విద్యార్థుల క్రీడా స్ఫూర్తి
వర్ధన్నపేట టౌన్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మండలంలోని ఏకశిల ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు ‘స్పోర్ట్స్ డే’ ఆంగ్ల అక్షర క్రమంలో కూర్చొని క్రీడా స్ఫూర్తిని చాటిచెప్పారు. ఈసందర్భంగా ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించి భారత క్రీతి ప్రతిష్టలను ఇనుమడింపజేశారన్నారు. ఆయన స్ఫూర్తితో గగన్ నారంగ్, కరణం మల్లీశ్వరి, అభినవ్æ బింద్రా. పీవీ సింధూ తదితర క్రీడాకారులు ఒలింపిక్ పతకాలను కైవసం చేసుకున్నారన్నారు. ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కె రవికిరణ్, ఏఓ ఎండీ.బాబా, ఉపాధ్యాయులు నర్సయ్య, భాస్కర్, సురేష్, నరేష్, సతీష్, నిరోషా, సామ్రాట్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.