హ్యాండ్‌బాల్ విజేత: ఎల్బీ స్టేడియం | hand ball champion: L.B stadium | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్ విజేత: ఎల్బీ స్టేడియం

Published Sat, Jun 7 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

hand ball champion: L.B stadium

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ క్రీడలు
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ క్రీడల్లో భాగంగా హ్యాండ్‌బాల్ పురుషుల టీమ్ టైటిల్‌ను ఎల్బీ స్టేడియం జట్టు చేజిక్కించుకుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఎల్బీ స్టేడియం జట్టు 32-27 స్కోరుతో భవాన్స్ కాలేజిపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఎల్బీ స్టేడియం 15-10తో ఆధిక్యాన్ని సాధించింది.   
 
 రాజ్ కుమార్, భగత్ సింగ్,వాస్‌లు చక్కటి నైపుణ్యాన్ని కనబర్చారు. భవాన్స్ కాలేజి జట్టులో వంశీ, అనిల్ రాణించారు. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో ఎల్బీ స్టేడియం జట్టు 17-11తో రంగారెడ్డి జిల్లా జట్టుపై, భవాన్స్ కాలేజి జట్టు 18-10తో సాయ్ హాస్టల్ జట్టుపై గెలిచాయి. విజేతలకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement