little flower high school
-
అ‘పూర్వ’ విద్యార్థులే!.. 50ఏళ్ల తర్వాత మళ్లీ యూనిఫాం, టై ధరించి స్కూల్‌కు..
సాక్షి, హైదరాబాద్: అది అబిడ్స్ చిరాగ్ అలీ లేన్‌లో ఉన్న లిటిల్ ఫ్లవర్ హై స్కూల్... రెండో అంతస్తులో ఉన్న పదో తరగతి క్లాస్ రూమ్..ఆ రూమ్‌లో ఫుల్ యూనిఫామ్‌లో కూర్చున్న వారికి మాజీ తెలుగు పండిట్ నర్సింహులు క్లాస్ తీసుకుంటున్నారు... ఇందులో ఏముంది అనుకుంటున్నారా..? యూనిఫామ్స్ వేసుకుని విద్యార్థుల టేబుల్స్‌పై కూర్చున్న వారిలో మాజీ డీజీపీ కోడె దుర్గా ప్రసాద్, సీఎం ముఖ్య భద్రతాధికారి ఎంకే సింగ్, కావ్య హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ రంగారావు ఉండటమే. తరగతి గదిలో ఆనంద హేల ఈ స్కూల్లో 1972లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ రీ–యూనియన్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న పూర్వ విద్యార్థులు స్కూల్ యూనిఫామ్, టై తదితరాలు ప్రత్యేకంగా కుట్టించుకుని, ధరించి రావడంతో పాటు అప్పట్లో వీళ్లు కూర్చున తరగతి గదిలోనే గడిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, కెనడా, న్యూజిలాండ్ నుంచి పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనం కోసం ప్రత్యేకంగా వచ్చారు. వీరంతా ఆ పాఠశాల ప్రస్తుత విద్యార్థులతోనూ భేటీ అయ్యారు. 1972లో దిగిన గ్రూఫ్ ఫొటో జీవితంలో తాము సాధించిన విజయాలు, అందుకు చేసిన కృషి, ఈ పాఠశాలలో నేర్చుకున్న విద్య ప్రాముఖ్యత తదితరాలను వారికి వివరించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గుర్నాథ్రెడ్డి కూడా తమలో భాగమే అయినప్పటికీ శుక్రవారం నాటి కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని కోడె దుర్గాప్రసాద్ తెలిపారు. ఆముద్యాల సుధాకర్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించి అందరిని ఏకతాటిపైకి తెచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులు, ప్రస్తుత పాఠశాల ప్రిన్సిపాల్ రేవ్బ్రదర్ షజాన్ ఆంటోని అభినందనలు తెలిపారు. -
తండ్రిని అనుసరించబోయి..మహేష్ ఆత్మహత్య
ముషీరాబాద్: భోలక్‌పూర్ డివిజన్ పద్మశాలి కాలనీలోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న మహేష్ మరణంపై అనుమానాలు వీడాయి. మహేష్ చీరతో ఉరివేసుకోవడం వల్లనే మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. స్కూల్ యాజమాన్యం ఫీజుల కోసం వేధించినందునే మహేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి, బాలల హక్కుల సంఘాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో గురువారం మహేష్ భౌతికకాయానికి గాంధీ మార్చురీలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం ప్రక్రియను వీడియో తీశారు. అనంతరం ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మెడపై ఉరివేసుకున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలిపారు. మహేష్ భౌతికకాయాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. తండ్రిని అనుసరించబోయి... 12ఏళ్ల విద్యార్థికి 6అడుగుల ఎత్తులో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకోవడం ఎలా సాధ్యమని అనుమానాలు రేకెత్తాయి. పాఠశాల యాజమాన్యం రూ.5,600 ఫీజు బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో రెండు రోజులుగా అతను స్కూలుకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్నాడు. దీంతో ఇంటికెందుకు వచ్చావని తండ్రి కొట్టడంతో మనస్తాపానికి లోనైన మహేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే కొద్ది నెలల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో మహేష్ తండ్రి శ్రీనివాస్ భార్యను బెదిరించేందుకు ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడని, దీంతో పిల్లలు బిగ్గరగా ఏడుస్తూ వద్దని వారించినట్లు చెప్పిన శ్రీనివాస్ బోరున విలపించాడు. తాను ఆనాడు బెదిరించేందుకు చేశానని, తన కుమారుడు తనను అనుకరించి నిజంగానే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. -
లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ బాలురకు టీమ్ టైటిల్
తెలంగాణ టీటీ టోర్నీ బాలికల విజేత బీవీబీ(ఏ) జట్టు ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఇంటర్ స్కూల్ బాలుర టీమ్ టైటిల్‌ను లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ జట్టు చేజిక్కించుకుంది. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీల్లో శనివారం జరిగిన బాలుర టీమ్ విభాగం ఫైనల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ జట్టు 3-1 తేడాతో భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్(బీవీబీపీఎస్) జట్టుపై విజయం సాధించింది. బాలికల టీమ్ విభాగం ఫైనల్లో బీవీబీపీఎస్(ఏ) జట్టు 3-0 స్కోరుతో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టుపై గెలిచి టైటిల్ గెలిచింది. సెమీస్‌లో బి.వరుణ్, అద్వైత్ క్యాడెట్ బాలుర సింగిల్స్ విభాగంలో బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ), అద్వైత్ (ఆవా), ఎన్. సుదర్శన్ (జీఎస్ఎం), ఎ. విశాల్ (జీఎస్ఎం)లు సెమీస్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్లో బి. వరుణ్ శంకర్ 11-5,11-3, 11-6తో కేశవన్ ఖన్నా (జీటీటీఏ)పై విజయం సాధించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో అద్వైత్ (ఆవా) 11-7, 11-6, 7-11, 11-6తో కార్తీక్ (ఆవా)పై, ఎన్. సుదర్శన్ 12-10, 11-3, 1-11-4తో శ్రీరంగ (వైఎంసీఏ)పై, ఎ. విశాల్ 11-7, 7-11, 11-6, 11-7తో సాయి వెంకట్ ధనుష్ (ఆవా)పై గెలిచారు. క్యాడెట్ బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుచిరరెడ్డి (ఎస్పీహెచ్ఎస్) 11-13, 11-8, 11-5, 14-12తో ఎస్. శరణ్య (జీసీఎస్)పై, భావిత (జీఎస్ఎం) 11-6, 11-3, 11-8తో అనన్య (చిరెక్ పబ్లిక్ స్కూల్)పై నెగ్గారు.