
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం మూడు మ్యాచ్‌లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది.
పట్నాతో మ్యాచ్‌లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్‌దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్‌తో మ్యాచ్‌లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment