్మ (క్రికెట్లో కోహ్లి కోచ్), విశ్వేశ్వర్నంది (జిమ్నాస్టిక్స్‌లో దీప కోచ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), సాగర్మల్ దయాల్ (బాక్సింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (ట్రోఫీ, రూ. 5 లక్షలు): రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్, రఘునాథ్ (హాకీ), గుర్‌ప్రీత్‌సింగ్, అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫోగట్, అమిత్ కుమార్, వీరేందర్ సింగ్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ (మెమెంటో, రూ. 5 లక్షలు): సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనుస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షిల్కే (రోరుుంగ్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: యువ ప్రతిభావంతులను ప్రోత్సహించిన కేటగిరీ: హాకీ సిటిజన్ గ్రూప్, దాదర్ పార్సి జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్, ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్; కార్పొరేట్ సామాజిక బాధ్యత కేటగిరీ: ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫైనాన్స కార్పొరేట్ లిమిటెడ్; క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమ కేటగిరీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రీడాభివృద్ధి కేటగిరీ: సుబ్రతో ముఖర్జీ స్పోర్ట్స ఎడ్యుకేషన్ సొసైటీ. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ: పంజాబ్ యూనివర్సిటీ వీల్‌చెయిర్‌లో... రియో ఒలింపిక్స్‌లో గాయపడిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ అర్జున అవార్డును అందుకుంది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో... వీల్ చెయిర్లో వచ్చి పురస్కారం అందుకుంది. -
వెల్లివిరిసిన క్రీడానందం
268 మందికి నగదు ప్రోత్సాహకాలు సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చొరవను అభినందించిన ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి ఇకపై రాష్ట్ర స్థాయిలో ప్రోత్సాహకాలు అందజేస్తామన్న చైర్మన్ ముక్కాల నెల్లూరు(బందావనం): జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా నెల్లూరులో సోమవారం సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో క్రీడానందం వెల్లివిరిసింది. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ క్రీడల్లో రాణించిన 268 మంది క్రీడాకారులు నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలు అందుకున్నారు. ఫౌండేషన్ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు. ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రణాళికబద్ధంగా ప్రోత్సహిస్తే మెరికల్లా తయారై అద్భుత ఫలితాలు సాధిస్తారని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. దేశంలో క్రీడాకారుల, ప్రతిభ కొరవలేదని, కొరవడింది ప్రోత్సాహమేనన్నారు. క్రీడారంగానికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగా ఉందన్నారు. ఈ క్రమంలో సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చొరవ ప్రశంసనీయమన్నారు. అభినందనీయం ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే ఎందరో క్రీడాకారులు పుట్టుకొస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలరన్నారు. జిల్లా క్రీడాకారులకు సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు. త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీ త్వరలో జిల్లా క్రీడారంగానికి మహర్దశ కలగనుందని డీఎస్డీఓ పీవీ రమణయ్య అన్నారు. ఏసీ స్టేడియంలో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర స్థాయి పురస్కారాలు వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందజేస్తామని సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. క్రీడాపరంగా సింహపురి ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడించాలన్నదే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మొదట మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామమూర్తి,, జిల్లా పోలీస్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు ఎం.ప్రసాద్‌రావు, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.వి. వెంకట్, సభ్యులు సరాబు సుబ్రహ్మణ్యం, శ్రీరాంసురేష్, అమరా వెంకటేశ్వర్లు, వేల్చూరి సురేష్, సత్యకష్ణ, కె.వీరబ్రహ్మం, కార్పొరేటర్ ఓబిలిరవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ డే
-
విద్యార్థుల క్రీడా స్ఫూర్తి
వర్ధన్నపేట టౌన్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మండలంలోని ఏకశిల ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు ‘స్పోర్ట్స్ డే’ ఆంగ్ల అక్షర క్రమంలో కూర్చొని క్రీడా స్ఫూర్తిని చాటిచెప్పారు. ఈసందర్భంగా ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించి భారత క్రీతి ప్రతిష్టలను ఇనుమడింపజేశారన్నారు. ఆయన స్ఫూర్తితో గగన్ నారంగ్, కరణం మల్లీశ్వరి, అభినవ్æ బింద్రా. పీవీ సింధూ తదితర క్రీడాకారులు ఒలింపిక్ పతకాలను కైవసం చేసుకున్నారన్నారు. ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కె రవికిరణ్, ఏఓ ఎండీ.బాబా, ఉపాధ్యాయులు నర్సయ్య, భాస్కర్, సురేష్, నరేష్, సతీష్, నిరోషా, సామ్రాట్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన మిమిక్రీ
కర్నూలులోని జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి శివారెడ్డి చేసిన మిమిక్రీ నవ్వులు పూయించింది. కర్నూలు(జిల్లా పరిషత్): జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి వార్షికోత్సవంలో శివారెడ్డి మిమిక్రీ అలరించింది. శనివారం రాత్రి ఆ కళాశాల ఆవరణలో కల్చరల్, స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మాట్లాడుతూ.. తన జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నానన్నారు. రకరకాల ఉద్యోగాలు, పలు రకాల వ్యక్తులతో మెలగాల్సి రావడం ప్రస్తుత వృత్తికి దోహదపడిందన్నారు. నలుగురినీ నాలుగు కాలాల పాటు నవ్వించే ఆరోగ్యాన్ని భగవంతున్ని కోరుకుంటున్నాన్నారు. కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి పరిపూర్ణత సాధించాలంటే మానసిక,శారీరక వికాసాలు పెరగాలన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసాల కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా తమ కళాశాల ప్రోత్సహిస్తోందన్నారు. జి.పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ జి.రాఘవరెడ్డి మాట్లాడుతూ.. తమకు, తమ పిల్లలకు, పరిసరాల్లోని వారికి జి. పుల్లారెడ్డి నైతిక విలువలు పాటించేలా కథలు ఎలా చెప్పేవారో తెలిపారు. అధ్యాపకుల సూచనలు తనకు ఏవిధంగా ఉపయోగపడ్డాయో 1984-88 పూర్వ విద్యార్థి, ఈఆర్ఎస్ మెటల్స్ ప్రైవేటు లిమిటెడ్, చెన్నై డెరైక్టర్ పివిఎస్ మూర్తి వివరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
ఆటలు అదుర్స్..
-
స్పోర్ట్స్ డేలో అలరించిన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: స్ప్రింగ్‌ఫీల్డ్స్ స్కూల్ వార్షిక స్పోర్ట్స్ డేను ఇటీవల నిర్వహించారు. మాసబ్‌ట్యాంక్, టోలిచౌకి రెండు శాఖలకు చెందిన స్కూల్స్ సంయుక్తంగా సినర్జీ-2014 పేరిట కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ డేను నిర్వహించింది. ఇందులో ఇరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఇందులో ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన ఫిట్నెస్ డ్రిల్స్, ఎరోబిక్స్, కరాటే, జిమ్నాస్టిక్స్ వేదికపై విద్యార్థులు చేసి చూపించారు. ఈ సందర్భంగా చదువుల్లో, క్రీడల్లో రాణించిన విద్యార్థులకు రూ. 10 వేల చొప్పు నగదు బహుమతితో పాటు, రోలింగ్ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్ వర్ష బెందే ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
ఒక్క రోజులో లక్ష్యం చేరలేరు
ధ్యాన్‌చంద్ జయంతిని క్రీడా దినోత్సవంగా నిర్వహించడం ఒక హాకీ క్రీడాకారుడిగా నాకు గర్వకారణం. ఆ గొప్ప మనిషి వల్లే మాకు ఈ మాత్రం గుర్తింపు దక్కిందనడంలో సందేహం లేదు. ధ్యాన్‌చంద్ అద్భుతాల గురించి చెప్పే స్థాయి నాకు లేదు. కానీ ఆయన ఆట, మ్యాజిక్ కారణంగానే ప్రపంచ క్రీడా రంగానికి భారత్ అంటే ఏమిటో, హాకీ అంటే ఏమిటో తెలిసింది. నేను హాకీని ఎంచుకున్నప్పుడు దేశానికి ఆడతానని ఊహించలేదు. అలాంటి లక్ష్యాన్ని కూడా పెట్టుకోలేదు. అయితే ఏదో ఒక ఆట ఆడితే రైల్వేలోనే, బ్యాంకులోనో ఉద్యోగం దక్కుతుందనే ఆలోచన అప్పట్లో అందరికీ ఉండేది. మా ఇంటి వద్ద ఎక్కువ మంది హాకీ ఆటగాళ్లు ఉండేవారు. దాంతో సహజంగానే నాకు కూడా ఆటపై ఆసక్తి పెరిగింది. అయితే ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నా... హాకీపై ప్రేమ పెంచుకున్నాను. పట్టుదలగా ఆడి నా ఆటను మెరుగు పర్చుకున్నాను. ఫలితంగా అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. కొన్ని సార్లు ఇబ్బంది ఎదుర్కొన్నా కుంగిపోలేదు. కాబట్టే భారత్‌కు చాలాకాలం ఆడగలిగాను. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ఆటల్లో రాజకీయాలు బాగా పెరిగాయి. ఇక ఉద్యోగావకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉండి ఆటగాళ్లను వెనక్కి లాగుతున్నాయి. అయితే కుర్రాళ్లు స్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ప్రతిభ ఉన్నవాడికి ఏదీ అడ్డు కాదు. హాకీ స్టిక్ అంటే వెనకడుగు వేయాల్సిన పని లేదు. సత్తా ఉంటే ప్రోత్సహించేందుకు మాజీ ఆటగాడిగా నేను కూడా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాం. అయితే ఒక్క రోజులో స్టార్‌గా మారిపోయి గుర్తింపు తెచ్చుకోవాలంటే మాత్రం అసాధ్యం. ముందు ఆటను అభిమానించండి. నిరంతర శ్రమ, పట్టుదల ఉంటే అవకాశాలు దాని వెంటే వస్తాయి.