తలైవాస్‌ మళ్లీ ఓడింది | Sakshi
Sakshi News home page

తలైవాస్‌ మళ్లీ ఓడింది

Published Mon, Sep 4 2017 1:27 AM

తలైవాస్‌ మళ్లీ ఓడింది

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈ ఏడాది ప్రవేశించిన సచిన్‌ జట్టు తమిళ్‌ తలైవాస్‌ నిరాశజనక ప్రదర్శనను కొనసాగిస్తుంది. జోన్‌ ‘బి’లో ఆదివారం జరిగిన పోరులో తలైవాస్‌ 25–29 స్కోరుతో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో పరాజయం చవిచూసింది. లీగ్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన తమిళ్‌ తలైవాస్‌కు ఇది ఆరో ఓటమి కాగా... ఒకే ఒక్క మ్యాచ్‌లో నెగ్గింది. మరోవైపు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగాల్‌ వారియర్స్‌ ఆరో విజయాన్ని సాధించింది. రైడింగ్‌లో మణిందర్‌ సింగ్‌ (6) రాణించగా, డిఫెండర్‌ సుర్జీత్‌ సింగ్‌ టాకిల్‌లో 4 పాయింట్లు చేశాడు.

జాంగ్‌ కున్‌ లీ 4, వినోద్‌ కుమార్, రాన్‌ సింగ్‌ చెరో 3 పాయింట్లు సాధించారు. తలైవాస్‌ జట్టు తరఫున అమిత్‌ హుడా 4, ప్రపంజన్, దర్శన్, అజయ్‌ ఠాకూర్‌ తలా 3 పాయింట్లు చేశారు. అంతకుముందు జరిగిన పోరులో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 31–25తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌పై గెలుపొందింది. సోమవారం విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్‌తో జైపూర్‌ పింక్‌పాంథర్స్, బెంగాల్‌ వారియర్స్‌తో హర్యానా స్టీలర్స్‌ తలపడతాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement