సర్వజనాస్పత్రికి అత్యాధునిక పరికరాలు
అనంతపురం మెడికల్ : అనంతపురం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సర్వజనాస్పత్రికి అత్యాధునిక పరికరాలు వచ్చాయి. సుమారు రూ.2 కోట్ల విలువైన పరికరాలను విజయవాడ నుంచి పంపారు. రెండు ల్యాప్రోస్కోపీ యంత్రాలు, ఆర్థో ఆపరేషన్ థియేటర్‌కు సియాం, టేబుళ్లు, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రి, గైనిక్ తదితర పది విభాగాలకు వీటిని సరఫరా చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద శస్త్ర చికిత్సలు మెరుగు పర్చడంలో భాగంగా ఈ ఆధునిక పరికరాలను ఆస్పత్రికి సమకూర్చారు. ఇందులో ఓ ల్యాప్రోస్కోపీ పరికరం ఒక్కటే రూ.52 లక్షలు కావడం గమనార్హం.