దక్షిణాసియా టీటీ టోర్నీ
న్యూఢిల్లీ: దక్షిణాసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇక్కడి టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో శ్రీజ, శ్రుతి అమృతే, దీప్తి సెల్వకుమార్, మరియా రోనీలతో కూడిన భారత జూనియర్ బాలికల జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను భారత్ 3-0 స్కోరుతో ఓడించింది. టీమ్ విభాగంలో ఆకుల శ్రీజ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది.
శ్రీజకు టీమ్ స్వర్ణం
Published Thu, Jun 18 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement
Advertisement