
ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ ఆరో విజయం సాధించింది. బుధవారం న్యూఢిల్లీలో హరియాణా స్టీలర్స్ 35–33తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చి చివరకు హరియాణా స్టీలర్స్ గెలుపొందింది. స్టీలర్స్ తరఫున మోనూ 12 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 32–31తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధాతో హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment