Dabangg Delhi
-
ఢిల్లీ, పుణేరి హోరాహోరీ
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో హోరాహోరీ సమరాలు కొనసాగుతున్నాయి. మంగళవారం దబంగ్ ఢిల్లీ–పుణేరి పల్టన్ మధ్య జరిగిన పోరు 38–38 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. దబంగ్ ఢిల్లీ తరఫున అషు మాలిక్ 17 పాయింట్లతో సత్తాచాటగా... మోహిత్ దేశ్వాల్ (6 పాయింట్లు) అతడికి సహకరించాడు. ఇతర ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తన సూపర్ రెయిడ్లతో అషు పాయింట్లు సాధించడంతో ఢిల్లీ జట్టు పోటీలో నిలిచింది. మరోవైపు పల్టన్ తరఫున ఆకాశ్ షిండే (8 పాయింట్లు), మోహిత్ గోయత్ (6 పాయింట్లు), అమన్ (6 పాయింట్లు) రాణించారు. ఓవరాల్‌గా దబంగ్ ఢిల్లీ మ్యాచ్‌లో 24 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... పుణేరి పల్టన్ 18 పాయింట్లకే పరిమితమైంది. ట్యాకిలింగ్‌లో ఢిల్లీ 9 పాయింట్లు సాధిస్తే... పల్టన్ 13 పాయింట్లతో సత్తాచాటింది. ఇరు జట్లు రెండేసి సార్లు ఆలౌట్ కాగా... దంబగ్ ఢిల్లీ జట్టుకు ఒక సూపర్ రెయిడ్ పాయింట్ దక్కింది. ఈ ఫలితంతో తాజా సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన పుణేరి పల్టన్ 5 విజయలు, 2 పరాజయాలు, 2 ‘టై’లతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ప్లేస్‌లో కొనసాగుతోంది. 10 మ్యాచ్‌లాడిన దబంగ్ ఢిల్లీ 4 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 27 పాయింట్లు సాధించి పట్టిక ఐదో స్థానంలో ఉంది. అర్జున్ అదరహో..పీకేఎల్‌లో భాగంగా మంగళవారమే జరిగిన మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఘనవిజయం సాధించింది. షహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 39–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో దుమ్మురేపాడు. రెండుసార్లు పీకేఎల్ టైటిల్ సాధించిన జైపూర్ జట్టను అర్జున్ ఒంటి చేత్తో విజయం సాధించి పెట్టాడు. రెయిండింగ్‌లో అర్జున్ దూకుడు కనబరిస్తే... డిఫెన్స్‌లో లక్కీ శర్మ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ప్రదీప్ నర్వాల్ గైర్హాజరీలో బరిలోకి దిగిన బెంగళూరు బుల్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రధాన ఆటగాడు దూరం కావడంతో... ఆ జట్టు పింక్ పాంథర్స్‌కు పోటీనివ్వలేకపోయింది. అజింక్యా పవార్ (9 పాయింట్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... పింక్ పాంథర్స్ 19 పాయింట్లు సాధించింది. ట్యాకిలింగ్‌లో బుల్స్ 8 పాయింట్లకు పరిమితం కాగా... జైపూర్ 14 పాయింట్లతో సత్తాచాటింది. జైపూర్ పింక్ పాంథర్స్‌కు 8 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం కాగా... 3 పరాజయాలు, ఒక ‘టై’తో 25 పాయింట్లు సాధించి పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన తమ్మిది మ్యాచ్‌ల్లో ఏడో పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు బుల్స్ పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. -
ఎట్టకేలకు బెంగళూర్‌కు ఓ విజయం
హైదరాబాద్, 29 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయాలు చవిచూసిన బెంగళూర్ బుల్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. మంగళవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీపై 34-32తో పైచేయి సాధించి, 2 పాయింట్ల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. దబంగ్ ఢిల్లీకి ఇది ఐదు మ్యాచుల్లో రెండో ఓటమి కాగా, బెంగళూర్ బుల్స్‌కు ఇది ఐదు మ్యాచుల్లో తొలి విజయం కావటం గమనార్హం. బెంగళూర్ బుల్స్ తరఫున 11వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మ్యాట్‌పై అడుగుపెట్టిన జై భగవాన్ (11 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో బుల్స్‌కు విజయాన్ని అందించాడు. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్లలో ఆషు మాలిక్ (13 పాయింట్లు) సూపర్ టెన్తో మెరిసినా ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. ప్రథమార్థం దబంగ్‌దే : వరుస పరాజయాలతో నైరాశ్యంలో ఉన్న బెంగళూర్ బుల్స్‌పై దబంగ్ ఢిల్లీ ధనాధన్ షో చేసింది. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలోనే 22-14తో ఏకంగా ఎనిమిది పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు ఆషు మాలిక్, వినయ్ అంచనాలు అందుకోవటంతో దబంగ్ ఢిల్లీకి ఎదురు లేకుండా పోయింది. కూతలో దబంగ్ ఢిల్లీకి బెంగళూర్ బుల్స్ పోటీ ఇచ్చినా.. డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయింది. మెరుపు ట్యాకిల్స్‌తో ప్రథమార్థంలో ఓసారి బెంగళూర్ బుల్స్‌ను ఆలౌట్ చేసింది. బుల్స్ సూపర్ షో : సెకండ్‌హాఫ్‌లో దబంగ్ ఢిల్లీకి బెంగళూర్ బుల్స్ గట్టి పోటీ ఇచ్చింది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ కూతలో ముందుండి నడిపించగా.. డిఫెండర్లు సైతం ట్యాకిల్స్‌తో మెరిశారు. ఇదే సమయంలో దబంగ్ ఢిల్లీ సైతం పాయింట్లు ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. దీంతో ద్వితీయార్థంలో సమవుజ్జీగా పాయింట్లు సాధించినా ప్రథమార్థంలో కోల్పోయిన ఆధిక్యం బెంగళూర్ బుల్స్‌ను వెంటాడింది. ఆఖరు పది నిమిషాల్లో అదరగొట్టే ప్రదర్శన చేసిన బెంగళూర్ బుల్స్ స్కోరు సమం చేసి ఏకంగా ఆధక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్‌ను దబంగ్ ఢిల్లీ నిలువరించినా.. జై భగవాన్ను ఆ జట్టు డిఫెండర్లు నిలువరించలేకపోయారు. 11 రెయిడ్ పాయింట్లతో మెరిసిన భగవాన్ బెంగళూర్ బుల్స్‌ను గెలుపు బాట పట్టించాడు. ఆటలో మూడోంతుల భాగం ఆధిక్యంలో నిలిచిన దబంగ్ ఢిల్లీ.. ఆఖర్లో బోల్తా పడింది. -
టైటాన్స్ పరాజయాల ‘హ్యాట్రిక్’
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌ను విజయంతో మొదలుపెట్టిన తెలుగు టైటాన్స్ తర్వాత వరుసగా ఓడిపోతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37–41 స్కోరు తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో కంగుతింది. తెలుగు టైటాన్స్‌కు వరుసగా ఇది మూడో ఓటమి. కెప్టెన్ పవన్ సెహ్రావత్ జట్టును గెలిపించేందుకు చక్కని పోరాటమే చేశాడు. 17 సార్లు కూతకెళ్లిన పవన్ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. 6 బోనస్ పాయింట్లు సహా మొత్తం 18 పాయింట్లు సాధించాడు. మరో రెయిడర్ ఆశిష్ నర్వాల్ (9) కూడా రాణించాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ 3, డిఫెండర్ సాగర్ 2 పాయింట్లు తెచ్చారు. అయితే ప్రత్యర్థి దబంగ్ ఢిల్లీ జట్టు తరఫున రెయిడర్లు కెపె్టన్ నవీన్ కుమార్, అశు మాలిక్ చెలరేగారు. ఇద్దరు చెరో 15 పాయింట్లతో జట్టు విజయానికి బాట వేశారు.వీళ్లిద్దరు క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టడంతో తెలుగు టైటాన్స్ ఆఖరిదాకా పోరాడిన ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒక్క మ్యాచ్‌లో గెలిచి మూడింట ఓడింది. మూడు మ్యాచ్‌లాడిన ఢిల్లీ రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగే పోటీల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది. యూపీ యోధాస్‌ను గుజరాత్ జెయింట్స్ ఢీకొంటుంది. బెంగాల్, యూ ముంబా మ్యాచ్ టై అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో యూ ముంబా, బెంగాల్ వారియర్స్ హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ 31–31 స్కోరు వద్ద టై అయ్యింది. వారియర్స్ జట్టులో రెయిడర్ మణిందర్ సింగ్ (8 పాయింట్లు), డిఫెండర్ మయూర్ కదం (6) అదరగొట్టారు. ఒకరు కూతకెల్లి పాయింట్లు తెస్తుంటే మరొకరు ప్రత్యర్థి రెయిడర్లను టాకిల్ చేసి పాయింట్లు సాధించారు. మిగిలిన వారిలో నితీశ్ కుమార్ (4), సుశీల్ కాంబ్రేకర్ (3), నితిన్ ధన్కర్ (3), కెప్టెన్ ఫజల్ అత్రాచలి (3) మెరుగ్గా ఆడారు. యూ ముంబా జట్టులో రెయిడర్ మన్జీత్ (7 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. -
ప్రో కబడ్డీ వేలం: ఐపీఎల్ రేంజ్లో ధర పలికిన ప్లేయర్స్.. రికార్డులు బ్రేక్
Pro Kabaddi.. దేశంలో క్రికెట్‌తో పాటుగా కబడ్డీకి సైతం క్రేజ్ ఉంది. ఇండియాలో ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీకి(Pro Kabbadi)కి కూడా ఎంతో ఆదరణ కనిపించింది. కబడ్డి ఫ్యాన్స్‌ను అలరిస్తూ ప్రో కబడ్డీ ఇప్పటికి 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రో కబడ్డీ 9వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. అయితే, 9వ సీజన్‌కు ముందు ప్రో కబడ్డీకి భారీ వేలం జరిగింది. ముంబై వేదికగా రెండు రోజులపాటు(ఆగస్టు5, 6 తేదీల్లో) జరిగిన మెగా వేలంలో కబడ్డీ స్టార్ ప్లేయర్స్ ఊహించని ధర పలికారు. వేలంలో రికార్డు ధరకు ప్లేయర్స్‌ను ప్రాంచైజీలు దక్కించుకున్నాయి. మొత్తంగా 12 టీమ్స్ 500 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయడానికి పోటీపడ్డాయి. It's the Hi-Flyer's 🌏 and we're just living in it 🤷♂️ Pawan Sehrawat shatters the #vivoPKLPlayerAuction records to emerge as the most expensive buy in the history of #vivoProKabaddi 🤯@tamilthalaivas can now breathe easy like all of us, eh? 👀 pic.twitter.com/Ej2PtKPqFv — ProKabaddi (@ProKabaddi) August 5, 2022 కాగా, ఈ మెగా వేలంలో రికార్డు స్థాయిలో పవన్ షెరావత్‌ను రూ.2.65కోట్లకు తమిళ్ తలైవాస్ దక్కించుకోగా.. వికాస్ ఖండోలాను రూ.1.70కోట్లకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. ఇక, ఫజల్ అట్రాసలిని పూణేరి పల్టన్స్.. రూ. 1. 38కోట్లకు దక్కించుకుంది. గుమాన్ సింగ్‌ను రూ. 1.21కోట్లకు యు ముంబా కొనుగోలు చేసింది. మరోవైపు.. ప్రొ కబడ్డీలో రికార్డు బ్రేకర్‌గా పేరొందిన ప్రదీప్ నర్వాల్‌ను రూ.90 లక్షలకు యూపీ యోధా ఎఫ్‌బీఎంలో దక్కించుకుంది. ప్రొ కబడ్డీ చరిత్రలోనే పవన్ షెరావత్.. భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఇక హర్యానా స్టీలర్ రూ.65.10లక్షలకు అమీర్ హొసైన్‌ను, రవికుమార్‌ను రూ.64.10లక్షలకు(దబాంగ్ ఢిల్లీ), నీరజ్ నర్వాల్‌ను బెంగళూరు బుల్స్ రూ.43లక్షలకు కొనుగోలు చేసుకున్నాయి. ನಮ್ಮ ಗೂಳಿ ಪಡೆ 😍 How's that squad looking, #BullsSene? ⚡#FullChargeMaadi #BengaluruBulls #vivoPKLPlayerAuctions pic.twitter.com/oDyrX89itc — Bengaluru Bulls (@BengaluruBulls) August 6, 2022 Ala re ala! We welcome the Sultan to Pune! 🦁 . .#PuneriPaltan #Bhaaripaltan #Gheuntak #vivoPKLPlayersAuction #BhaariAuction pic.twitter.com/CqgL2limse — Puneri Paltan (@PuneriPaltan) August 5, 2022 ఇక, తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే.. రజనీష్, అంకిత్ బెనివల్ను రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా అభిషేక్ సింగ్, మోను గోయల్,పర్వేష్ భైంస్వాల్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, సిద్దార్ధ్ దేశాయ్‌ను కొనుగోలు చేశారు. కాగా, రాహుల్ చౌదరిని కనీస ధర రూ.10లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. దబాంగ్ ఢిల్లీ నవీన్ కుమార్, విజయ్ను రీటైన్ చేసుకుంది. Our first buy of the day Parvesh Bhainswal will be the part of #Titansquad#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/uYFjkcC4jo — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Abhishek Singh is set to expand the strength of the #Titansquad in season-9. How excited are you ?#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/gvJRfJaIkD — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Pesh hai aapke #PKL2022 #GujaratGiants squad! 💪#Giant family, how do you feel about the team? 🤩#GarjegaGujarat #Adani #vivoProKabaddi #vivoPKLPlayerAuction pic.twitter.com/UCyjmZSGdX — Gujarat Giants (@GujaratGiants) August 6, 2022 ఇది కూడా చదవండి: సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. -
నవీన్ అదుర్స్ దబంగ్ ఢిల్లీకి రెండో విజయం
బెంగళూరు: దబంగ్ ఢిల్లీ జట్టు స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ మరోసారి చెలరేగాడు. ఏకంగా 17 పాయింట్లు సాధించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 31–27తో యు ముంబాపై గెలిచింది. మ్యాచ్‌లో మొత్తం 28 సార్లు కూతకు వెళ్లిన నవీన్ 16 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను పట్టేసి మరో పాయింట్‌ను సాధించాడు. ఈ ప్రదర్శనతో నవీన్ 500 రెయిడింగ్ పాయింట్ల మార్కును అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్ (47)ల్లో ఈ ఘనతను అందుకున్న తొలి రెయిడర్‌గా నవీన్ నిలిచాడు. సహచరుడు జోగిందర్ సింగ్ నర్వాల్ (4 పాయింట్ల) ప్రత్యర్థిని పట్టేయడంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యు ముంబా తరఫున అజిత్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 38–30తో తమిళ్ తలైవాస్‌పై, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 31–28తో గుజరాత్ జెయింట్స్ గెలిచాయి. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధతో పట్నా పైరేట్స్; పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్; హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి. -
వారెవ్వా వారియర్స్
అహ్మదాబాద్: తొలి 6 నిమిషాల ఆటను చూస్తే దబంగ్ ఢిల్లీదే టైటిల్ అనుకున్నారు. అయితే అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న బెంగాల్ వారియర్స్ సీజన్లో టాప్ ఫామ్‌లో ఉన్న దబంగ్ ఢిల్లీకి షాక్ ఇస్తూ ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 18 పాయింట్లతో జట్టు విజయం కోసం తుది వరకు చేసిన పోరాటం... బెంగాల్ సమష్టి ప్రదర్శన ముందు ఓడిపోయింది. దీంతో శనివారం జరిగిన టైటిల్ పోరులో బెంగాల్ వారియర్స్ 39–34తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. బెంగాల్ తరఫున నబీబ„Š (10 పాయింట్లు), సుకేశ్ హెగ్డే (8 పాయింట్లు), ట్యాక్లింగ్‌లో జీవన్ (4 పాయింట్లు) ప్రదర్శన జట్టుకు టైటిల్‌ను ఖాయం చేసింది. సీజన్ మొత్తం అద్భుతంగా రాణిస్తూ వచ్చిన ఢిల్లీ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. ఆరంభంలో అద్భుతంగా ఆడి 11–3తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఇక్కడి నుంచి అనూహ్యంగా గాడి తప్పిన ఆ జట్టు మళ్లీ కోలుకోలేకపోయింది. బెంగాల్ స్టార్ రైడర్ మణీందర్ సింగ్ గాయం కారణంగా ఫైనల్ బరిలో దిగలేదు. దీంతో రైడింగ్ భారాన్ని సుకేశ్, నబీబ„Š మోశారు. తొలుత తడబడి పుంజుకున్న వీరు ప్రత్యరి్థని ఆలౌట్‌చేసి విరామానికి స్కోర్‌ను 17–17తో సమం చేశారు. రెండో అర్ధభాగంలో మరింతగా చెలరేగిన బెంగాల్ ప్రత్యరి్థని మరో రెండు సార్లు ఆలౌట్ చేసి కబడ్డీ కింగ్‌గా నిలిచింది. విజేత బెంగాల్ వారియర్స్ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. -
ప్లే ఆఫ్స్ నుంచి పుణే ఔట్
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి పుణేరి పల్టన్ నిష్క్రమించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 60–40తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. దబంగ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ మరో సూపర్ ‘టెన్’ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. 22 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతడు 19 పాయింట్లు సాధించాడు. చంద్రన్ రంజిత్ 12 పాయింట్లతో విజయంలో తన వంతు పాత్ర పోషించగా... ట్యాక్లింగ్‌లో రవీందర్ పహల్ ‘హై–ఫై’ (6 పాయింట్ల)తో ప్రత్యరి్థని పట్టేశాడు. పుణే తరఫున నితిన్ తోమర్ (7 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 38–37తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై నెగ్గింది. -
తెలుగు టైటాన్స్ పరాజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 29–37తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. సిద్దార్థ్ దేశాయ్ 12 పాయింట్లతో రాణించినా అతనికి సహచరుల నుంచి మద్దతు కరువైంది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ మాత్రం మరో సూపర్ ‘టెన్’ (12 పాయింట్లు) సాధించాడు. సీజన్లో టైటాన్స్‌కు మరో ఏడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా... ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 38–22తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. -
ఢిల్లీని గెలిపించిన నవీన్
పుణే: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్ సీజన్లో ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరోసారి సూపర్ ‘టెన్’ సాధించి అదరగొట్టాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 34–30తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. నవీన్ (12 పాయింట్లు)కు ట్యాక్లింగ్‌లో విశాల్ (3 పాయింట్లు), జోగిందర్ (3 పాయిం ట్లు) సహకరించడంతో దబంగ్ విజయం ఖాయ మైంది. 12 విజయాలతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ‘టాప్’ ప్లేస్‌లో కొనసాగుతోంది. పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 55–33తో ఘనవిజయం సాధించింది. పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ 18 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో యూపీ యోధ; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
ఎలిమినేటర్–3కి యూపీ, ఢిల్లీ
కొచ్చి: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో యూపీ యోధ, దబంగ్ ఢిల్లీ జట్లు మూడో ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధిం చాయి. ఆదివారం జరిగిన ప్లే ఆఫ్ ఎలిమినేటర్–1లో యూపీ యోధ 34–29తో యు ముంబాపై... ఎలిమినేటర్–2లో దబంగ్ ఢిల్లీ 39–28తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచాయి. నేడు జరిగే క్వాలిఫయర్–1లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్, ఎలిమినేటర్–3లో యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ తలపడనున్నాయి. క్వాలిఫయర్–1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఎలిమినేటర్–3 విజేత జట్టుతో జనవరి 3న క్వాలిఫయర్–2లో తలపడుతుంది. ఈ మ్యాచ్ విజేత ఫైనల్లో రెండో బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. -
దబంగ్ ఢిల్లీకి పదో విజయం
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన ఆ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 37–31తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన దబంగ్ ఢిల్లీ తొలి సగం ముగిసే సమయానికి 20–14తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా జోరు కనబరిచి చివరకు విజయం సాధించింది. ఢిల్లీ తరఫున మిరాజ్ షేక్ 13 పాయింట్లతో మెరవగా... బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ 9, భూపేందర్ 5 పాయింట్లు సాధించారు. లీగ్‌లో నేడు విశ్రాంతి రోజు. మంగళవారం జరుగనున్న మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తమిళ్ తలైవాస్, బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
ఢిల్లీకి పట్నా పంచ్
ప్రొ కబడ్డీ లీగ్ న్యూఢిల్లీ: చివరి క్షణాల వరకు సమాన పాయింట్లతో ఉన్న దశలో పట్నా పైరేట్స్ అద్భుతం చేసింది. మ్యాచ్ చివరి రైడ్‌కు వెళ్లిన దబాంగ్ ఢిల్లీ స్టార్ ఆటగాడు కాశిలింగ్ అడిగేను పట్టేసిన పట్నా 32-31 తేడాతో నెగ్గింది. ఢిల్లీ తరఫున కాశిలింగ్ 9, మెరాజ్ షేక్ 8 రైడింగ్ పాయింట్లు సాధించారు. పట్నాకు పర్దీప్ నర్వాల్ 9 పాయింట్లు అందించాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే హోరాహోరీగా సాగింది. సొంత గడ్డపై మెరుగ్గా రాణిస్తోన్న ఢిల్లీ ఆటగాళ్లు పట్నానూ వణికించారు. దీంతో ప్రథమార్ధం 16-14 ఆధిక్యంతో ముగించారు. ఆ తర్వాత రెండు జట్ల మధ్య ఒకటి రెండు పాయింట్ల తేడాతో ఆధిక్యం మారుతూ వచ్చింది. ఇది చివరి సెకన్ వరకు కొనసాగినా ఢిల్లీని ఆఖర్లో పట్నా దెబ్బతీసింది. ఫైనల్లో ఫైర్ బర్డ్స్ మహిళల కబడ్డీ చాలెంజ్‌లో ఫైర్ బర్డ్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం ఐస్ డివాతో జరిగిన మ్యాచ్‌లో 22-13 తేడాతో నెగ్గింది. ఆరంభంలో గట్టిపోటీనిచ్చిన ఐస్ డివాస్ చివర్లో ఒత్తిడికి లోనయ్యింది. ఇక ఈనెల 31న హైదరాబాద్‌లో జరిగే ఫైనల్లో స్టార్మ్ క్వీన్‌తో ఫైర్ బర్డ్స్ తలపడుతుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు పట్నా పైరేట్స్ X తెలుగు టైటాన్స్ రాత్రి 8 గంటల నుంచి దబాంగ్ ఢిల్లీ కేసీ X పుణెరి పల్టన్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం -
పుణెరి, ఢిల్లీ మ్యాచ్ టై
ముంబై: చివర్లో పట్టు వదలకుండా పోరాడిన పుణెరి పల్టాన్ ఓటమి నుంచి గట్టెక్కింది. మంగళవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్‌ను 27-27తో టై చేసింది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో ఢిల్లీ ఆధిక్యం ప్రదర్శించింది. తొలి పది నిమిషాలు చకచకా పాయింట్లు సాధించినా ఆ తర్వాత అనూహ్యంగా పుణె ఆటగాళ్లు ఢిల్లీని వెనక్కినెట్టారు.మంజిత్ చిల్లార్, దీపక్ నివాస్ హూడా అద్భుతంగా ఆడి ఏడేసి పాయింట్లు సాధించారు. చివరి ఐదు నిమిషాలు ఆధిక్యం ఇరు జట్ల మధ్య దోబూచిలాడినా మ్యాచ్ టై అయింది. ఫైర్ బర్డ్స్ శుభారంభం: తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల కబడ్డీ చాలెంజ్‌లో ఫైర్ బర్డ్స్ జట్టు శుభారంభం చేసింది. ఐస్ డివాస్తో జరిగిన ఈ మ్యాచ్‌లో 25-11తో సునాయాసంగా గెలిచింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు తెలుగు టైటాన్స్ X జైపూర్ పింక్ పాంథర్స్ రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం యు ముంబా X పట్నా పైరేట్స్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం -
బెంగాల్ వారియర్స్ బోణీ
ప్రొ కబడ్డీ లీగ్ ముంబై: తమ తొలి మ్యాచ్‌లో తృటిలో పరాజయం పాలైన బెంగాల్ వారియర్స్ రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో భాగంగా సోమవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్‌లో 31-23 తేడాతో విజయం సాధించింది. ప్రథమార్ధం వరకు ఇరు జట్లు పోటాపోటీగా ఆడినా ఆ తర్వాత బెంగాల్ పైచేయి సాధించింది. ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణించడంతో బెంగాల్ విజయం సులువైంది. నితిన్ మదానే, మోను గోయట్ మూడేసి రైడింగ్ పాయింట్లు సాధించగా ఢిల్లీ నుంచి మెరాజ్ షేక్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడు. పట్నా విజయం: డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ విజయంతో లీగ్‌ను ఆరంభించింది. పుణెరి పల్టాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 30-24 తేడాతో నెగ్గింది. పర్దీప్ నర్వాల్, సుర్జీత్ సింగ్ ఏడేసి పాయింట్లతో అదరగొట్టారు. పుణెరి నుంచి నితిన్ ఏడు, దీపక్ హూడా ఆరు పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌లో పుణెరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ కేసీ తలపడతాయి. -
యు ముంబా టాప్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా (60 పాయింట్లు) లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబా 36-20తో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. ముంబా మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లకు గాను 12 గెలవడం విశేషం. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ జట్టు 43-19తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. లీగ్ దశలో పట్నా పైరేట్స్ (58) రెండో స్థానంలో, పుణేరి పల్టన్ (48) మూడో స్థానంలో, బెంగాల్ వారియర్స్ (47) నాలుగో స్థానంలో నిలిచాయి. శనివారం ఢిల్లీలో జరిగే సెమీఫైనల్స్‌లో బెంగాల్ వారియర్స్‌తో యు ముంబా; పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ విజయం
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మరోసారి స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 44-36తో ఆతిథ్య దబాంగ్ ఢిల్లీ జట్టుపై నెగ్గింది. టైటాన్స్ స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి విశేషంగా రాణించి ఏకంగా 17 పాయింట్లతో జట్టు విజయం లో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ బలియాన్ 10 పాయింట్లు తెచ్చాడు. ఢిల్లీ జట్టులో సుర్జీత్ సింగ్ 13, కాశీలింగ్ 10 పాయింట్లు సాధించారు. లీగ్‌లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఆరు విజయాలతో 33 పాయింట్లు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. భారత్‌కు మరో విజయం స్టెలన్‌బోస్క్ (దక్షిణాఫ్రికా): భారత అండర్-21 మహిళల హాకీ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మరో విజయం సాధించింది. బుధవారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8-0తో నెగ్గింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ జట్టు గెలిచిన సంగతి తెలిసిందే. -
యు ముంబా విజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీపై 30-17 స్కోరుతో ఘన విజయం సాధించింది. ముంబై తరఫున రిశాంక్ ఎనిమిది, కెప్టెన్ అనూప్ కుమార్ ఆరు పాయింట్లతో రాణించారు. ఢిల్లీ జట్టులో స్టార్ ఆటగాడు కాశీలింగ్ సహా అందరూ విఫలమయ్యారు. మరో మ్యాచ్‌లో ఆతిథ్య బెంగళూరు బుల్స్ జట్టు 36-26 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. -
తెలుగు టైటాన్స్ బోణీ
దబాంగ్ ఢిల్లీపై విజయం ఠ ప్రొ కబడ్డీ లీగ్-2 ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ జట్టుపై 36-27 తేడాతో ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ తరఫున మెరాజ్ షేక్ ఎనిమిది, దీపక్ నివాస్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించారు. రాహుల్ చౌదరి ఐదు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి టైటాన్స్ ఆటగాళ్ల అద్భుత రైడింగ్‌తో ఢిల్లీకి వణుకు పుట్టించారు. ప్రారంభంలోనే 6-2తో దూసుకెళ్లిన టైటాన్స్ తొలి అర్ధభాగం ముగిసే సరికి 18-8 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. నాలుగుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. రైడింగ్ ద్వారానే తెలుగు టైటాన్స్ 21 పాయింట్లు అందుకుంది. ముంబాకి రెండో గెలుపు జోరు మీదున్న యు ముంబా జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 36-23 తేడాతో సునాయాసంగా నెగ్గింది. షబీర్ బాపు పది రైడింగ్ పాయింట్లు సాధించాడు. గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న యు ముంబా జట్టు ప్రస్తుతం 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమవారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్; పాట్నా పైరేట్స్‌తో యు ముంబా తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఢిల్లీపై టైటాన్స్ విజయభేరి
ప్రొ కబడ్డీ లీగ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీపై 45-26 తేడాతో నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ వేదికపై నాలుగు మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకోగా... వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. సొంత వేదికల్లో జరిగిన మ్యాచ్‌లను ఓటమి లేకుండా ముగించిన టైటాన్స్... ఇదే ఘనతతో ఉన్న ‘యు ముంబ’ సరసన నిలిచింది. ఈ లీగ్‌లో వైజాగ్ వేదికగా ఇదే చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు పోటెత్తారు. మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు జోరు కనబరిచారు. పదో నిమిషంలోనే జట్టు లోనా సాధించింది. ప్రథమార్ధం 20-12తో ముగించగా ఆ తర్వాత కూడా ఢిల్లీ ఆటగాళ్లను కుదురుకోనీయలేదు. ఓవరాల్‌గా రాహుల్ 12 రైడ్ పాయింట్లు, సుకేశ్ హెగ్డే 7 పాయింట్లు సాధించారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో తర్వాతి దశలో మ్యాచ్‌లు జైపూర్‌లో జరుగుతాయి. కబడ్డీపై అభిషేక్ సినిమా! ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ కబడ్డీ ఆటపైనే పూర్తి స్థాయిలో సినిమా తీయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.