జీహెచ్‌ఎంసీ సమ్మర్ క్రీడలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జీహెచ్‌ఎంసీ ఇంటర్ ప్లే గ్రౌండ్స్ వేసవి శిబిరాల క్రీడల్లో వాలీబాల్ బాలుర టీమ్ టైటిల్‌ను చిక్కడపల్లికి చెందిన పీ అండ్ టీ కాలనీ జట్టు కైవసం చేసుకుంది. బాలికల టైటిల్‌ను సికింద్రాబాద్ సెయింట్ ఆంథోనీస్ స్కూల్ జట్టు గెలుచుకుంది. విక్టరిప్లే గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన బాలుర విభాగం ఫైనల్లో పీ అండ్ టీ కాలనీ జట్టు 25-20, 25-15 స్కోరుతో ఆదయ్యనగర్ ప్లే గ్రౌండ్ జట్టుపై విజయం సాధించింది. ముషీరాబాద్ జీహెచ్‌ఎంసీ ప్లేగ్రౌండ్స్‌లో జరిగిన బాలికల విభాగం ఫైనల్లో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్ జట్టు 25-18, 25-12స్కోరుతో సెయింట్ పాయిస్ హైస్కూల్ (రాంనగర్) జట్టుపై గెలిచింది.
టెన్నికాయిట్ డబుల్స్ విజేతలు
తరుణ్, హరికృష్ణ
టెన్నికాయిట్ టోర్నమెంట్‌లో బాలబాలికల డబుల్స్ టీమ్ టైటిళ్లను అంబర్‌పేట్ ప్లేగ్రౌండ్ (ఏపీజీ) జట్టు చేజిక్కించుకుంది. సింగిల్స్ టైటిల్స్‌ను కూడా అంబర్‌పేట్ పీజీ ఇదివరకే గెలుచుకుంది. ఏపీజీలో మంగళవారం జరిగిన బాలుర డబుల్స్ ఫైనల్లో తరుణ్-హరికృష్ణ జోడి (ఏపీజీ) 21-14, 21-15తో శివ-నితిన్ జోడి (ఏపీజీ)పై గెలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో అశ్విని-గౌతమి జోడి (ఏపీజీ) 19-21, 21-16, 21-18తో శైలాని-స్వాతి జోడి (ఏపీజీ)పై నెగ్గింది.
బాక్సింగ్ ఫలితాలు: 30 కేజీలు: 1. బాలాజీ (వీపీజీ), 2. కె.మధు (బన్సీలాల్‌పేట్), 3. అన్నన్ (జంగంమెట్), దేవేందర్ సింగ్(ధూల్‌పేట్). 32 కేజీలు: 1.బి.తరుణ్ యాదవ్ (వీపీజీ), 2.జి.వీరేందర్‌రెడ్డి (గౌలిపురా పీజీ), 3. సయ్యద్ అబ్దుల్ ఖాదర్ (పటేల్ పీజీ), గిరిధర్ (మల్కాజిగిరి). 34 కేజీలు: 1. దినేష్ (షేక్‌పేట్ పీజీ), 2. జి.యోగేందర్ (గౌలిపురా పీజీ), 3.ఎం.మధుకర్ (గౌలిపురా పీజీ), మహ్మద్ హుస్సేన్ (పటేల్ పీజీ). 40 కేజీలు: 1. జ్ఞానేశ్వర్ (నెహ్రూనగర్), 2. ఎన్.సాయి కిరణ్ (నెహ్రూనగర్), 3. జి. వరుణ్(ధూల్‌పేట్), అఖిల్ చారి (షేక్‌పేట్).
వాలీబాల్ విజేత పీ అండ్ టీ కాలనీ
Published Wed, Jun 4 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement