పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. బెంగాల్ వారియర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28-32 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ జట్టులో సుకేశ్ ఆరు పాయింట్లు, ధర్మరాజ్ ఎనిమిది పాయింట్లు సాధించినా... కెప్టెన్ రాహుల్ చౌదరీ మరోసారి విఫలమవ్వడం ఆ జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపింది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 34-28తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ముంబా జట్టుకిది ఏడో విజయంకాగా... పట్నా జట్టుకు రెండో పరాజయం. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్; పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి.