Titans
-
సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్ విజేతగా లయన్స్
క్రికెట్ సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్ విజేతగా లయన్స్ జట్టు ఆవిర్భవించింది. నిన్న (అక్టోబర్ 27) జరిగిన ఫైనల్లో లయన్స్.. టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 19.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. క్లాసెన్ (13), ఫెరియరా (0) లాంటి భారీ హిట్టర్లు ఉన్న టైటాన్స్.. లయన్స్ బౌలర్ల దెబ్బకు కుదేలైంది. టైటాన్స్ ఇన్నింగ్స్‌లో గెరాల్డ్ కొయెట్జీ (20) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిపామ్లా (4-0-12-4), మపాకా (4-0-15-2), ఫోర్టుయిన్ (3-0-10-2) టైటాన్స్‌ను దెబ్బకొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లయన్స్ 15.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (44 నాటౌట్), కాన్నర్ ఎస్టర్‌హ్యుజెన్ (48 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి లయన్స్‌ను గెలిపించారు. లయన్స్ ఇన్నింగ్స్‌లో జుబేర్ హమ్జా 20, రీజా హెండ్రిక్స్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. టైటాన్స్ బౌలర్లలో గేలియమ్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో లయన్స్‌ను ఇది ఐదో టైటిల్. -
ఢిల్లీపై టైటాన్స్ విజయభేరి
ప్రొ కబడ్డీ లీగ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీపై 45-26 తేడాతో నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ వేదికపై నాలుగు మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకోగా... వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. సొంత వేదికల్లో జరిగిన మ్యాచ్‌లను ఓటమి లేకుండా ముగించిన టైటాన్స్... ఇదే ఘనతతో ఉన్న ‘యు ముంబ’ సరసన నిలిచింది. ఈ లీగ్‌లో వైజాగ్ వేదికగా ఇదే చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు పోటెత్తారు. మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు జోరు కనబరిచారు. పదో నిమిషంలోనే జట్టు లోనా సాధించింది. ప్రథమార్ధం 20-12తో ముగించగా ఆ తర్వాత కూడా ఢిల్లీ ఆటగాళ్లను కుదురుకోనీయలేదు. ఓవరాల్‌గా రాహుల్ 12 రైడ్ పాయింట్లు, సుకేశ్ హెగ్డే 7 పాయింట్లు సాధించారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో తర్వాతి దశలో మ్యాచ్‌లు జైపూర్‌లో జరుగుతాయి. కబడ్డీపై అభిషేక్ సినిమా! ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ కబడ్డీ ఆటపైనే పూర్తి స్థాయిలో సినిమా తీయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.