ఢిల్లీపై టైటాన్స్ విజయభేరి | Telugu Titans thump Puneri Paltan in Pro Kabaddi League | Sakshi
Sakshi News home page

ఢిల్లీపై టైటాన్స్ విజయభేరి

Published Wed, Aug 20 2014 12:08 AM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM

ఢిల్లీపై టైటాన్స్ విజయభేరి - Sakshi

ఢిల్లీపై టైటాన్స్ విజయభేరి

ప్రొ కబడ్డీ లీగ్
ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీపై 45-26 తేడాతో నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ వేదికపై నాలుగు మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకోగా... వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. సొంత వేదికల్లో జరిగిన మ్యాచ్‌లను ఓటమి లేకుండా ముగించిన టైటాన్స్... ఇదే ఘనతతో ఉన్న ‘యు ముంబ’ సరసన నిలిచింది.

ఈ లీగ్‌లో వైజాగ్ వేదికగా ఇదే చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు పోటెత్తారు. మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు జోరు కనబరిచారు. పదో నిమిషంలోనే జట్టు లోనా సాధించింది. ప్రథమార్ధం 20-12తో ముగించగా ఆ తర్వాత కూడా ఢిల్లీ ఆటగాళ్లను కుదురుకోనీయలేదు. ఓవరాల్‌గా రాహుల్ 12 రైడ్ పాయింట్లు, సుకేశ్ హెగ్డే 7 పాయింట్లు సాధించారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో తర్వాతి దశలో మ్యాచ్‌లు జైపూర్‌లో జరుగుతాయి.
 
కబడ్డీపై అభిషేక్ సినిమా!
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ జట్టు యజమాని  అభిషేక్ బచ్చన్ కబడ్డీ ఆటపైనే పూర్తి స్థాయిలో సినిమా తీయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement