Team title
-
ఆంధ్ర-తెలంగాణ బాక్సింగ్ టోర్నీ
తెలంగాణకు టీమ్ టైటిల్ ఎల్బీ స్టేడియం: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టీమ్ టైటిల్‌ను తెలంగాణ రాష్ట్ర జట్టు చేజిక్కించుకుంది. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో శనివారం జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ బాక్సర్ల ఆధిపత్యమే కొనసాగింది, ఈ పోటీల ముగింపు వేడుకలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.కరణ్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్‌లో అర్జున అవార్డీ జయరామ్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు 49 కేజీలు: 1.సదానంద్ (తెలంగాణ), 2.సాయి కృష్ణ (ఏపీ). 52 కేజీలు: 1.వై.ప్రభుదాస్ (ఏపీ), 2.సి.మహేందర్ (తెలంగాణ). 56 కేజీలు: 1.సి.హెచ్.ధీరజ్ (తెలంగాణ), 2. అప్పలరాజు (ఏపీ). 60 కేజీలు: 1.కరణ్ కుమార్ (తెలంగాణ), 2. బాలాజీ (ఏపీ). 64 కేజీలు: 1.ఎం.గణేశ్ (తెలంగాణ), 2. బి.వెంకటేష్ (తెలంగాణ). 69 కేజీలు: 1.ఎస్.సాయి (తెలంగాణ), 2.వి.సాయినాథ్ (ఏపీ). 75 కేజీలు: 1. ఎం.శివ కుమార్ (తెలంగాణ), 2.ఎ.రమేష్ (ఏపీ). 81 కేజీలు:1.టి.శ్రీకాంత్ (తెలంగాణ),2.కె.మాధవరెడ్డి (ఏపీ). 91 కేజీలు: 1.వి.పి.ప్రభాకర్ (ఏపీ), 2.ఎం.డి.మోసిన్ (తెలంగాణ). +91 కేజీలు: 1. నిరంజన్ (ఏపీ), 2.ఎ.సంతోష్ (తెలంగాణ). -
లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ బాలురకు టీమ్ టైటిల్
తెలంగాణ టీటీ టోర్నీ బాలికల విజేత బీవీబీ(ఏ) జట్టు ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఇంటర్ స్కూల్ బాలుర టీమ్ టైటిల్‌ను లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ జట్టు చేజిక్కించుకుంది. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీల్లో శనివారం జరిగిన బాలుర టీమ్ విభాగం ఫైనల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ జట్టు 3-1 తేడాతో భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్(బీవీబీపీఎస్) జట్టుపై విజయం సాధించింది. బాలికల టీమ్ విభాగం ఫైనల్లో బీవీబీపీఎస్(ఏ) జట్టు 3-0 స్కోరుతో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టుపై గెలిచి టైటిల్ గెలిచింది. సెమీస్‌లో బి.వరుణ్, అద్వైత్ క్యాడెట్ బాలుర సింగిల్స్ విభాగంలో బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ), అద్వైత్ (ఆవా), ఎన్. సుదర్శన్ (జీఎస్ఎం), ఎ. విశాల్ (జీఎస్ఎం)లు సెమీస్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్లో బి. వరుణ్ శంకర్ 11-5,11-3, 11-6తో కేశవన్ ఖన్నా (జీటీటీఏ)పై విజయం సాధించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో అద్వైత్ (ఆవా) 11-7, 11-6, 7-11, 11-6తో కార్తీక్ (ఆవా)పై, ఎన్. సుదర్శన్ 12-10, 11-3, 1-11-4తో శ్రీరంగ (వైఎంసీఏ)పై, ఎ. విశాల్ 11-7, 7-11, 11-6, 11-7తో సాయి వెంకట్ ధనుష్ (ఆవా)పై గెలిచారు. క్యాడెట్ బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుచిరరెడ్డి (ఎస్పీహెచ్ఎస్) 11-13, 11-8, 11-5, 14-12తో ఎస్. శరణ్య (జీసీఎస్)పై, భావిత (జీఎస్ఎం) 11-6, 11-3, 11-8తో అనన్య (చిరెక్ పబ్లిక్ స్కూల్)పై నెగ్గారు. -
హ్యాండ్‌బాల్ విజేత: ఎల్బీ స్టేడియం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ క్రీడలు ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ క్రీడల్లో భాగంగా హ్యాండ్‌బాల్ పురుషుల టీమ్ టైటిల్‌ను ఎల్బీ స్టేడియం జట్టు చేజిక్కించుకుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఎల్బీ స్టేడియం జట్టు 32-27 స్కోరుతో భవాన్స్ కాలేజిపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఎల్బీ స్టేడియం 15-10తో ఆధిక్యాన్ని సాధించింది. రాజ్ కుమార్, భగత్ సింగ్,వాస్‌లు చక్కటి నైపుణ్యాన్ని కనబర్చారు. భవాన్స్ కాలేజి జట్టులో వంశీ, అనిల్ రాణించారు. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో ఎల్బీ స్టేడియం జట్టు 17-11తో రంగారెడ్డి జిల్లా జట్టుపై, భవాన్స్ కాలేజి జట్టు 18-10తో సాయ్ హాస్టల్ జట్టుపై గెలిచాయి. విజేతలకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ విజేత పీ అండ్ టీ కాలనీ
జీహెచ్ఎంసీ సమ్మర్ క్రీడలు ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జీహెచ్ఎంసీ ఇంటర్ ప్లే గ్రౌండ్స్ వేసవి శిబిరాల క్రీడల్లో వాలీబాల్ బాలుర టీమ్ టైటిల్‌ను చిక్కడపల్లికి చెందిన పీ అండ్ టీ కాలనీ జట్టు కైవసం చేసుకుంది. బాలికల టైటిల్‌ను సికింద్రాబాద్ సెయింట్ ఆంథోనీస్ స్కూల్ జట్టు గెలుచుకుంది. విక్టరిప్లే గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన బాలుర విభాగం ఫైనల్లో పీ అండ్ టీ కాలనీ జట్టు 25-20, 25-15 స్కోరుతో ఆదయ్యనగర్ ప్లే గ్రౌండ్ జట్టుపై విజయం సాధించింది. ముషీరాబాద్ జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్స్‌లో జరిగిన బాలికల విభాగం ఫైనల్లో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్ జట్టు 25-18, 25-12స్కోరుతో సెయింట్ పాయిస్ హైస్కూల్ (రాంనగర్) జట్టుపై గెలిచింది. టెన్నికాయిట్ డబుల్స్ విజేతలు తరుణ్, హరికృష్ణ టెన్నికాయిట్ టోర్నమెంట్లో బాలబాలికల డబుల్స్ టీమ్ టైటిళ్లను అంబర్పేట్ ప్లేగ్రౌండ్ (ఏపీజీ) జట్టు చేజిక్కించుకుంది. సింగిల్స్ టైటిల్స్‌ను కూడా అంబర్పేట్ పీజీ ఇదివరకే గెలుచుకుంది. ఏపీజీలో మంగళవారం జరిగిన బాలుర డబుల్స్ ఫైనల్లో తరుణ్-హరికృష్ణ జోడి (ఏపీజీ) 21-14, 21-15తో శివ-నితిన్ జోడి (ఏపీజీ)పై గెలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో అశ్విని-గౌతమి జోడి (ఏపీజీ) 19-21, 21-16, 21-18తో శైలాని-స్వాతి జోడి (ఏపీజీ)పై నెగ్గింది. బాక్సింగ్ ఫలితాలు: 30 కేజీలు: 1. బాలాజీ (వీపీజీ), 2. కె.మధు (బన్సీలాల్‌పేట్), 3. అన్నన్ (జంగంమెట్), దేవేందర్ సింగ్(ధూల్‌పేట్). 32 కేజీలు: 1.బి.తరుణ్ యాదవ్ (వీపీజీ), 2.జి.వీరేందర్‌రెడ్డి (గౌలిపురా పీజీ), 3. సయ్యద్ అబ్దుల్ ఖాదర్ (పటేల్ పీజీ), గిరిధర్ (మల్కాజిగిరి). 34 కేజీలు: 1. దినేష్ (షేక్‌పేట్ పీజీ), 2. జి.యోగేందర్ (గౌలిపురా పీజీ), 3.ఎం.మధుకర్ (గౌలిపురా పీజీ), మహ్మద్ హుస్సేన్ (పటేల్ పీజీ). 40 కేజీలు: 1. జ్ఞానేశ్వర్ (నెహ్రూనగర్), 2. ఎన్.సాయి కిరణ్ (నెహ్రూనగర్), 3. జి. వరుణ్(ధూల్‌పేట్), అఖిల్ చారి (షేక్‌పేట్). -
ఇంటర్ వర్సిటీ సెంట్రల్ జోన్ చెస్ విజేత ఓయూ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ యూనివర్సిటీ సెంట్రల్ జోన్ చెస్ టోర్నమెంట్లో టీమ్ టైటిల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) జట్టు సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ఈటోర్నీలో ఓయూ జట్టు ఆటగాళ్లు సత్తా చాటారు. గత ఏడాది కేరళలోని తిరుచూర్‌లో జరిగిన సౌత్ జోన్ ఇంటర్ వర్సీటీ చెస్ టోర్నీలోనూ ఓయూ జట్టు చాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది నుంచి ఓయూను సౌత్ జోన్ నుంచి సెంట్రల్ జోన్‌కు మార్చారు. ఈ పోటీల్లో ఓయూ జట్టు ఓవరాల్‌గా మొత్తం ఆరు రౌండ్లు ముగిసే సమయానికి 11 పాయింట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచింది. హైదరాబాద్ జేఎన్టీయూ 10 పాయింట్లతో రెండో స్థానం, ఉత్కల్ యూనివర్సిటీ జట్టు 9 పాయింట్లతో మూడో స్థానం పొందింది. నాగ్‌పూర్‌కు చెందిన ఆర్ టీఎంయూ జట్టుకు నాలుగో స్థానం లభించింది. దీంతో సెంట్రల్ జోన్ నుంచి ఓయూతో పాటు మిగతా మూడు జట్లు మహారాష్ట్రలోని మహత్మ జ్యోతిరావ్ పూలే అగ్రికల్చర్ యూనివర్సిటీలో జనవరి 13 నుంచి 17 వరకు జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సీటీ చెస్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. ఓయూ జట్టు తరపున సి.ఆర్.కృష్ణ(కెప్టెన్), ఎస్.రవితేజ, ఎం.దీప్త్తాంశ్రెడ్డి, విశ్వనాథ్ ప్రసాద్, ఆనంద్‌నాయక్, కె.నిఖిల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కోచ్‌గా కె.కన్నారెడ్డి, మేనేజర్‌గా మేజర్ కె.ఎ.శివప్రసాద్ వ్యవహరించారు. -
షేక్‌పేట్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌కు టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్లో అండ ర్-14 బాలుర టీమ్ టైటిల్‌ను షేక్‌పేట్‌కు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్) జట్టు చేజిక్కించుకుంది. అండర్-17 బాలుర టీమ్ టైటిల్‌ను మలక్‌పేట్‌కు చెందిన ఫ్రభుత్వ హైస్కూల్(జీహెచ్ఎస్) జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన అండర్-14 బాలుర విభాగం ఫైనల్లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జట్టు 37-13 స్కోరుతో సునాయాసంగా మలక్‌పేట్ జీహెచ్ఎస్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జట్టులో ఆర్.శ్రవణ్, లక్ష్మణ్ నాయక్, పి.భాను చక్కటి ఆటతీరును ప్రదర్శించి తమ జట్టును విజయపథాన నడిపించారు. సెమీఫైనల్లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ 59-8తో అలవోకగా ఆలియా జీహెచ్ఎస్పై, మలక్‌పేట్ జీహెచ్ఎస్ 8-6తో బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ హైస్కూల్‌పై గెలిచాయి. అండర్-17 బాలుర ఫైనల్లో మలక్‌పేట్ జీహెచ్ఎస్ 34-22తో శ్రీ జె.వి.హైస్కూల్‌పై గెలిచింది. సెమీస్‌లో మలక్‌పేట్ జీహెచ్ఎస్ 28-20తో ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్పై, శ్రీ జె.వి. హైస్కూల్ 28-20తో వెంకట్రావ్ మెమోరియల్ హైస్కూల్‌పై నెగ్గాయి.