షేక్‌పేట్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌కు టైటిల్ | shekpet APSWRS Title | Sakshi
Sakshi News home page

షేక్‌పేట్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌కు టైటిల్

Published Wed, Aug 28 2013 12:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

shekpet APSWRS Title

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్‌లో అండ ర్-14 బాలుర టీమ్ టైటిల్‌ను షేక్‌పేట్‌కు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్) జట్టు చేజిక్కించుకుంది. అండర్-17 బాలుర టీమ్ టైటిల్‌ను మలక్‌పేట్‌కు చెందిన ఫ్రభుత్వ హైస్కూల్(జీహెచ్‌ఎస్) జట్టు కైవసం చేసుకుంది.
 
  హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన అండర్-14 బాలుర విభాగం ఫైనల్లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జట్టు 37-13 స్కోరుతో సునాయాసంగా మలక్‌పేట్ జీహెచ్‌ఎస్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జట్టులో ఆర్.శ్రవణ్, లక్ష్మణ్ నాయక్, పి.భాను చక్కటి ఆటతీరును ప్రదర్శించి తమ జట్టును విజయపథాన నడిపించారు. సెమీఫైనల్లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ 59-8తో అలవోకగా ఆలియా జీహెచ్‌ఎస్‌పై, మలక్‌పేట్ జీహెచ్‌ఎస్ 8-6తో బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ హైస్కూల్‌పై గెలిచాయి.
 
 అండర్-17 బాలుర ఫైనల్లో మలక్‌పేట్ జీహెచ్‌ఎస్ 34-22తో శ్రీ జె.వి.హైస్కూల్‌పై గెలిచింది. సెమీస్‌లో మలక్‌పేట్ జీహెచ్‌ఎస్ 28-20తో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌పై, శ్రీ జె.వి. హైస్కూల్ 28-20తో వెంకట్‌రావ్ మెమోరియల్ హైస్కూల్‌పై నెగ్గాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement