Bengal Warriors
-
PKL 11: ప్లే ఆఫ్స్‌లో ఢిల్లీ.. తెలుగు టైటాన్స్ పరిస్థితి?
అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ దశకు చేరింది. ఈ సీజన్లో టాప్-6కు అర్హత సాధించిన రెండో జట్టుగా జట్టు నిలిచింది. పుణె వేదికగా బెంగాల్ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 47–25 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది.ఇక ప్రొ కబడ్డి లీగ్ తాజా ఎడిషన్‌లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్ జట్టు ప్లే ఆఫ్స్‌నకు అర్హత పొందింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో 20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 4 మ్యాచ్‌లను ‘టై’ చేసుకొని 71 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. మొత్తం 12 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుకుంటాయి.మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్లుహరియాణా, ఢిల్లీ ఇప్పటికే తమ అర్హత సాధించగా.. మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బెంగాల్‌తో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ ఏకంగా 17 పాయింట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి.. తొమ్మిదిసార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. ఆరుసార్లు పాయింట్ నెగ్గకుండానే తిరిగి వచ్చాడు. మరో మూడుసార్లు విఫలమయ్యాడు.ఈ క్రమంలో.. నాలుగు బోనస్ పాయింట్లతోపాటు 12 టచ్ పాయింట్లు సాధించిన అశు ఒక ట్యాకిల్ పాయింట్ కూడా నెగ్గాడు. ఢిల్లీకే చెందిన యోగేశ్ 9 పాయింట్లు, ఆశిష్ 5 పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ తరఫున విశ్వాస్ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. నితేశ్ కుమార్ ఐదు పాయింట్లు, కెప్టెన్ ఫజల్ అత్రాచలి నాలుగు పాయింట్లు స్కోరు చేశారు.రేసులో పుణేరి పల్టన్ఇక మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 37–32 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో పట్నా పైరేట్స్ 68 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్‌నకు చేరువైంది. తెలుగు టైటాన్స్ ఏస్థానంలో ఉందంటే?ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇరవై మ్యాచ్‌లలో పదకొండు గెలిచిన తెలుగు టైటాన్స్ 60 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.చదవండి: తమిళ్ తలైవాస్ అవుట్ -
తెలుగు టైటాన్స్ గెలుపు
పుణే: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పదో విజయంతో నాలుగో స్థానానికి ఎగబాకింది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 34–32తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. తెలుగు కెపె్టన్ విజయ్ మాలిక్ 19 సార్లు కూతకెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో ఆశిష్ నర్వాల్ (9) రాణించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ (14), మన్జీత్ (7) అదరగొట్టారు. దీంతో ఇరుజట్ల మధ్య ఆఖరిదాకా హోరాహోరీ సమరం జరిగింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 36–33తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. యూపీ రెయిడర్ గగన్ గౌడ (15) చెలరేగాడు.17 సార్లు కూతకెళ్లిన గగన్ క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో భవాని రాజ్‌పుత్ (6) రాణించగా, కెప్టెన్ సుమిత్ 3, అశు సింగ్, మహేందర్, హితేశ్ తలా 2 పాయింట్లు చేశారు. పల్టన్ జట్టులో పంకజ్ మోహితే (11), మోహిత్ గోయత్ (7) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్... యూ ముంబాతో గుజరాత్ జెయంట్స్ తలపడతాయి. -
పల్టన్ ఫటాఫట్
నోయిడా: డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు బెంగాల్ వారియర్స్ చేతులెత్తేసింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పుణేరి పల్టన్ అర్ధసెంచరీని మించిన పాయింట్లను అవలీలగా చేసింది. కూతకెళ్లిన రెయిడర్లు, డిఫెండర్లు క్రమం తప్పకుండా పాయింట్లను సాధించారు. దీంతో పల్టన్ 51–34 స్కోరుతో 17 పాయింట్ల తేడాతో వారియర్స్‌పై జయభేరి మోగించింది. ఆట మొదలైన 7 నిమిషాలకే బెంగాల్ ఆలౌటైంది. మళ్లీ తొలి అర్ధభాగం ముగిసే దశలో ఆలౌట్ కావడంతో 24–11తో పుణేరి పూర్తి ఆధిపత్యంతో బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం రెండో అర్ధభాగంలోనూ వారియర్స్ ఆటతీరు ఏమాత్రం మారలేదు. ఐదు నిమిషాలకే మ్యాచ్‌లో మూడోసారి ఆలౌటైంది. 11 నిమిషాల వ్యవధిలో నాలుగోసారి ఆలౌటైంది. పుణేరి జట్టు మ్యాచ్‌లో ఒకే ఒక్కసారి అది కూడా మ్యాచ్ ముగిసే ఆఖరి నిమిషంలో ఆలౌట్ కాగా... అప్పటికే పాయింట్ల ఫిఫ్టీ కొట్టింది. పల్టన్ రెయిడర్లు ఆకాశ్ షిండే (9 పాయింట్లు), మోహిత్ గోయత్ (9), పంకజ్ మోహితె (6), డిఫెండర్లు మోహిత్ (5), గౌరవ్ ఖత్రి (3) రాణించారు. బెంగాల్ తరఫున రెయిడర్ నితిన్ కుమార్ (13) అదరగొట్టాడు. మిగతా వారిలో కెప్టెన్, డిఫెండర్ ఫజల్ అత్రాచలి (3), ప్రణయ్ రాణే (5) మెరుగ్గా ఆడారు. తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 44–42తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. యూపీ ఆటగాళ్లలో గగన్ గౌడ (11), భవాని రాజ్‌పుత్ (10), హితేశ్ (8)లు రాణించారు. పట్నా జట్టులో రెయిడర్ దేవాంక్ (18) ఆకట్టుకున్నాడు. అయాన్ (10) రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్ తలపడనుండగా, యు ముంబాతో బెంగళూరు బుల్స్ పోటీపడుతుంది. -
తెలుగు టైటాన్స్‌దే పైచేయి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ‘హ్యాట్రిక్’ విజయాలతో పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 31–29తో బెంగాల్ వారియర్స్ పై నెగ్గింది. కెప్టెన్ విజయ్ మలిక్ (14 పాయింట్లు) అద్భుతంగా రాణించాడు. మ్యాచ్ కీలక దశలో రెయిడింగ్‌కు వెళ్లిన విజయ్ మూడు పాయింట్లు తెచ్చిపెట్టడం టైటాన్స్ విజయానికి కారణమైంది. డిఫెన్స్‌లోనూ తెలుగు జట్టు ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చేసింది. ఆల్‌రౌండర్ శంకర్ గడాయ్, డిఫెండర్ అంకిత్, రెయిడర్ మన్జీత్ తలా 3 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున రెయిడర్ ప్రణయ్ రాణే (9) అదరగొట్టాడు. తొలి అర్ధభాగాన్ని 19–9తో టైటాన్స్ ముగించగా... ద్వితీయార్ధంలో ప్రణయ్ క్రమంగా తెచ్చిపెట్టిన పాయింట్లతో రేసులోకి వచ్చింది. మిగతా వారిలో హేమరాజ్, విశ్వాస్ చెరో 4 పాయింట్లు చేశారు. అయితే తెలుగు కెప్టెన్ విజయ్ మలిక్ చేసిన పోరాటంతో విజయం దక్కింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 32–26తో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ జట్టులో రెయిడర్ వినయ్ (12) ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా 4, రెయిడర్ శివమ్ 5, డిఫెండర్ సంజయ్ 4 పాయింట్లు చేశారు. బుల్స్ జట్టులో ఒక్క అక్షిత్ (7) మాత్రమే నిలకడగా స్కోరు చేశాడు. స్టార్ రెయిడర్, కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ (1) ఆకట్టుకోలేకపోయాడు. నితిన్ రావల్ (4), జై భగవాన్ (3) మెరుగ్గా ఆడారు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన హరియాణా 9 విజయాలతో టాప్‌లో నిలువగా, 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచిన టైటాన్స్ రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
దేవాంక్ ధమాకా
నోయిడా: స్టార్ రెయిడర్ దేవాంక్ 15 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో పట్నా పైరేట్స్ 52–31 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. పట్నా తరఫున దేవాంక్ 10 రెయిడ్ పాయింట్లు, 5 బోనస్ పాయింట్లు సాధించగా... అయాన్ 11 పాయింట్లతో సత్తా చాటాడు. సందీప్ కుమార్ (8 పాయింట్లు), దీపక్ రాఠి (5 పాయింట్లు) కూడా రాణించడంతో పట్నా జట్టు ఘనవిజయం సాధించింది. మరోవైపు బెంగాల్ వారియర్స్ తరఫున నితిన్ కుమార్ (11 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. తాజా సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన పట్నా 6 విజయాలు, 4 పరాజయాలతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానానికి చేరింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 32–24 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్లు, నీరజ్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమాన్ సింగ్ 11 పాయింట్లతో పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు. 9 మ్యాచ్‌లాడిన జైపూర్ 5 విజయాలు, 3 పరాజయాలు, ఒక ‘టై’తో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
బెంగాల్ భారీ విజయం
హైదరాబాద్, నవంబర్ 9, 2024: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో బెంగాల్ వారియర్స్ దుమ్మురేపింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 40-29తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శన కనబరిచిన బెంగాల్ తరపున నితిన్‌కుమార్(14), మన్‌దీప్‌సింగ్(10) సూపర్-10తో కదంతొక్కారు. మరోవైపు బెంగళూరు జట్టులో అక్షిత్(11), అజింక్యా పవార్(8) రాణించినా..పర్దీప్ నార్వల్(2) ఘోరంగా విఫలమయ్యాడు.బెంగాల్ జోరు: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో కీలకమైన ప్లేఆఫ్స్ దశకు చేరుకోవాలంటే గెలక తప్పని పరిస్థితుల నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. శనివారం బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. మాజీ చాంపియన్ బెంగాల్ తమదైన రీతిలో బెంగళూరుపై జోరు కనబరిచింది. ముఖ్యంగా స్టార్ రైడర్ మన్‌దీప్‌సింగ్ దూకుడు కనబరిచాడు. తన తొలి రైడ్‌లోనే సుబ్రమణ్యంను ఔట్ చేసి బెంగాల్ పాయింట్ల ఖాతా తెరిచాడు. మరోవైపు పర్దీప్ నార్వల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మ్యాచ్ 16వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన బెంగళూరు రైడర్ అక్షిత్‌ను నితీశ్‌కుమార్ ఉడుం పట్టుతో బెంగాల్‌కు పాయింట్ అందించాడు. రెండు నిమిషాల వ్యవధిలో రైడ్‌కు వెళ్లిన మన్‌దీప్‌సింగ్..ఈసారి నితిన్ రావల్, పర్దీప్ నర్వాల్‌ను ఔట్ రెండు పాయింట్లతో బెంగాల్ జట్టులో జోష్ నింపాడు. బెంగళూరు తరఫున పర్దీప్ నార్వల్ విఫలమైనా..అక్షిత్ వరుస పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఓవైపు రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ బెంగాల్ జోరు కనబర్చడంతో బెంగళూరు ఢీలా పడిపోయింది. ఈ క్రమంలో తొలి అర్ధభాగం ముగిసే సరికి బెంగాల్ 15-12తో బెంగళూరుపై ఆధిక్యంలో నిలిచింది.అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలో బెంగాల్ పాయింట్ల వేటలో అదే దూకుడు కనబరిచింది. అంతగా అనుభవం లేని బెంగళూరును బోల్తా కొట్టిస్తూ కీలక పాయింట్లు కొల్లగొట్టింది. మ్యాచ్ 17వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన నితిన్‌కుమార్..లకీకుమార్ను ఔట్ చేసి బెంగాల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. నిమిషం తేడాతో రైడ్‌కు వచ్చిన మనిందర్‌సింగ్..నితిన్ నార్వల్, అజింక్యా పవార్‌ను ఔట్ చేయడంతో బెంగళూరు తొలిసారి ఆలౌటైంది. అంతగా ప్రభావం చూపని పర్దీప్ నార్వల్ స్థానంలో మరో ప్లేయర్‌ను బెంగళూరు సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుంది. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగస్తుందనగా బెంగళూరు రెండో సారి ఆలౌట్ కావడంతో బెంగాల్ విజయం ఖరారైంది. మ్యాచ్ ఆసాంతం మన్‌దీప్‌సింగ్ రైడింగ్ జోరు సాగింది. -
దబాంగ్ ఢిల్లీ గెలుపు బాట
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ దబాంగ్ ఢిల్లీ కేసీ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత బెంగాల్ వారియర్స్‌ను ఓడించి మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 33–30 తేడాతో బెంగాల్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్, స్టార్ రెయిడర్ పది పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు. అతనికి తోడు వినయ్ 8 పాయింట్లు, ఆశీష్ ఆరు పాయింట్లతో రాణించారు. బెంగాల్ వారియర్స్ జట్టులో రెయిడర్ నితిన్ కుమార్ 15 పాయింట్లతో అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్, డిఫెండర్ ఫజెల్ అత్రాచలి 5 పాయింట్లతో హైఫైవ్ ఖాతాలో వేసుకున్నాడు.హోరాహోరీలో ఢిల్లీ పైయిఆరంభంలో ఆట హోరాహోరీగా సాగినా దబాంగ్ ఢిల్లీ క్రమంగా జోరు పెంచి తొలి అర్ధభాగంలో పైచేయి సాధించింది. మణిందర్ బోనస్‌తో బెంగాల్ వారియర్స్ జట్టు ఖాతా తెరిచాడు. ఆవెంటనే ఢిల్లీ స్టార్ రెయిడర్ బోనస్ సాధించినా ఫజెల్ అత్రాచలి అతడిని ట్యాకిల్ చేశాడు. తర్వాతి రెయిడ్‌లో విజయ్ కూడా ప్రత్యర్థి డిఫెండర్లకు చిక్కగా.. డూ ఆర్ డై రెయిడ్‌లో నితిన్ కుమార్ అషు మాలిక్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు.దాంతో బెంగాల్ 4–1తో ఆరంభ ఆధిక్యం దక్కించుకుంది. కానీ, ఆశీష్ వరుస రెయిడ్లలో విజయవంతం కావడంతో ఢిల్లీ 6–6తో స్కోరు సమం చేసింది. అషు మాలిక్ రెయిండింగ్‌లో జోరు పెంచగా.. డిఫెన్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. మణిందర్‌తో పాటు విశ్వాస్ను ట్యాకిల్ చేసి బెంగాల్ ను ఆలౌట్ చేసి 14–8తో ఆధిక్యాంలోకి వెళ్లింది. బెంగాల్ జట్టులో నితిన్ వరుస రెయిడ్ పాయింట్లు రాబట్టినా.. ఆధిక్యాన్ని కాపాడుకున్న ఢిల్లీ19-13తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.ఢిల్లీదే జోరురెండో అర్ధభాగంలోనూ వారియర్స్ ఆటగాడు నితిన్ జోరు చూపెడూ సూపర్ 10 పూర్తి చేసుకున్నాడు. దాంతో బెంగాల్ నెమ్మదిగా ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించి పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. డిఫెన్స్‌లోనూ కాస్త మెరుగైంది. అటు రెయిడింగ్‌లో నితిన్‌కు తోడు సుశీల్ కూడా వెంటవెంటనే రెండు రెయిడ్ పాయింట్లు రాబట్టాడు. డూ ఆర్ డై రెయిడ్‌కు వచ్చిన అంకిత్ మానెను అద్భుతంగా ట్యాకిల్ చేసిన ఫజెల్ అత్రాచలి హై ఫైవ్ పూర్తి చేసుకున్నాడు. దాంతో మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా బెంగాల్27–31తో ఢిల్లీ ఆధిక్యాన్ని నాలుగు పాయింట్లకు పరిమితం చేసింది.ఈ దశలో అషు మాలిక్ ఎమ్టీ రైయిడ్‌తో సమయం వృథా చేసే ప్రయత్నం చేశాడు. చివర్లో నితిన్ మెరుపు వేగంతో రెండు పాయింట్లు తీసుకురావడంతో స్కోరు 29–31తో ఉత్కంఠా మారింది. అయితే, డూ ఆర్ డై రెయిడ్‌కు వెళ్లిన అషు మాలిక్.. మయూర్ కదమ్‌ను డైవింగ్ హ్యాండ్ టచ్‌తో ఢిల్లీకి మరో పాయింట్ అందించాడు. ఆ వెంటనే నితిన్ మరో టచ్ పాయింట్ తెచ్చినా.. ఆఖరి రెయిడ్‌కు వచ్చిన అషు మాలిక్.. ఫజెల్ అత్రాచలి పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో ఢిల్లీ మూడు పాయింట్ల ఆధిక్యంతో మ్యాచ్‌ను ముగించింది. -
PKL 11: నువ్వా- నేనా!.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ ఎడిషన్‌లో మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఆఖరు కూత వరకు ఉత్కంఠ రేపిన బెంగాల్ వారియర్స్, పుణెరి పల్టాన్ పోరు 32-32తో టై అయ్యింది. మంగళవారం జరిగిన మాజీ చాంపియన్ల సమరంలో ప్రథమార్థం ఆటలో పుణెరి పల్టాన్ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించినా.. ద్వితీయార్థంలో బెంగాల్ వారియర్స్ లెక్క సరి చేసింది.ఇక ఈ సీజన్లో ఇది మూడో టై కావటం విశేషం. కాగా బెంగాల్ వారియర్స్ ఆటగాళ్లలో రెయిడర్ సుశీల్ (10 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో మెరువగా.. నితిన్ కుమార్ (6 పాయింట్లు), నితేశ్ కుమార్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. పుణెరి పల్టాన్ తరఫున ఆకాశ్ షిండె (8 పాయింట్లు), పంకజ్ మోహిత్ (8 పాయింట్లు) రాణించారు. ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు,ఓ టైతో పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్ అగ్రస్థానం నిలుపుకోగా.. బెంగాల్ వారియర్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిచింది.నువ్వా.. నేనా! అంటూ సాగిన సమరం బెంగాల్ వారియర్స్‌తో మ్యాచ్‌ను పుణెరి పల్టాన్ ఘనంగా ఆరంభించింది. తొలి పది నిమిషాల్లో పాయింట్ల కోసం ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చారు. ప్రతి కూతకు పాయింట్లు మారుతుండటంతో ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్టు ఉత్కంఠ నడిచింది.తొలి పది నిమిషాల ఆట అనంతరం బెంగాల్ వారియర్స్ 7-6తో ఓ పాయింట్ ముందంజలో నిలిచింది. కానీ తర్వాతి పది నిమిషాల్లో పుణెరి పల్టాన్ పుంజుకుంది. ప్రథమార్థం ఆట ముగిసే సమయానికి పుణెరి పల్టాన్ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. 15-12తో బెంగాల్ వారియర్స్‌పై పైచేయి సాధించింది.విరామం అనంతరం బెంగాల్ వారియర్స్ దూకుడు పెంచింది. రెయిడర్లు సుశీల్ సూపర్ టెన్ షోతో దూకుడు పెంచాడు. దీంతో బెంగాల్ వారియర్స్ వెనుకంజ నుంచి పుంజుకుని ఆధిక్యం కోసం పోటీపడింది. రెయిడింగ్‌లో నితిన్ కుమార్, డిఫెన్స్‌లో నితిన్ మెరవటంతో బెంగాల్ వారియర్స్ రేసులోకి వచ్చింది.చావోరేవో తేల్చకోవాల్సిన రెయిడ్లలోఈ క్రమంలో.. 30-31తో ఓ పాయింట్ వెనుకంజలో ఉండగా విశ్వాస్ రెయిడ్ పాయింట్‌తో బెంగాల్ వారియర్స్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా చావోరేవో తేల్చకోవాల్సిన రెయిడ్లలో ఇరు జట్లు నిరాశపరిచాయి. ఆఖరు రెండు కూతల్లో ఎవరికీ పాయింట్ దక్కలేదు. దీంతో 32-32తో బెంగాల్ వారియర్స్, పుణెరి పల్టాన్ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమానంగా పంచుకున్నాయి. -
PKL 11: బెంగాల్ వారియర్స్ బోణీ, యూపీ యోధాస్‌పై 32-29తో గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో బెంగాల్ వారియర్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ మెరుపు విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ 32-29తో గెలుపొందింది. ఉత్కంఠ మ్యాచ్‌లో మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించిన బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాస్‌కు సీజన్లో తొలి ఓటమి రుచి చూపించింది. బెంగాల్ వారియర్స్ సమిష్టి ప్రదర్శనతో రాణించింది. రెయిడర్లు మణిందర్ సింగ్ (8), నితిన్ (7), సుశీల్ (7) అదరగొట్టారు. యూపీ యోధాస్ ఆల్‌రౌండర్ భరత్ (13) సూపర్ టెన్తో షో చేసినా.. ఫలితం దక్కలేదు.ప్రథమార్థం హోరాహోరీ : బెంగాల్ వారియర్స్, యూపీ యోధాస్ తొలి అర్థభాగం ఆటలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. తొలి రెండు మ్యాచుల్లో విజయాలతో ఊపుమీదున్న యూపీ యోధాస్‌ను ఒత్తిడిలో నిలువరించిన బెంగాల్ వారియర్స్ 12-11తో ప్రథమార్థంలో ఆధిక్యం సాధించింది. ఇరు జట్లూ రెయిడింగ్, డిఫెన్స్‌లో బలంగా ఉండటంతో ఏ జట్టు సైతం ఆలౌట్ స్కోరు చేయలేకపోయింది. భరత్ సక్సెస్ఫుల్ రెయిడ్‌తో యూపీ యోధాస్ తొలుత ఖాతా తెరిచినా.. బెంగాల్ వారియర్స్‌ను మణిందర్ సింగ్ ముందుండి నడిపించాడు. బెంగాల్ వారియర్స్ రెయిడింగ్‌లో 9 పాయింట్లు సాధించగా, యూపీ యోధాస్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. డిఫెన్స్‌లో ఇరు జట్లు మూడేసి పాయింట్లు సాధించాయి.వారియర్స్ దూకుడు : ప్రథమార్థం ఆటలో ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచిన బెంగాల్ వారియర్స్ విరామం అనంతరం దూకుడు పెంచింది. ఆఖరు పది నిమిషాల ఆట వరకు యూపీ యోధాస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ మణిందర్ సింగ్‌కు నితిన్ జత కలవటంతో బెంగాల్ దూకుడు ముందు యూపీ యోధాస్ నిలువలేదు. వరుసగా సక్సెస్ఫుల్ రెయిడ్స్‌తో బెంగాల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 25-21తో నాలుగు పాయింట్ల ముందంజ వేసిన బెంగాల్ ఆ తర్వాత యోధాస్‌కు చిక్కలేదు. యోధాస్ రెయిడర్ భరత్ సూపర్ టెన్ ప్రదర్శనతో మెరిసినా.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. ఆఖరు రెండు నిమిషాల్లోనూ యూపీ యోధాస్ గట్టిగా ప్రయత్నించినా అప్పటికే మ్యాచ్ బెంగాల్ వారియర్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. -
PKL 10: బెంగాల్ వారియర్స్ అవుట్
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలవాలంటే మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్ని కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బెంగాల్ వారియర్స్ 26–29తో పుణేరి పల్టన్ చేతిలో ఓడిపోయింది. దీంతో హరియాణా స్టీలర్స్‌కు నాలుగో సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి రెయిడర్లు ఆకాశ్ షిండే 10, పంకజ్ మోహితే 6 పాయింట్లు సాధించగా, బెంగాల్ జట్టులో నితిన్ కుమార్ (5), మణిందర్ (4) రాణించారు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 45–43తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ (18) అదరగొట్టాడు. తలైవాస్ జట్టుల -
Pro Kabaddi League 2024: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. సీజన్లో పదో పరాజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 26–46తో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో టైటాన్స్ జట్టుకిది పదో పరాజయం. టైటాన్స్ జట్టులో కెపె్టన్ పవన్ సెహ్రావత్ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. పవన్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. వారియర్స్ జట్టులో వైభవ్ 9 పాయింట్లు, నితిన్ 9 పాయింట్లు, విశ్వాస్ 8 పాయింట్లు, శుభమ్ 6 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తమిళ్ తలైవాస్; యు ముంబాతో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
వారియర్స్ విక్టరీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో బెంగాల్ వారియర్స్ రెండో విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 48–38 పాయింట్ల తేడాతో గెలిచింది. కెపె్టన్ మణీందర్ సింగ్ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేసి వారియర్స్ విక్టరీలో కీలకపాత్ర పోషించాడు. తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ 13 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 35–33తో దబంగ్ ఢిల్లీ జట్టును ఓడించింది. -
Pro Kabaddi 2022: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు మొదలయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–36తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్‌లో నెగ్గి, 14 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. తొమ్మిది పాయింట్లతో టైటాన్స్ చివరిదైన 12వ స్థానంలో ఉంది. వారియర్స్‌తో మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున రెయిడర్లు అభిషేక్ సింగ్ తొమ్మిది పాయింట్లతో, సిద్ధార్థ్ దేశాయ్ ఎనిమిది పాయింట్లతో, పర్మేశ్ ఐదు పాయింట్లతో రాణించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్ 41–28తో హరియాణా స్టీలర్స్‌పై, బెంగళూరు బుల్స్ 45–38తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. బెంగాల్ వారియర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 25–45 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున వినయ్ ఎనిమిది పాయింట్లు, మోనూ గోయట్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ జట్టులో రెయిడర్లు మణీందర్ సింగ్ 11 పాయింట్లు, దీపక్ హుడా 11 పాయింట్లు, శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 41–39తో పుణేరి పల్టన్‌పై, జైపూర్ పింక్ పాంథర్స్ 35–30తో పట్నా పైరేట్స్‌పై నెగ్గాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో యు ముంబా; గుజరాత్ జెయింట్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. చదవండి: Women's Asia Cup 2022: మరో విజయమే లక్ష్యంగా... థాయ్‌లాండ్‌తో భారత్ ఢీ -
Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం మూడు మ్యాచ్‌లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పట్నాతో మ్యాచ్‌లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్‌తో మ్యాచ్‌లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్ విజయం.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా..
Pro Kabaddi League- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–26 స్కోరుతో పుణేరీ పల్టన్‌ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. పట్నా తరఫున గుమాన్ సింగ్ 13 పాయింట్లు స్కోర్ చేయగా, పుణేరీ ఆటగాళ్లలో అస్లమ్ ఇనామ్దార్ 9 పాయింట్లు సాధించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 18 మ్యాచ్‌లు ఆడిన పట్నా పదమూడింట గెలిచి 70 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది. ఇదిలా ఉండగా... బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. బెంగాల్ తరఫున మణీందర్ సింగ్, ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ చెరో 16 పాయింట్లు స్కోర్ చేశారు. చదవండి: Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్ శర్మ -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్‌ని గెలిపించిన సచిన్
Pro Kabaddi League: Patna Pirates Beat Bengal Warriors: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–29తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పట్నా రెయిడర్ సచిన్ తన్వర్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్‌లో 11వ విజయంతో పట్నా మొత్తం 60 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 40–36తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
Pro Kabaddi League: బెంగాల్ వారియర్స్‌కు హరియణా షాక్
Pro Kabaddi League- Haryana Steelers Beat Bengal Warriors, Patna Pirates Defeat Gujarat Giants: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు ఏడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 46–29తో ఘనవిజయం సాధించింది. హరియాణా కెప్టెన్ వికాశ్ కండోలా పది రెయిడింగ్ పాయింట్లు సంపాదించి తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ 36–36తో ‘టై’ కాగా... మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–23తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
బెంగాల్ వారియర్స్‌కు మరో ఓటమి..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 39–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ జట్టుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. పుణేరి పల్టన్ రెయిడర్ ఇనామ్దార్ 17 పాయింట్లు స్కోరు చేశాడు. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 13 పాయింట్లతో ఆకట్టుకున్నా అతనికి ఇతర సభ్యుల నుంచి సహకారం లభించలేదు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 42–27తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. యూపీ యోధ రెయిడర్ శ్రీకాంత్ జాదవ్ 15 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్; జైపూర్ పింక్‌పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. చదవండి: IPL- 2022: ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! -
బెంగాల్ వారియర్స్‌కు పట్నా పైరేట్స్ షాక్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్ జట్టు తమ ప్రతాపం చూపించింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌కు షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పట్నా రెయిడర్ మోనూ గోయట్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పట్నా 32–25తో ఆధిక్యంలో ఉన్న దశలో మోనూ గోయట్ సింగిల్ రెయిడ్‌లో ఏకంగా ఏడు పాయింట్లు సాధించి అబ్బురపరిచాడు. మ్యాచ్ మొత్తంలో మోనూ 15 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ లీగ్ చరిత్రలో మోనూ 500 రెయిడింగ్ పాయింట్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ లీగ్‌లో పట్నాకిది మూడో విజయం. బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 36–26తో పుణేరి పల్టన్‌ను ఓడించి ఈ లీగ్‌లో తొలి విజయం నమోదు చేసింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో యూపీ యోధ; బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
అహ్మదాబాద్: తొలి 6 నిమిషాల ఆటను చూస్తే దబంగ్ ఢిల్లీదే టైటిల్ అనుకున్నారు. అయితే అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న బెంగాల్ వారియర్స్ సీజన్లో టాప్ ఫామ్‌లో ఉన్న దబంగ్ ఢిల్లీకి షాక్ ఇస్తూ ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 18 పాయింట్లతో జట్టు విజయం కోసం తుది వరకు చేసిన పోరాటం... బెంగాల్ సమష్టి ప్రదర్శన ముందు ఓడిపోయింది. దీంతో శనివారం జరిగిన టైటిల్ పోరులో బెంగాల్ వారియర్స్ 39–34తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. బెంగాల్ తరఫున నబీబ„Š (10 పాయింట్లు), సుకేశ్ హెగ్డే (8 పాయింట్లు), ట్యాక్లింగ్‌లో జీవన్ (4 పాయింట్లు) ప్రదర్శన జట్టుకు టైటిల్‌ను ఖాయం చేసింది. సీజన్ మొత్తం అద్భుతంగా రాణిస్తూ వచ్చిన ఢిల్లీ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. ఆరంభంలో అద్భుతంగా ఆడి 11–3తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఇక్కడి నుంచి అనూహ్యంగా గాడి తప్పిన ఆ జట్టు మళ్లీ కోలుకోలేకపోయింది. బెంగాల్ స్టార్ రైడర్ మణీందర్ సింగ్ గాయం కారణంగా ఫైనల్ బరిలో దిగలేదు. దీంతో రైడింగ్ భారాన్ని సుకేశ్, నబీబ„Š మోశారు. తొలుత తడబడి పుంజుకున్న వీరు ప్రత్యరి్థని ఆలౌట్‌చేసి విరామానికి స్కోర్‌ను 17–17తో సమం చేశారు. రెండో అర్ధభాగంలో మరింతగా చెలరేగిన బెంగాల్ ప్రత్యరి్థని మరో రెండు సార్లు ఆలౌట్ చేసి కబడ్డీ కింగ్‌గా నిలిచింది. విజేత బెంగాల్ వారియర్స్ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఎవరో కొత్త విజేత?
అహ్మదాబాద్: 13 వారాల పాటు 13 నగరాల్లో వందకు పైగా మ్యాచ్‌లతో సాగిన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తుది ఘట్టానికి చేరింది. టోర్నీ మొత్తం అదరగొట్టి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన దబంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్‌లే తుది పోరుకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య నేడు జరిగే ఫైనల్‌తో ప్రొ కబడ్డీ లీగ్‌లో సరికొత్త చాంపియన్ అవతరించనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సత్తా చాటి తొలిసారి ట్రోఫీని ముద్దాడడానికి రెండు జట్లూ పూర్తిగా సంసిద్ధమయ్యాయి. నవీన్ కుమార్ గీ మణీందర్ సింగ్ ఈ సీజన్ మొత్తం రైడింగ్‌లో అదరగొట్టిన రైడర్ నవీన్ కుమార్ ఢిల్లీ జట్టుకు వెన్నెముకగా నిలుస్తూ వచ్చాడు. దాదాపు ప్రతీ మ్యాచ్‌లో సూపర్ ‘టెన్’తో చెలరేగిన అతడు జట్టును పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిపాడు. సెమీస్‌లో కూడా 15 పాయింట్లతో చెలరేగిన అతను జట్టును ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు మరోసారి చెలరేగితే ఢిల్లీ టైటిల్ గెలవడం ఖాయం.గాయం కారణంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన బెంగాల్ కెప్టెన్, స్టార్ రైడర్ మణీందర్ సింగ్ ఫైనల్‌కి సిద్ధమయ్యాడు. నేడు జరిగే మ్యాచ్‌లో సత్తా చాటి జట్టుకు టైటిల్‌ని అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇక డిఫెన్స్‌లోనూ రెండు జట్లూ సమానంగా ఉన్నాయి. ఢిల్లీ తరఫున రవీందర్ పహల్, బెంగాల్ తరఫున బల్దేవ్ సింగ్‌లు ప్రత్యర్థి రైడర్లను ఒక పట్టు పట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అన్ని విభాగాల్లోనూ కాస్త ఆధిక్యంలో ఉన్న ఢిల్లీ జట్టుకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
ఫైనల్లో ఢిల్లీ, బెంగాల్
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్లో దబంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ ఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీ జట్టు 44–38తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్‌కు షాకిచి్చంది. ఈ మ్యాచ్‌లో దబంగ్ టీమ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. రైడర్లలో నవీన్ 15, చంద్రన్ రంజీత్ 9 పాయింట్లు సాధించారు. డిఫెండర్ అనిల్ 4 పాయింట్లు చేశాడు. మిగతావారిలో విజయ్, రవీందర్, జోగిందర్ తలా 3 పాయింట్లు తెచ్చిపెట్టారు. బెంగళూరు జట్టు తరఫున పవన్ షెరావత్ (18) చక్కని పోరాటపటిమ కనబరిచాడు. రెండో సెమీస్‌లో బెంగాల్ వారియర్స్ 37–35తో యు ముంబాపై నెగ్గింది. వారియర్స్ తరఫున సుకేశ్ (8), నబీబ„Š (5), ప్రపంజన్ (4) రాణించారు. యు ముంబా జట్టులో అభిõÙక్ 11 పాయింట్లు సాధించాడు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం శనివారం ఢిల్లీ, బెంగాల్ జట్ల మధ్య ఇక్కడే టైటిల్ పోరు జరగనుంది. -
ప్రదీప్ ప్రతాపం
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో పట్నా పైరేట్స్ రైడర్ ప్రదీప్ నర్వాల్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 36 పాయింట్లు సాధించాడు. దీంతో పట్నా 69–41తో బెంగాల్ వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. అతడికి జాంగ్ కున్ లీ (8 పాయింట్లు), ట్యాక్లింగ్‌లో నీరజ్ కుమార్ (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు. ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్‌కు వెళ్లిన ప్రదీప్... ఏకంగా ఆరుగురిని ఔట్ చేసి రైడింగ్‌లో తనకు ఎదురులేదని చాటాడు. ఈ మ్యాచ్‌లో పట్నా ప్రత్యరి్థని నాలుగు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. బెంగాల్ తరఫున సౌరభ్ (11 పాయింట్లు), రాకేశ్ (10 పాయిం ట్లు) ఆకట్టుకున్నారు. ఈ సీజన్లో 300 పాయింట్ల మార్కును అందుకున్న రెండో రైడర్‌గా ప్రదీప్ (304 పాయింట్లు) నిలిచాడు. బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ 309 పాయింట్లతో ముందున్నాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 43–39తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో తెలుగు టైటాన్స్; తమిళ్ తలైవాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
టైటాన్స్ పదో పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్లో తెలుగు టైటాన్స్ పదో పరాజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 39–40తో బెంగాల్ వారియర్స్ చేతిలో పోరాడి ఓడింది. టైటాన్స్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా ట్యాక్లింగ్‌లో సారథి అ»ొజర్ మోహజెర్ మిఘాని ‘హై–ఫై’ (5 పాయింట్లు)తో చెలరేగినా అది జట్టుకు విజయం అందించలేదు. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్‌గా నిలిచాడు. తాజా విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెంగాల్... టైటాన్స్‌ను 15వ నిమిషంలో ఆలౌట్ చేసింది. మొదటి భాగాన్ని 19–13తో ముగించింది. రెండో భాగంలో జోరు పెంచిన టైటాన్స్ ప్రత్యరి్థని ఆలౌట్ చేసింది. ఈ సమయంలో బెంగాల్‌ను రైడింగ్‌తో ఆదుకున్న మణీందర్ గెలుపు ఖాయం చేశాడు. తాజా ఓటమితో టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 43–34తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా సూపర్ ‘టెన్’ (12 పాయింట్లు)తో రాణించాడు. నేటి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడుతుంది.