ప్రొ కబడ్డీ లీగ్
పుణే: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పదో విజయంతో నాలుగో స్థానానికి ఎగబాకింది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 34–32తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. తెలుగు కెపె్టన్ విజయ్ మాలిక్ 19 సార్లు కూతకెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు.
మిగతా వారిలో ఆశిష్ నర్వాల్ (9) రాణించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ (14), మన్‌జీత్ (7) అదరగొట్టారు. దీంతో ఇరుజట్ల మధ్య ఆఖరిదాకా హోరాహోరీ సమరం జరిగింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 36–33తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. యూపీ రెయిడర్ గగన్ గౌడ (15) చెలరేగాడు.
17 సార్లు కూతకెళ్లిన గగన్ క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో భవాని రాజ్‌పుత్ (6) రాణించగా, కెప్టెన్ సుమిత్ 3, అశు సింగ్, మహేందర్, హితేశ్ తలా 2 పాయింట్లు చేశారు. పల్టన్ జట్టులో పంకజ్ మోహితే (11), మోహిత్ గోయత్ (7) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్... యూ ముంబాతో గుజరాత్ జెయంట్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment