తెలంగాణ టీటీ టోర్నీ బాలికల విజేత బీవీబీ(ఏ) జట్టు
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఇంటర్ స్కూల్ బాలుర టీమ్ టైటిల్‌ను లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ జట్టు చేజిక్కించుకుంది. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీల్లో శనివారం జరిగిన బాలుర టీమ్ విభాగం ఫైనల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ జట్టు 3-1 తేడాతో భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్(బీవీబీపీఎస్) జట్టుపై విజయం సాధించింది. బాలికల టీమ్ విభాగం ఫైనల్లో బీవీబీపీఎస్(ఏ) జట్టు 3-0 స్కోరుతో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టుపై గెలిచి టైటిల్ గెలిచింది.
సెమీస్‌లో బి.వరుణ్, అద్వైత్
క్యాడెట్ బాలుర సింగిల్స్ విభాగంలో బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ), అద్వైత్ (ఆవా), ఎన్. సుదర్శన్ (జీఎస్‌ఎం), ఎ. విశాల్ (జీఎస్‌ఎం)లు సెమీస్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్లో బి. వరుణ్ శంకర్ 11-5,11-3, 11-6తో కేశవన్ ఖన్నా (జీటీటీఏ)పై విజయం సాధించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో అద్వైత్ (ఆవా) 11-7, 11-6, 7-11, 11-6తో కార్తీక్ (ఆవా)పై, ఎన్. సుదర్శన్ 12-10, 11-3, 1-11-4తో శ్రీరంగ (వైఎంసీఏ)పై, ఎ. విశాల్ 11-7, 7-11, 11-6, 11-7తో సాయి వెంకట్ ధనుష్ (ఆవా)పై గెలిచారు. క్యాడెట్ బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుచిరరెడ్డి (ఎస్‌పీహెచ్‌ఎస్) 11-13, 11-8, 11-5, 14-12తో ఎస్. శరణ్య (జీసీఎస్)పై, భావిత (జీఎస్‌ఎం) 11-6, 11-3, 11-8తో అనన్య (చిరెక్ పబ్లిక్ స్కూల్)పై నెగ్గారు.
లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ బాలురకు టీమ్ టైటిల్
Published Sat, Jul 26 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement
Advertisement