sporting spirit
-
కుర్రాళ్లూ.. శభాష్!
క్రైస్ట్‌చర్చ్: అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది. మైదానంలో ఇరు దేశాల యువ ఆటగాళ్లు పరస్పరం సహకరించుకున్న తీరు క్రీడాభిమానులను ఆకట్టుకుంది. భారత బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ సెంచరీకి చేరువైన సమయంలో అతడి షూ లేసు ఊడిపోవడంతో పాకిస్తాన్ ఫీల్డర్ కట్టాడు. అలాగే తమ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ షూ లేసు ఊడిపోయినప్పుడు భారత ఫీల్డర్ సహాయం చేశాడు. సెంచరీ పూర్తి చేసిన శుభ్‌మాన్ గిల్ దగ్గరకు వచ్చి పాకిస్తాన్ ఆటగాళ్లలో చాలా మంది అతడిని అభినందించారు. కీలక మ్యాచ్‌లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరు జట్ల ఆటగాళ్లు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అభిమానుల మనసు గెలుచుకుంది. ఈ ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ వేసి ప్రశంసలు కురిపించారు. మ్యాచ్ ఫలితం ఎలావున్న యువ ఆటగాళ్లు తమ ప్రవర్తనతో మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. భారత్-పాక్ క్రికెటర్లు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదంటూ కామెంట్లు పెట్టారు. మరోవైపు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిన యువ టీమిండియాపై సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది. శుభ్‌మాన్ గిల్‌ను అభినందిస్తున్న పాకిస్తాన్ ఆటగాళ్లు -
విద్యార్థుల క్రీడా స్ఫూర్తి
వర్ధన్నపేట టౌన్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మండలంలోని ఏకశిల ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు ‘స్పోర్ట్స్ డే’ ఆంగ్ల అక్షర క్రమంలో కూర్చొని క్రీడా స్ఫూర్తిని చాటిచెప్పారు. ఈసందర్భంగా ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించి భారత క్రీతి ప్రతిష్టలను ఇనుమడింపజేశారన్నారు. ఆయన స్ఫూర్తితో గగన్ నారంగ్, కరణం మల్లీశ్వరి, అభినవ్æ బింద్రా. పీవీ సింధూ తదితర క్రీడాకారులు ఒలింపిక్ పతకాలను కైవసం చేసుకున్నారన్నారు. ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కె రవికిరణ్, ఏఓ ఎండీ.బాబా, ఉపాధ్యాయులు నర్సయ్య, భాస్కర్, సురేష్, నరేష్, సతీష్, నిరోషా, సామ్రాట్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.