
అహ్మదాబాద్: సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ దుమ్మురేపింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 35–23తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన ఫార్చూన్ జెయింట్స్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 19–14తో నిలిచింది. రెండో సగంలోనూ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ సునాయాస విజయం సొంతం చేసుకుంది.
గుజరాత్ తరఫున ప్రపంజన్ 9, అజయ్ 6 పాయింట్లు సాధించారు. బెంగాల్ తరఫున మణిందర్ 6, జాంగ్ కున్ లీ 5 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 45–28తో యూపీ యోధాపై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పుణేరీ పల్టన్‌తో బెంగాల్ వారియర్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment