నృత్య ప్రదర్శనలో
మెడికోల డ్యాన్సులతో వైద్య కళాశాల ఆడిటోరియం హోరెత్తింది.స్పోర్ట్స్ డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవం కనుల పండువగా సాగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తోటి విద్యార్థులు ఉత్సాహ పర్చడంతో సంబరం అంబరాన్ని అంటింది.
అనంతపురం న్యూసిటీ: ‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సరా ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది. చామంతి పువ్వా.. పువ్వా నీకు బంతి పూల మేడకట్టనా. రంగేలి రవ్వా..రవ్వా.. నా సోకులన్నీ రంగరించనా, జామురాతిరి జాబిలమ్మా జోలపాడనా ఇలా.. అంటూ మెడికోలు వేసిన స్టెప్పులతో వైద్య కళాశాల ఆడిటోరియం అదిరిపోయింది’. స్పోర్ట్స్ డే సందర్భంగా శుక్రవారం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత నెల 18 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో వెయ్యి మంది విద్యార్థులు, వైద్యులు, నాన్ టీచింగ్ స్టాఫ్, మినిస్టీరియల్ స్టాఫ్‌కు క్రీడా పోటీలు నిర్వహించారు.
విజేతలుగా నిలిచిన 300 మందికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల కరస్పాండెంట్ పీఎల్‌ఎన్ రెడ్డి, బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలో చదువుతో పాటు క్రీడలకు సమప్రాధాన్యత కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల కరస్పాండెంట్ పీఎల్‌ఎన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందన్నారు. స్పోర్ట్స్, గేమ్స్ మీట్‌లో 2కే15, 2కే16 విద్యార్థులు 52 పాయింట్లతో ఓవరాల్ చాంఫియన్‌షిప్ సాధించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సపాల్ డాక్టర్ జేసీ రెడ్డి, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషాదేవి, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ మాధవి, డాక్టర్ హేమలత, డాక్టర్ దుర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ ఆదిరెడ్డి పరదేశీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment