
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో బెంగాల్ వారియర్స్ రెండో విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 48–38 పాయింట్ల తేడాతో గెలిచింది. కెపె్టన్ మణీందర్ సింగ్ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేసి వారియర్స్ విక్టరీలో కీలకపాత్ర పోషించాడు. తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ 13 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 35–33తో దబంగ్ ఢిల్లీ జట్టును ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment