బెంగాల్ వారియర్స్ బోణీ
ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: తమ తొలి మ్యాచ్‌లో తృటిలో పరాజయం పాలైన బెంగాల్ వారియర్స్ రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో భాగంగా సోమవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్‌లో 31-23 తేడాతో విజయం సాధించింది. ప్రథమార్ధం వరకు ఇరు జట్లు పోటాపోటీగా ఆడినా ఆ తర్వాత బెంగాల్ పైచేయి సాధించింది. ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణించడంతో బెంగాల్ విజయం సులువైంది. నితిన్ మదానే, మోను గోయట్ మూడేసి రైడింగ్ పాయింట్లు సాధించగా ఢిల్లీ నుంచి మెరాజ్ షేక్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడు.
పట్నా విజయం: డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ విజయంతో లీగ్‌ను ఆరంభించింది. పుణెరి పల్టాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 30-24 తేడాతో నెగ్గింది. పర్దీప్ నర్వాల్, సుర్జీత్ సింగ్ ఏడేసి పాయింట్లతో అదరగొట్టారు. పుణెరి నుంచి నితిన్ ఏడు, దీపక్ హూడా ఆరు పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌లో పుణెరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ కేసీ తలపడతాయి.