pro kabaddi legue
-
తెలుగు టైటాన్స్ ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. బెంగాల్ వారియర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 25–45 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున వినయ్ ఎనిమిది పాయింట్లు, మోనూ గోయట్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ జట్టులో రెయిడర్లు మణీందర్ సింగ్ 11 పాయింట్లు, దీపక్ హుడా 11 పాయింట్లు, శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 41–39తో పుణేరి పల్టన్‌పై, జైపూర్ పింక్ పాంథర్స్ 35–30తో పట్నా పైరేట్స్‌పై నెగ్గాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో యు ముంబా; గుజరాత్ జెయింట్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. చదవండి: Women's Asia Cup 2022: మరో విజయమే లక్ష్యంగా... థాయ్‌లాండ్‌తో భారత్ ఢీ -
Pro Kabaddi League 9: కూతకు వేళాయె!
బెంగళూరు: ఎనిమిది సీజన్లుగా అలరిస్తున్న కబడ్డీ మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులో నేడు ఈ టోర్నీ ప్రారంభం కానుంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్, పుణే నగరాల్లో అన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో టీవీలకే పరిమితమైన అభిమానులు ఈ సారి నేరుగా ఆటను ఆస్వాదించడం అవకాశం నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఈ మూడు వేదికల్లోనూ ఫ్యాన్స్‌ను అనుమతించనున్నారు. మొత్తం 12 జట్లు లీగ్ బరిలోకి దిగుతున్నాయి. లీగ్‌లో భాగంగా మొత్తం 66 మ్యాచ్‌లు జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి పోరులో యు ముంబాతో డిఫెండింగ్ చాంపియన్ దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. జాతీయ క్రీడల్లో కబడ్డీ ఈవెంట్ ముగిసిన వారం రోజుల్లోపే అందరూ ఆటగాళ్లు లీగ్‌కు సిద్ధమై బరిలోకి దిగుతున్నారు. రాహుల్ రెడీ లీగ్ వేలంలో రూ. 2.26 కోట్ల విలువ పలికిన పవన్‌కుమార్ సెహ్రావత్ (తమిళ్ తలైవాస్)పై అందరి దృష్టీ నిలిచి ఉంది. గత సీజన్లో పునేరీ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన స్టార్ రాహుల్ చౌదరి గాయంనుంచి కోలుకొని ఈ సారి జైపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది సీజన్లలో పట్నా పైరేట్స్ 3 సార్లు విజేతగా నిలవగా...బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. టైటాన్స్ రాత మారేనా! ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్లలో తెలుగు టైటాన్స్ ఒకటి. ఎనిమిది సీజన్లు కలిపి 148 మ్యాచ్‌లలో 52 గెలిచిన టైటాన్స్, అంతకంటే ఎక్కువ పరాజయాలు (77) నమోదు చేసింది. అయితే ఇతర జట్లకంటే ఎక్కువ ‘డ్రా’లు (19) కూడా టైటాన్స్ ఖాతాలో ఉన్నాయి. వీటిని విజయాలుగా మలచుకోగలిగితే కథ వేరేగా ఉండేదేమో. టైటాన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో ఏడో సీజన్లో 11వ, ఎనిమిదో సీజన్లో 12వ స్థానాల్లో నిలిచింది. అయితే ఈ సారి జట్టు కాస్త మెరుగ్గా, సమతూకంగా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో ఆకట్టుకున్న రైడర్ అభిషేక్ సింగ్‌ను తీసుకోగా, మనూ గోయత్, సిద్ధార్థ్ దేశాయ్ మళ్లీ జట్టులోకి వచ్చారు. అంకిత్ బెనివాల్, రజనీశ్, డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్ జట్టుకు కీలకం కానున్నారు. వెంకటేశ్ గౌడ్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. నేడు తమ తొలి పోరులో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
ప్రో కబడ్డీ వేలం: ఐపీఎల్ రేంజ్లో ధర పలికిన ప్లేయర్స్.. రికార్డులు బ్రేక్
Pro Kabaddi.. దేశంలో క్రికెట్‌తో పాటుగా కబడ్డీకి సైతం క్రేజ్ ఉంది. ఇండియాలో ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీకి(Pro Kabbadi)కి కూడా ఎంతో ఆదరణ కనిపించింది. కబడ్డి ఫ్యాన్స్‌ను అలరిస్తూ ప్రో కబడ్డీ ఇప్పటికి 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రో కబడ్డీ 9వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. అయితే, 9వ సీజన్‌కు ముందు ప్రో కబడ్డీకి భారీ వేలం జరిగింది. ముంబై వేదికగా రెండు రోజులపాటు(ఆగస్టు5, 6 తేదీల్లో) జరిగిన మెగా వేలంలో కబడ్డీ స్టార్ ప్లేయర్స్ ఊహించని ధర పలికారు. వేలంలో రికార్డు ధరకు ప్లేయర్స్‌ను ప్రాంచైజీలు దక్కించుకున్నాయి. మొత్తంగా 12 టీమ్స్ 500 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయడానికి పోటీపడ్డాయి. It's the Hi-Flyer's 🌏 and we're just living in it 🤷♂️ Pawan Sehrawat shatters the #vivoPKLPlayerAuction records to emerge as the most expensive buy in the history of #vivoProKabaddi 🤯@tamilthalaivas can now breathe easy like all of us, eh? 👀 pic.twitter.com/Ej2PtKPqFv — ProKabaddi (@ProKabaddi) August 5, 2022 కాగా, ఈ మెగా వేలంలో రికార్డు స్థాయిలో పవన్ షెరావత్‌ను రూ.2.65కోట్లకు తమిళ్ తలైవాస్ దక్కించుకోగా.. వికాస్ ఖండోలాను రూ.1.70కోట్లకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. ఇక, ఫజల్ అట్రాసలిని పూణేరి పల్టన్స్.. రూ. 1. 38కోట్లకు దక్కించుకుంది. గుమాన్ సింగ్‌ను రూ. 1.21కోట్లకు యు ముంబా కొనుగోలు చేసింది. మరోవైపు.. ప్రొ కబడ్డీలో రికార్డు బ్రేకర్‌గా పేరొందిన ప్రదీప్ నర్వాల్‌ను రూ.90 లక్షలకు యూపీ యోధా ఎఫ్‌బీఎంలో దక్కించుకుంది. ప్రొ కబడ్డీ చరిత్రలోనే పవన్ షెరావత్.. భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఇక హర్యానా స్టీలర్ రూ.65.10లక్షలకు అమీర్ హొసైన్‌ను, రవికుమార్‌ను రూ.64.10లక్షలకు(దబాంగ్ ఢిల్లీ), నీరజ్ నర్వాల్‌ను బెంగళూరు బుల్స్ రూ.43లక్షలకు కొనుగోలు చేసుకున్నాయి. ನಮ್ಮ ಗೂಳಿ ಪಡೆ 😍 How's that squad looking, #BullsSene? ⚡#FullChargeMaadi #BengaluruBulls #vivoPKLPlayerAuctions pic.twitter.com/oDyrX89itc — Bengaluru Bulls (@BengaluruBulls) August 6, 2022 Ala re ala! We welcome the Sultan to Pune! 🦁 . .#PuneriPaltan #Bhaaripaltan #Gheuntak #vivoPKLPlayersAuction #BhaariAuction pic.twitter.com/CqgL2limse — Puneri Paltan (@PuneriPaltan) August 5, 2022 ఇక, తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే.. రజనీష్, అంకిత్ బెనివల్ను రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా అభిషేక్ సింగ్, మోను గోయల్,పర్వేష్ భైంస్వాల్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, సిద్దార్ధ్ దేశాయ్‌ను కొనుగోలు చేశారు. కాగా, రాహుల్ చౌదరిని కనీస ధర రూ.10లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. దబాంగ్ ఢిల్లీ నవీన్ కుమార్, విజయ్ను రీటైన్ చేసుకుంది. Our first buy of the day Parvesh Bhainswal will be the part of #Titansquad#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/uYFjkcC4jo — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Abhishek Singh is set to expand the strength of the #Titansquad in season-9. How excited are you ?#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/gvJRfJaIkD — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Pesh hai aapke #PKL2022 #GujaratGiants squad! 💪#Giant family, how do you feel about the team? 🤩#GarjegaGujarat #Adani #vivoProKabaddi #vivoPKLPlayerAuction pic.twitter.com/UCyjmZSGdX — Gujarat Giants (@GujaratGiants) August 6, 2022 ఇది కూడా చదవండి: సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. -
తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను తెలుగు టైటాన్స్ జట్టు 32–32 స్కోరుతో ‘టై’ చేసుకుంది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది నాలుగో ‘టై’ కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున అంకిత్ తొమ్మిది పాయింట్లు, రజనీశ్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ తరఫున మణీందర్ అత్యధికంగా 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–31తో గుజరాత్ జెయింట్స్ జట్టును ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో పట్నా పైరేట్స్ తలపడతాయి. చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..! -
పవన్ ఒంటరి పోరాటం వృథా
ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌కు ఆరో పరాజయం ఎదురైంది. బెంగళూరులో బుధవారం యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 34–45తో ఓడిపోయింది. గత ఐదు మ్యాచ్‌ల్లో బెంగళూరుకిది నాలుగో ఓటమి. బెంగళూరు కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ముంబా జట్టులో అభిషేక్ సింగ్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. -
హరియాణా స్టీలర్స్‌ను గెలిపించిన వికాశ్..
ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు ఐదో విజయం నమోదు చేసింది. దబంగ్ ఢిల్లీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 36–33తో గెలుపొందింది. హరియాణా తరఫున రెయిడర్ వికాశ్ కండోలా అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.మరో మ్యాచ్‌లో యూపీ యోధ 40–36తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో పుణేరి పల్టన్; యు ముంబాతో తెలుగు టైటాన్స్; జైపూర్ పింక్ పాంథర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. చదవండి: హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కి బంఫర్ ఆఫర్.. ప్రపంచకప్ జట్టులో చోటు! -
బెంగాల్ వారియర్స్‌కు మరో ఓటమి..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 39–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ జట్టుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. పుణేరి పల్టన్ రెయిడర్ ఇనామ్దార్ 17 పాయింట్లు స్కోరు చేశాడు. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 13 పాయింట్లతో ఆకట్టుకున్నా అతనికి ఇతర సభ్యుల నుంచి సహకారం లభించలేదు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 42–27తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. యూపీ యోధ రెయిడర్ శ్రీకాంత్ జాదవ్ 15 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్; జైపూర్ పింక్‌పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. చదవండి: IPL- 2022: ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! -
PKL 2021: తెలుగు టైటాన్స్‌కు ఐదో ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 38–48తో ఓడిపోయింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఐదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున గల్లా రాజు ఎనిమిది పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 37–33తో యూపీ యోధపై, పట్నా పైరేట్స్ 27–26తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్; బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధ తలపడతాయి. చదవండి: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా! -
ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు జోరు.. జైపూర్ పై గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన పోరులో బుల్స్ 38–31తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరుకు ఇది ఐదో విజయం. బుల్స్ తరఫున కెప్టెన్ పవన్ షెరావత్ (18 పాయింట్లు) రాణించాడు. జైపూర్ జట్టులో అర్జున్ 13 పాయింట్లు చేశాడు. పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 30–30 స్కోరుతో టై అయ్యింది. నేడు జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్... ఇక ఆ సిరీస్ కూడా కష్టమే! -
జైపూర్పై యు ముంబా గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 37–28తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై నెగ్గింది. యు ముంబా తరఫున అజిత్ కుమార్ 11 పాయింట్లు, జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 42–28తో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. పవన్ కుమార్ 22 పాయింట్లతో మెరిశాడు. విజేతలు మాల్విక, మిథున్ సాక్షి, హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిథున్ మంజునాథ్, మాల్విక బన్సొద్ విజేతలుగా నిలిచారు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో గురువారం ముగిసిన టోర్నీలో రెండో సీడ్ మాల్విక మహిళల సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకోగా, పురుషుల టైటిల్‌ను ఎనిమిదో సీడ్ మిథున్ దక్కించుకున్నాడు. ఫైనల్లో మాల్విక 21–15, 21–9తో టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్‌కు షాకిచ్చింది. మిథున్ 21–15, 21–4తో ఆదిత్య జోషిపై గెలుపొందాడు. మహిళల డబుల్స్ తుది పోరులో సిమ్రన్ సింగ్–ఖుషీ గుప్తా జోడీ 21–16, 21–13తో తెలంగాణకు చెందిన వెన్నెల–శ్రియాన్షి వాలిశెట్టి జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో రవికృష్ణ–శంకర్ ప్రసాద్ ద్వయం 21–9, 21–12తో కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్–సంజన సంతోష్ జోడి విజేతగా నిలిచింది. విజేతలకు టాప్ షట్లర్ సైనా నెహ్వాల్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ బహుమతులు అందజేశారు. చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
యూపీ, గుజరాత్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. బుధవారం యూపీ యోధ, గుజరాత్ జెయింట్స్ హోరాహోరీగా తలపడగా, 32–32 స్కోరుతో మ్యాచ్ సమమైంది. యూపీ తరఫున పర్దీప్ నర్వాల్ 11 పాయింట్లతో సత్తా చాటగా...గుజరాత్ ఆటగాళ్లలో రాకేశ్ నర్వాల్ 13 పాయింట్లతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 52–35 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. నవీన్ కుమార్ అద్భుత ప్రదర్శన ఢిల్లీని గెలిపించింది. అతనొక్కడే 24 పాయింట్లతో దూసుకుపోవడం విశేషం. బెంగాల్ ఆటగాళ్లలో కెప్టెన్ మణీందర్ సింగ్ 16 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌లలో జైపూర్‌తో యు ముంబా, హర్యానాతో బెంగళూరు తలపడతాయి. చదవండి: ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్‌గా కుల్ధీప్ యాదవ్.. -
తమిళ్ తలైవాస్, యు ముంబా మ్యాచ్ టై
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మూడో ‘టై’ నమోదైంది. తమిళ్ తలైవాస్, యు ముంబా జట్ల మధ్య సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ 30–30 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యు ముంబా తరఫున వి.అజిత్ కుమార్ 15 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు ఖాతాలో ఇది రెండో ‘టై’ కావడం గమనార్హం. లీగ్ తొలి రోజు తెలుగు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను తమిళ్ తలైవాస్ 40–40తో ‘టై’ చేసు కుంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 32–29తో యూపీ యోధపై నెగ్గింది. నేడు పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్; తెలుగు టైటాన్స్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. చదవండి: Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే.. -
ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ బోణీ.. 16 పాయింట్లతో మెరిసిన నవీన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబంగ్ ఢిల్లీ జట్టు బోణీ కొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 41–30 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్‌ను ఓడించింది. ఢిల్లీ రెయిడర్ నవీన్ కుమార్ ఏకంగా 16 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 24 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన నవీన్ 14 సార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. మ్యాచ్‌లో కనీసం 10 పాయింట్లు స్కోరు చేయడం పీకేఎల్‌లో నవీన్‌కిది వరుసగా 22వ సారి కావడం విశేషం. ఢిల్లీ ఆల్‌రౌండర్లు విజయ్ తొమ్మిది పాయింట్లు, సందీప్ నర్వాల్ మూడు పాయింట్లు స్కోరు చేశారు. పుణేరి పల్టన్ తరఫున కెప్టెన్ నితిన్ తోమర్ ఏడు పాయింట్లు, రాహుల్ చౌదరీ ఐదు పాయింట్లు సాధించారు. గురువారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్ 42–39తో హరియాణా స్టీలర్స్‌పై, గుజరాత్ జెయింట్స్ 34–27తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించాయి. చదవండి: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. దుమ్మురేపిన హర్నర్, యశ్దల్ -
ఫైనల్లో ఢిల్లీ, బెంగాల్
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్లో దబంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ ఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీ జట్టు 44–38తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్‌కు షాకిచి్చంది. ఈ మ్యాచ్‌లో దబంగ్ టీమ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. రైడర్లలో నవీన్ 15, చంద్రన్ రంజీత్ 9 పాయింట్లు సాధించారు. డిఫెండర్ అనిల్ 4 పాయింట్లు చేశాడు. మిగతావారిలో విజయ్, రవీందర్, జోగిందర్ తలా 3 పాయింట్లు తెచ్చిపెట్టారు. బెంగళూరు జట్టు తరఫున పవన్ షెరావత్ (18) చక్కని పోరాటపటిమ కనబరిచాడు. రెండో సెమీస్‌లో బెంగాల్ వారియర్స్ 37–35తో యు ముంబాపై నెగ్గింది. వారియర్స్ తరఫున సుకేశ్ (8), నబీబ„Š (5), ప్రపంజన్ (4) రాణించారు. యు ముంబా జట్టులో అభిõÙక్ 11 పాయింట్లు సాధించాడు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం శనివారం ఢిల్లీ, బెంగాల్ జట్ల మధ్య ఇక్కడే టైటిల్ పోరు జరగనుంది. -
ప్లే ఆఫ్స్ నుంచి పుణే ఔట్
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి పుణేరి పల్టన్ నిష్క్రమించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 60–40తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. దబంగ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ మరో సూపర్ ‘టెన్’ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. 22 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతడు 19 పాయింట్లు సాధించాడు. చంద్రన్ రంజిత్ 12 పాయింట్లతో విజయంలో తన వంతు పాత్ర పోషించగా... ట్యాక్లింగ్‌లో రవీందర్ పహల్ ‘హై–ఫై’ (6 పాయింట్ల)తో ప్రత్యరి్థని పట్టేశాడు. పుణే తరఫున నితిన్ తోమర్ (7 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 38–37తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై నెగ్గింది. -
తలైవాస్ చిత్తు
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తమిళ్ తలైవాస్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔటైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో 50–21తో చిత్తుగా ఓడింది. గుజరాత్ రైడర్ సోను 15 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో హై–ఫై (5) సాధించిన పర్వేశ్ చక్కని సహకారం అందించాడు. మ్యాచ్‌లో గుజరాత్ ప్రత్యర్థిని మూడు సార్లు ఆలౌట్ చేసింది. తలైవాస్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (5) నిరాశ పరిచాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 30–37తో యూపీ యోధ చేతిలో ఓడింది. యూపీ తరఫున శ్రీకాంత్ జాధవ్ సూపర్ ‘టెన్’ (11 పాయింట్లు) చెలరేగాడు. నితేశ్ కుమార్, సురేందర్ గిల్ చెరో ఏడు పాయింట్లతో రాణించారు. నేటి మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
ప్లే ఆఫ్స్‌కు దబంగ్ ఢిల్లీ
జైపూర్: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్ ప్లేఆఫ్స్‌కు దబంగ్ ఢిల్లీ అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 43–39తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ (19 పాయింట్లు) పోరాటం మరో సారి వృథాగా మిగిలింది. ఢిల్లీ రైడర్లు విజయ్ (13 పాయింట్లు), నవీన్ కుమార్ (11 పాయింట్లు) జట్టుకు విజయం అందించారు. ఇరు జట్ల రైడర్లు సమానంగా పాయింట్లు తీసుకురావడంతో తొలి అర్ధభాగం 13–13తో ముగిసింది. రెండో అర్ధభాగంలో తొలి రైడ్‌కు వెళ్లిన ప్రదీప్ నర్వాల్‌ను ఢిల్లీ సూపర్ ట్యాకిల్ చేసింది ఆ వెంటనే ఢిల్లీకి కౌంటర్ ఇస్తూ జాంగ్ కున్ లీ రెండు పాయింట్ల రైడ్ చేయడంతో మరోసారి స్కోర్ 15–15తో సమం అయింది. 28వ నిమిషంలో ప్రదీప్ సూపర్ రైడ్ చేయడంతో పట్నా 25–20తో ఆధిక్యంలోకెళ్లింది. ఈ దశలో ఢిల్లీని నవీన్ కుమార్, విజయ్‌లు ఆదుకున్నారు. ఆట మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా విజయ్ సూపర్ రైడ్‌తో ఢిల్లీకి నాలుగు పాయింట్లు సాధించి పెట్టాడు. ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించిన ఢిల్లీ విజేతగా నిలిచింది. -
టైటాన్స్ పదో పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్లో తెలుగు టైటాన్స్ పదో పరాజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 39–40తో బెంగాల్ వారియర్స్ చేతిలో పోరాడి ఓడింది. టైటాన్స్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా ట్యాక్లింగ్‌లో సారథి అ»ొజర్ మోహజెర్ మిఘాని ‘హై–ఫై’ (5 పాయింట్లు)తో చెలరేగినా అది జట్టుకు విజయం అందించలేదు. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్‌గా నిలిచాడు. తాజా విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెంగాల్... టైటాన్స్‌ను 15వ నిమిషంలో ఆలౌట్ చేసింది. మొదటి భాగాన్ని 19–13తో ముగించింది. రెండో భాగంలో జోరు పెంచిన టైటాన్స్ ప్రత్యరి్థని ఆలౌట్ చేసింది. ఈ సమయంలో బెంగాల్‌ను రైడింగ్‌తో ఆదుకున్న మణీందర్ గెలుపు ఖాయం చేశాడు. తాజా ఓటమితో టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 43–34తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా సూపర్ ‘టెన్’ (12 పాయింట్లు)తో రాణించాడు. నేటి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. -
పట్నా, బెంగాల్ విజయం
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన జైపూర్ పింక్ పాంథర్స్ అపజయాల బాటలో పయనిస్తుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36–33తో జైపూర్‌ను చిత్తు చేసింది. స్టార్ రైడర్ దీపక్ హుడా (5 పాయింట్లు) నిరాశపరిచాడు. పట్నా తరఫున ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో చెలరేగగా... జాన్ కున్ లీ (8 పాయింట్లు) అతనికి చక్కని సహకారం అందించాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 42–40తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. -
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ గెలుపు
చెన్నై: డబుల్ హ్యాట్రిక్ ఓటములకు గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఫుల్స్టాప్ పెట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 29–26తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. రోహిత్ గులియా సూపర్ ‘టెన్’తో చెలరేగాడు. 10–3తో వెనుకబడి ఉన్న గుజరాత్‌ను తన రైడింగ్ నైపుణ్యంతో రోహిత్ గెలిపించాడు. పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ తన డుబ్కీ రైడ్‌తో సాధించిన ‘సూపర్ రైడ్’ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా జట్టు 29–24తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. మొదటి అర్ధభాగంలో వెనుకంజ వేసినా రెండో అర్ధ భాగంలో పుంజుకున్న ముంబై ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరును చివరి వరకు కొనసాగించిన ముంబై విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆ జట్టు రైడర్ అతుల్ 7 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్... జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
సూపర్ సిద్ధార్థ్
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ సత్తా చాటాడు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న హరియాణా స్టీలర్స్‌ను తన రైడ్లతో మట్టికరిపించాడు. మ్యాచ్‌లో సూపర్ ‘టెన్’ (మొత్తం 16 పాయింట్లు)తో అదరగొట్టాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 40–29తో హరియాణా స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసిన టైటాన్స్ ఈ లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 30–30తో ‘డ్రా’గా ముగిసింది. సీజన్లో ఇది ఐదో ‘టై’ కావడం విశేషం. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్, రాహుల్ చౌదరిలు చెరో 8 పాయింట్లతో రాణించారు. నేటి మ్యాచ్‌ల్లో యుముంబాతో హరియాణా స్టీలర్స్; యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
పరాజయాల టైటాన్స్
పట్నా: ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ ఇప్పట్లో బోణీ కొట్టేలా కనిపించడం లేదు. గురువారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47–26తో ఓడిన టైటాన్స్ సీజన్లో మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 11 పాయింట్లతో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచినా... బుల్స్ రైడర్ పవన్ కుమార్ (17 పాయింట్లు) రైడింగ్ ముందు నిలబడలేకపోయాడు. దీంతో సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి, ఒక దాంట్లో ‘టై’తో సరిపెట్టుకున్న టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్‌తో యూపీ యోధ తలపడతాయి. -
వారియర్స్‌కు బుల్స్ దెబ్బ
పట్నా : ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్‌ను బెంగళూరు బుల్స్ దెబ్బ కొట్టింది. శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో బుల్స్ 43–42తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. బెంగళూరు తరఫున పవన్ కుమార్ ఏకంగా 29 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 21–34తో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. పాంథర్స్ రైడర్ దీపక్ నర్వాల్ 9 పాయింట్లతో మెరిశాడు. ఈ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన జైపూర్ జట్టు పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తమిళ్ తలైవాస్, పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
దబంగ్ ఢిల్లీకి కళ్లెం
ముంబై: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ కళ్లెం వేసింది. ముంబైలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 31–26తో ఢిల్లీని కంగుతినిపించింది. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం కీలక సమయంలో ఒత్తిడిని జయించిన ఫార్చూన్ జెయింట్స్నే వరించింది. దీంతో లీగ్‌లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన మోరే 9 పాయింట్ల(4 రైడ్ పాయింట్లు, 4 టాకిల్ పాయింట్లు, ఒక బోనస్ పాయింటు)తో గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. అతనికి రోహిత్ గులియా (8 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. దబంగ్ రైడర్ నవీన్ కుమార్ సూపర్ ‘టెన్’ సాధించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్; యు ముంబాతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ తలపడతాయి. -
జయహో... యు ముంబా
ముంబై: మొదటి అర్ధభాగంలో పోటీ ఇచ్చిన పుణేరి పల్టన్ తర్వాత చేతులెత్తేయడంతో యు ముంబా విజయాన్ని పట్టేసింది. దీంతో ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో రెండు మరాఠా జట్ల పోరులో తొలి విజయం ముంబైని వరించింది. శనివారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా 33–23తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. అభిషేక్ సింగ్ 5 రైడ్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యు ముంబా సారథి ఫజేల్ అత్రాచలి, రోహిత్, సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్‌లు చెరో 4 పాయింట్లతో రాణించా రు. పుణేరి తరఫున సుర్జీత్ సింగ్ 6 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ గీతం ఆలపించాడు. నెమ్మదిగా మొదలై.. ఆరంభంలో రెండు జట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్లు ఎక్కువగా రాలేదు. పుణే తరఫున తొలి కూతకు వెళ్లిన మంజీత్ రిక్తహస్తాలతో తిరిగొచ్చాడు. అనంతరం ముంబై తరఫున కూతకు వెళ్లిన లీ డాంగ్ జీన్‌ను పుణే పట్టేయడం అదే సమయంలో లీ బోనస్ లైన్‌ను దాటడంతో ఇరు జట్లు ఒకేసారి ఖాతా తెరిచాయి. 2–5తో యు ముంబా వెనుకంజలో ఉన్నప్పుడు ఫజేల్ అత్రాచలి మంజీత్‌ను సూపర్ టాకిల్ చేశాడు. ఆ వెంటనే అభిషేక్ ఒక రైడ్ పాయింట్ తీసుకురావడంతో స్కోరు 5–5తో సమమైంది. పుణే తరఫున సుర్జీత్ సింగ్ సూపర్ టాకిల్ చేయడం, ఆ వెంటనే రైడ్‌కు వెళ్లి సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్‌లను ఔట్ చేసి పుణేని 9–8తో ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే ఈ దశలో ముంబై చకచకా మూడు పాయింట్లు సాధించి 11–9తో విరామానికి వెళ్లింది. రెండో అర్ధభాగం ఆరంభమైన కాసేపటికే యు ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 15–10తో దూసుకెళ్లింది. ఇదే అధిక్యాన్ని చివరి వరకు కొనసాగించిన ముంబై జట్టు విజేతగా నిలిచింది. గట్టెక్కిన జైపూర్... మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 27–25తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. చివరి మూడు నిమిషాల్లో తడబడిన బెంగాల్ మూల్యం చెల్లించుకుంది. జైపూర్ డిఫెండర్ సందీప్ ధుల్ (8 టాకిల్ పాయింట్లు)తో బెంగాల్‌ను పట్టేశాడు. రైడర్ దీపక్ హుడా 6 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
టైటాన్స్ తెలుగు నేలపై చేతులెత్తేసింది..!
సాక్షి, హైదరాబాద్: తెలుగు టైటాన్స్ తెలుగు నేలపై చేతులెత్తేసింది. సొంతప్రేక్షకులు మద్దతిచ్చినా... అసలు బోణీనే కొట్టలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యింది. శుక్రవారం జరిగిన హైదరాబాద్ అంచె ఆఖరి పోరులో టైటాన్స్ 22–34 స్కోరుతో పట్నా పైరేట్స్ చేతిలో పరాజయం చవిచూసింది. కోటి ఆశల సిద్ధార్థ్ దేశాయ్ మళ్లీ నిరాశపరిచాడు. స్టార్ రైడర్‌గా బరిలోకి దిగిన దేశాయ్ 12 సార్లు రైడింగ్‌కు వెళ్లి కేవలం 5 పాయింట్లే తెచ్చాడు. ఒక టాకిల్ పాయింట్ సాధించాడు. డిఫెండర్లు అబొజర్ మిఘాని (2), విశాల్ భరద్వాజ్ (2)లు ప్రత్యర్థి రైడర్లను టాకిల్ చేయలేకపోయారు. దీంతో తెలుగు జట్టు భారీ తేడాతో ఓడిపోయింది. మరోవైపు పట్నా జట్టులో స్టార్ ఆటగాళ్లయిన ప్రదీప్ నర్వాల్, జైదీప్‌లు ఆరంభం నుంచే పట్టుబిగించారు. రైడింగ్‌లో నర్వాల్ 7 పాయింట్లు సాధించగా, డిఫెం డర్ జైదీప్ (6) టైటాన్స్ రైడర్లను చక్కగా ఒడిసిపట్టాడు. మిగతా ఆటగాళ్లలో జంగ్ కున్ లీ (4), నీరజ్ కుమార్ (3) ఆకట్టుకున్నారు. మొహమ్మద్ ఎస్మెల్, హాది ఒస్తరక్ చెరో 2 పాయింట్లు చేశారు. అంతకుముందు మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 44–19 స్కోరుతో యూపీ యోధపై ఘనవిజయం సాధించింది. గుజరాత్ తరఫున రైడింగ్‌లో రోహిత్ గులియా (10), డిఫెన్స్‌లో పర్వేశ్ బైస్వాల్ (6) రాణించారు. యూపీ జట్టులో రైడర్ శ్రీకాంత్ జాదవ్ (5) ఒక్కడే మెరుగనిపించాడు. నితీశ్ కుమార్, మోను గోయత్, ఆజాద్ రెండేసి పాయింట్లు చేశారు. అతిథిగా కోహ్లి నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ పోటీలు ముంబైలో జరుగుతాయి. శనివారం ఇక్కడ జరిగే ఆరంభ వేడుకకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అతిథిగా హాజరు కానున్నాడు. నేటి మ్యాచ్‌లు యు ముంబా X పుణేరి పల్టన్ రా.గం. 7.30 నుంచి జైపూర్ X బెంగాల్ వారియర్స్ రా.గం. 8.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్–2లో ప్రత్యక్షప్రసారం -
టైటిల్ వేటలో తెలుగు టైటాన్స్
కబడ్డీ... కబడ్డీ... అంటూ ఆరేళ్లుగా తెలుగు టైటాన్స్ ఆడుతోంది. కానీ టైటిల్ వేటలో కనీసం ఫైనల్ మెట్టయినా ఎక్కలేకపోయింది. ఈ సారైనా ఆ ముచ్చట తీర్చుకునేందుకు టైటాన్స్ కష్టపడుతోంది. జట్టులో మార్పులు కూడా చేసింది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌లతో జట్టు కూత పెట్టేందుకు సిద్ధమైంది. మరీ ఈ కూత ఎందాకో తెలియాలంటే మనం మూడు నెలలు ఆగాలి! ఎందుకంటే ఫైనల్ అక్టోబర్‌లో కదా జరిగేది!! సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్లో కసిదీరా ఆడేందుకు తెలుగు టైటాన్స్ సన్నద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ఆరంభమే హైదరాబాద్‌లో జరగనుండటంతో తొలి అంచె పోటీల్లో స్థిరమైన విజయాలు సాధించాలని ఆశిస్తోంది. ఆరేళ్లుగా టైటాన్స్ ఆశల పల్లకి మోసిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరి జట్టును వీడాడు. అతని స్థానంలో మరో స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ రాగా... సారథ్య బాధ్యతల్ని ఇరానీ డిఫెండర్ అబొజర్ మిఘానికి అప్పగించింది. చీఫ్ కోచ్‌గా ఇరాన్‌కు చెందిన గోలమ్ రెజాను నియమించింది. ఇలా జట్టుకు కొత్త దిశను చూపిన యాజమాన్యం తమ దశమారాలని గంపెడాశతో బరిలోకి దిగుతోంది. డిఫెండర్లపై విశ్వాసం ఈ సారి జట్టు కుర్రాళ్లపై నమ్మకముంచింది. దీంతో అనుభవజ్ఞులకంటే యువ ఆటగాళ్లే తొడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్, కెప్టెన్ అబొజర్ మిఘానిలు ఓ పట్టుపడితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. గత సీజన్లో విశాల్ చక్కగా రాణించాడు. 60 టాకిల్ పాయింట్లు సాధించిన అతడు సగటున మ్యాచ్‌కు మూడున్నర పాయింట్లు తెచ్చిపెట్టాడు. ఆరో సీజన్లో మూడో ఉత్తమ ప్రదర్శన అతనిదే. ఇక రైట్ కార్నర్లో మెరుగైన డిఫెండర్ అబొజర్. కీలక సమయంలో ప్రత్యర్థులను, పాయింట్లను ఒడిసి పట్టాడు. ఆరో సీజన్లో అతను విశాల్‌కు కాస్త తక్కువగా 57 పాయింట్లు సాధించాడు. 2.7 సగటు నమోదు చేశాడు. రైడర్ల పాలిట వీళ్లిద్దరు టైటాన్స్‌కు బ్రహ్మాస్త్రాలైతే తెలుగు జట్టుకు తిరుగుండదు. యు ముంబా మాజీ కోచ్ అయిన గొలమ్ రెజాను చీఫ్ కోచ్‌గా నియమించడం, కెప్టెన్ కూడా ఇరానీ ఆటగాడే కావడం... ఇద్దరి సమన్వయం జట్టుకు దోహదం చేసే అవకాశముంది. కలిసిరాని హైదరాబాద్ టైటాన్స్‌కు ఇప్పటివరకు సొంత మైదానం కలిసిరాలేదు. ఆరు సీజన్లలో మూడు వైజాగ్‌లో ఆడగా మరో మూడు ఇక్కడే ఆడింది. ఆడిన మూడు సీజన్లూ హైదరాబాదీ అభిమానుల్ని టైటాన్స్ నిరాశపరిచింది. ఓవరాల్‌గా 16 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ కేవలం ఐదే మ్యాచ్‌లు గెలిచింది. 9 మ్యాచ్‌లో ఓటమి ఎదురవగా... రెండు టైగా ముగిశాయి. ఈ సారైనా తమ తలరాత మారాలని జట్టు ఆశిస్తోంది. సెమీసే అత్యుత్తమం తెలుగు టైటాన్స్ 6 సీజన్లు పోరాడినా టైటిల్ వేటలో ఒక్కసారి కూడా నిలువలేకపోయింది. పీకేఎల్‌లో తెలుగు టీమ్ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనలే! రెండు, నాలుగో సీజన్లలో రెండు సార్లు సెమీస్ చేరింది. గత రెండు సీజన్లలోనూ పేలవమైన ప్రదర్శనతో జోన్ ‘బి’లో ఐదో స్థానంలో నిలిచింది. మొత్తమ్మీద ఈ ఆరేళ్లలో గెలిచిన మ్యాచ్లకంటే ఓడిన మ్యాచ్‌లే ఎక్కువ! 104 మ్యాచ్‌లాడిన టైటాన్స్ జట్టు 45 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... 47 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో 13 టైగా ముగిశాయి. తెలుగు టైటాన్స్ జట్టు అబొజర్ (కెప్టెన్), విశాల్, అరుణ్, కృష్ణ, మనీశ్, ఆకాశ్, ఆకాశ్ దత్తు (డిఫెండర్లు); సిద్ధార్థ్ దేశాయ్, అమిత్, అంకిత్, కమల్, ముల శివ, రజనీశ్, రాకేశ్, సూరజ్, మల్లికార్జున్, (రైడర్లు); అర్మాన్, ఫర్హాద్ మిలగర్దన్ (ఆల్‌రౌండర్లు). అందరి కళ్లు సిద్ధార్థ్పైనే సిద్ధార్థ్ దేశాయ్... ఒక్క సీజన్‌తో స్టార్ అయిన మహారాష్ట్ర ఆటగాడు. గతేడాది యు ముంబా తరఫున కూత పెట్టించాడు. సంచలన రైడింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. లీగ్‌లో గత సీజన్ మాత్రమే ఆడిన ఈ మహారాష్ట్ర కబడ్డీ ప్లేయర్‌పై తెలుగు టైటాన్స్ భారీ ఆశలే పెట్టుకుంది. అందుకనే ఏకంగా సుమారు రూ. కోటిన్నర (రూ.1.45 కోట్లు) వెచ్చించి మరీ అతన్ని కొనుక్కుంది. ప్రొ కబడ్డీ వేలంలోనే ఇది అత్యధిక మొత్తం కావడం విశేషం. రాహుల్ చౌదరి తరలిపోయిన లోటును దేశాయ్ సమర్థంగా భర్తీ చేయగలడనే విశ్వాసంతో టైటాన్స్ యాజమాన్యం ఎంత మొత్తానికైనా వెనుకాడలేదు. నిజంగా సిద్ధార్థ్‌కు అంత సీనుందా అంటే... గత సీజన్ ప్రదర్శన చూస్తే ఔననాల్సిందే. పీకేఎల్–6లో ఆడిన 21 మ్యాచ్‌ల్లో ఏకంగా 218 పాయింట్లు సాధించాడు. సగటున మ్యాచ్‌కు 10 పాయింట్లు తెచ్చిపెట్టిన రైడర్‌గా నిలిచాడు. అందుకే ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును ఎగరేసుకుపోయాడు. గత సీజన్లో కేవలం ముగ్గురు రైడర్లే ఈ ఘనత సాధించారు. ఇక ప్రస్తుత తెలుగు టైటాన్స్ రైడర్లంతా కలిపి చేసిన పాయింట్లు (69), సిద్ధార్థ్ ఒక్కడే చేసిన పాయింట్లకూ ఎంతో వ్యత్యాసముంది. అతని సగం పాయింట్లకు సరిపోని దూరంలో ఉన్నాయి. ఈ ఖరీదైన ఆటగాడు మంచి పాటగాడు (గాయకుడు) కూడా! అంతేనా... డ్యాన్సర్ కూడా. బరిలో కూత పెట్టడమే కాదు... మ్యాచ్‌లు గెలిస్తే ఆటపాటలతో హోరెత్తిస్తానంటున్నాడు సిద్ధార్థ్. -
నేడు ఆల్‌స్టార్స్ కబడ్డీ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ఈనెల 20న ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు ఓ ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధం చేశారు. జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుల మధ్య ఆల్‌స్టార్ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు మషాల్ స్పోర్ట్స్ పేర్కొంది. వరల్డ్–7, ఇండియన్–7 జట్ల మధ్య నేడు జరుగనున్న ఈ మ్యాచ్‌కు గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. వరల్డ్ జట్టుకు ఫజల్, భారత జట్టుకు అజయ్ ఠాకూర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. జట్ల వివరాలు ఇండియన్–7: మణీందర్, పవన్, రవీంద్ పహాల్, వికాస్, సునీల్, దీపక్ హుడా, పర్దీప్ నర్వాల్, గిరీశ్, సుర్జీత్, అజయ్ ఠాకూర్ (కెప్టెన్), సందీప్ నర్వాల్, నితీశ్, బల్వాన్ సింగ్ (కోచ్). వరల్డ్–7: ఇస్మాయిల్, లాల్మనోహర్, గఫారి, టిన్ పోన్చో, షాజిద్, డాంగ్ యు కిమ్, జాంగ్ కున్ లీ, ఎమాద్, అబోజర్, ఫర్హాద్, ఫజల్, మసూర్ కరీమ్, ఈపీ రావు (కోచ్). -
చాంప్ బెంగళూరు బుల్స్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో నయా చాంపియన్ అవతరించింది. గత ఐదు సీజన్లుగా ఊరిస్తూ వస్తున్న టైటిల్ ఎట్టకేలకు బెంగళూరు బుల్స్ ఒడిలో వాలింది. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చివరి క్షణాల్లో ఒత్తిడి తట్టుకోలేక చేతులెత్తేసింది. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన తుదిపోరులో బెంగళూరు 38–33తో గుజరాత్‌పై గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. విరామ సమయానికి 16–9తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న గుజరాత్ రెండో అర్ధభాగంలో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. బెంగళూరు కెప్టెన్ రోహిత్ (1 పాయింట్) ఘోరంగా విఫలమైనా... పవన్ షెరావత్ 22 పాయింట్లతో దుమ్మురే పాడు. జట్టును ఓటమి అంచుల్లో నుంచి విజయ శిఖరాలకు చేర్చాడు. జట్టులో 3 పాయింట్లే రెండో అత్యధికం అంటే... పవన్ ఏ స్థాయిలో విజృంభించాడో అర్థమవుతోంది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తరఫున సచిన్ కుమార్ 10, ప్రపంజన్, రోహిత్ గులియా చెరో 5 పాయింట్లు సాధించారు. విజేతకు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించగా... రన్నరప్ జట్టుకు రూ. 1.8 కోట్లు దక్కాయి. పీకేఎల్ ఏడో సీజన్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. -
ఫైనల్లో గుజరాత్
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన క్వాలిఫయర్–2లో గుజరాత్ 38–31తో యూపీ యోధాపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. ఒక దశలో మ్యాచ్‌పై యూపీ యోధ పైచేయి కనబర్చినా... తొలి అర్ధభాగం ముగిసే సమయానికి గుజరాత్ 19–14తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాతా రెండో సగంలో మరింత దూకుడు పెంచి 29–14తో ముందంజ వేసింది. చివర్లో తేరుకున్న యూపీ వరుస పాయిట్లతో బెంబేలెత్తించినా చివరకు 7 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. గుజరాత్ తరఫున సచిన్ 10 పాయింట్లతో మెరవగా... రోహిత్, ప్రపంజన్ చెరో 5 పాయింట్లు సాధించారు. యూపీ యోధా తరఫున శ్రీకాంత్ 7, నితేశ్ 6 పాయింట్లు సాధించారు. -
టైటిల్ పోరుకు బెంగళూరు
కొచ్చి: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేల్)లో బెంగళూరు బుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో బెంగళూరు 41–29 స్కోరుతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై విజయం సాధించింది. రైడింగ్‌లో బుల్స్ ఆటగాడు పవన్ షెరావత్ చెలరేగాడు. 13 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను 13 పాయింట్లు తెచ్చి పెట్టాడు. రోహిత్ కుమార్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అతను 11 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో మహేందర్ సింగ్ 6 ట్యాకిల్ పాయింట్లు చేశాడు. గుజరాత్ జట్టులో సచిన్ ఆకట్టుకున్నాడు. 12 సార్లు రైడింగ్‌కు వెళ్లిన సచిన్ 10 పాయింట్లు సాధించాడు. ఓడినా... గుజరాత్‌కు ఫైనల్ చేరే అవకాశం ఇంకా మిగిలే వుంది. ఈ నెల 3న యూపీ యోధతో జరిగే రెండో క్వాలిఫయర్‌లో గెలిస్తే ఆ జట్టు టైటిల్ పోరుకు అర్హత సంపాదించవచ్చు. ఎలిమినేటర్–3 మ్యాచ్‌లో యూపీ యోధ 45–33తో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత పొందింది. -
ఎలిమినేటర్–3కి యూపీ, ఢిల్లీ
కొచ్చి: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో యూపీ యోధ, దబంగ్ ఢిల్లీ జట్లు మూడో ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధిం చాయి. ఆదివారం జరిగిన ప్లే ఆఫ్ ఎలిమినేటర్–1లో యూపీ యోధ 34–29తో యు ముంబాపై... ఎలిమినేటర్–2లో దబంగ్ ఢిల్లీ 39–28తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచాయి. నేడు జరిగే క్వాలిఫయర్–1లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్, ఎలిమినేటర్–3లో యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ తలపడనున్నాయి. క్వాలిఫయర్–1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఎలిమినేటర్–3 విజేత జట్టుతో జనవరి 3న క్వాలిఫయర్–2లో తలపడుతుంది. ఈ మ్యాచ్ విజేత ఫైనల్లో రెండో బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. -
‘ప్లే ఆఫ్స్’కు యూపీ యోధ
ప్రొ కబడ్డీ లీగ్ కోల్‌కతా: ‘ప్లే ఆఫ్స్’కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ యోధ జట్టు సత్తా చాటింది. ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో భాగంగా గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ యోధ 41–25తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచి 57 పాయింట్లతో జోన్ ‘బి’ నుంచి ‘ప్లే ఆఫ్’కు చేరింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ (55 పాయింట్లు) పట్టికలో నాలుగో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కీలకమైన మ్యాచ్‌లో పటిష్టమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న యూపీ యోధ అలవోకగా గెలిచింది. యూపీ తరఫున రిషాంక్ 9, శ్రీకాంత్, నితేశ్ చెరో 6 పాయింట్లతో చెలరేగగా... బెంగాల్ తరఫున ఆదర్శ్ 4, జాంగ్ కున్ లీ 3 పాయింట్లు సాధించారు. నామమాత్రమైన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 40–32తో జైపూర్పింక్ పాంథర్స్‌పై గెలిచింది. జోన్ ‘ఎ’ నుంచి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ (93 పాయింట్లు), యు ముంబా (86 పాయింట్లు), దబంగ్ ఢిల్లీ (68 పాయింట్లు) ‘ప్లే ఆఫ్స్’కు చేరగా... జోన్ ‘బి’ నుంచి బెంగళూరు బుల్స్ (78 పాయింట్లు), బెంగాల్ వారియరర్స్ (69 పాయింట్లు), యూపీ యోధా (57 పాయింట్లు) నాకౌట్‌కు అర్హత సాధించాయి. ఆదివారం కొచ్చిలో జరుగనున్న ఎలిమినేటర్–1లో యు ముంబాతో యూపీ యోధ... ఎలిమినేటర్–2లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి. -
బెంగళూరు బుల్స్ చేతిలో తెలుగు టైటాన్స్ ఓటమి
స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 13 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా... అతనికి సరైన సహకారం అందకపోవడంతో తెలుగు టైటాన్స్ కీలక సమయంలో మరో ఓటమి మూటగట్టుకుంది. హరియాణాలో మంగళవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌లో టైటాన్స్ 28–44తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. బుల్స్ తరఫున పవన్ 13, రోహిత్ కుమార్ 7 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో బెంగళూరు జోన్ ‘బి’ నుంచి ‘ప్లే ఆఫ్స్’కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 39–30తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. -
దబంగ్ ఢిల్లీ ఘనవిజయం
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ విజయం సాధించింది. జోన్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 48–35తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తుచేసింది. రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌లోనూ ఆకట్టుకున్న ఢిల్లీ గెలుపొందగా... కేవలం రైడింగ్‌నే నమ్ముకున్న జైపూర్ చతికిలపడింది. ఢిల్లీ తరఫున మిరాజ్ షేక్ 15 రైడ్ పాయింట్లతో విజృంభించగా... నవీన్ కుమార్, చంద్రన్ రంజిత్ చెరో 9 పాయింట్లతో అతనికి చక్కటి సహకారం అందించారు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా 20 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 29–10తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన ఢిల్లీ ఆ తర్వాత ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ విజయం సొంతం చేసుకుంది. పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 35–35తో డ్రాగా ముగిసింది. నేడు జరిగే మ్యాచ్‌లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడనుంది. -
ఉత్కంఠ పోరులో టైటాన్స్ ఓటమి
పుణే: ప్రారంభంలో ఆధిపత్యం చెలాయించినా... చివర్లో ఒత్తిడికి గురైన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సీజన్లో తొలిసారి బెంగళూరు బుల్స్‌తో తలపడిన టైటాన్స్ హోరాహోరీ పోరులో ఓటమి పాలైంది. జోన్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 34–26తో టైటాన్స్‌పై గెలిచింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా... ఇరు జట్లు 25–25తో సమంగా నిలిచాయి. ఈ దశలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని ప్రత్యర్థి జట్టు పట్టేయడంతో టైటాన్స్ ఆలౌటైంది. టైటాన్స్ తరఫున రాహుల్, విశాల్ చెరో 6 పాయింట్లు సాధించారు. బుల్స్ తరఫున రోహిత్ (8 పాయింట్లు) రాణించాడు. దీంతో బెంగళూరు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్స్ 35–33తో హరియాణ స్టీలర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి. -
పట్నా పైరేట్స్ గెలుపు
అహ్మదాబాద్: ‘డుబ్కీ’కింగ్ ప్రదీప్ నర్వాల్ విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్ ఏడో విజయం నమోదు చేసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 45–27తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. ప్రదీప్ నర్వాల్ 13, దీపక్ నర్వాల్ 10 పాయింట్లతో సత్తా చాటారు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పైరేట్స్ 16–13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. తమిళ్ తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ 8 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో మన్జీత్ (5 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 39–35తో యు ముంబాపై గెలిచింది. నేటి మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడనుంది. -
గుజరాత్ జెయింట్స్ గెలుపు
అహ్మదాబాద్: సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ దుమ్మురేపింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 35–23తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన ఫార్చూన్ జెయింట్స్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 19–14తో నిలిచింది. రెండో సగంలోనూ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ సునాయాస విజయం సొంతం చేసుకుంది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 9, అజయ్ 6 పాయింట్లు సాధించారు. బెంగాల్ తరఫున మణిందర్ 6, జాంగ్ కున్ లీ 5 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 45–28తో యూపీ యోధాపై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పుణేరీ పల్టన్‌తో బెంగాల్ వారియర్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. -
పట్నా పైరేట్స్ ఐదో విజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. బెంగాల్ వారియర్స్‌తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 50–30తో గెలిచింది. ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ 11, దీపక్ నర్వాల్ 13 పాయింట్లతో చెలరేగారు. ఈ మ్యాచ్‌ను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్నేహితులతో కలిసి వీక్షించారు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 38–36తో యు ముంబాపై విజయం సాధించింది. -
తెలుగు టైటాన్స్ పరాజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో తెలుగు టైటాన్స్ మూడో ఓటమి మూటగట్టుకుంది. జోన్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 25–30తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 8 పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో ఫర్హద్ (5 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 48–24తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్, యు ముంబాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడనున్నాయి. -
హరియాణాపై దబంగ్ ఢిల్లీ గెలుపు
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ మూడో విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 39–33తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. దబంగ్ ఢిల్లీ తరఫున నవీన్ 9, మిరాజ్ 6, చంద్రన్ రంజిత్ 6 పాయింట్లు సాధించారు. హరియాణా జట్టు తరఫున మోను గోయట్ 11 పాయింట్లు చేశాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 37–27తో యూపీ యోధాపై నెగ్గింది. నేటి నుంచి ముంబై వేదికగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. శుక్రవారం మ్యాచ్‌ల్లో యు ముంబాతో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్, యూపీ యోధా మ్యాచ్ ‘డ్రా’
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో తెలుగు టైటాన్స్ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం టైటాన్స్, యూపీ యోధా మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు చివరకు 26–26తో ‘డ్రా’గా ముగిసింది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్‌లో ఆ జోరు కనబర్చలేకపోయింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (3 పాయింట్లు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో టైటాన్స్ తొలి అర్ధభాగంలో 10–19తో వెనుకబడింది. రెండో సగంలో ఇటు రైడింగ్‌లో, అటు ట్యాక్లింగ్‌లో అద్భుతంగా చెలరేగిన టైటాన్స్ చూస్తుండగానే మ్యాచ్‌పై పట్టు సాధించింది. నీలేశ్, మొహ్సిన్, అబోజర్ నాలుగేసి పాయింట్లు సాధించారు. యూపీ యోధా తరఫున సచిన్ కుమార్ 5, శ్రీకాంత్, రిశాంక్ దేవడిగ చెరో 4 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 38–32తో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాతో బెంగళూరు బుల్స్ తలపడతాయి -
యు ముంబా సిక్సర్
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు ఆరో విజయం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 31–22తో పుణేరీ పల్టన్‌పై గెలుపొందింది. యు మంబా తరఫున అభిషేక్ సింగ్ 7 రైడ్ పాయింట్లు, ట్యాక్లింగ్‌లో సురేందర్ సింగ్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. పుణేరీ తరఫున అక్షయ్ జాధవ్ 5 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35–29తో యూపీ యోధాపై గెలిచింది. -
యూపీ యోధాపై తమిళ్ తలైవాస్ గెలుపు
గ్రేటర్ నోయిడా: రైడింగ్‌లో అజయ్ ఠాకూర్, సుఖేశ్ హెగ్డే... ట్యాక్లింగ్‌లో మన్జీత్ చిల్లర్, అమిత్ హుడా చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్ ఆర్ సీజన్లో తమిళ్ తలైవాస్ మూడో విజయం నమోదు చేసింది. జోన్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 46–24తో యూపీ యోధాపై విజయం సాధించింది. అజయ్ సుఖేశ్ చెరో 9 రైడ్ పాయింట్లు ... మన్జీత్ 8, అమిత్ 6 ట్యాకిల్ పాయింట్లు సాధించారు. మ్యాచ్ ఆరంభం నుంచి తలైవాస్ దూకుడుగా ఆడటంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 26–11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలోనూ అధిపత్యం కొనసాగిస్తూ సునాయాస విజయం సొంతం చేసుకుంది. యూపీ యోధా తరఫున ప్రశాంత్ కుమార్ రాయ్ 7 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 36–25తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేటి మ్యాచ్‌ల్లో యు ముంబాతో పుణేరీ పల్టన్, యూపీ యోధాతో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. -
పట్నా పైరేట్స్ పరాజయం
పట్నా: ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ చెలరేగినా... ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో పట్నా పైరేట్స్ పరాజయం పాలైంది. శనివారం యు ముంబాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి వరకు రేసులో నిలిచిన పట్నా ఆఖరకు 39–40తో ఓడింది. పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 17 రైడ్ పాయింట్లతో దుమ్మురేపాడు. ట్యాక్లింగ్‌లో జైదీప్ (5 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. యు ముంబా తరఫున సిద్ధార్థ్ దేశాయ్ 14, రోహిత్ 11 రైడ్ పాయింట్లతో చెలరేగారు. ట్యాక్లింగ్‌లో ఫజల్ (6 పాయింట్లు) సత్తాచాటాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39–28తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో యూపీ యోధా, పట్నా పైరేట్స్‌తో హరియాణా స్టీలర్స్ ఆడతాయి. -
బెంగళూరు బుల్స్ జయభేరి
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 42–34తో హరియాణా స్టీలర్స్‌పై, యూపీ యోధ 29–23తో పుణేరి పల్టన్‌పై గెలిచాయి. గురువారం విశ్రాంతి దినం. రేపు జరిగే పోటీల్లో పట్నాతో జైపూర్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ బోణీ
చెన్నై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్–6లో శుభారంభం చేసింది. మంగళవారం జోన్ ‘బి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (9 పాయింట్లు), మోసిన్ (7 పాయింట్లు), నీలేశ్ సోలంకి (5 పాయింట్లు) చెలరేగడంతో తెలుగు టైటాన్స్ 33–28తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. ఆట ఆరంభమైన తొలి పది నిమిషాలు ఇరు జట్లు హోరాహారీగా తలపడినా ఆ తర్వాత రాహుల్ చౌదరి ధాటిగా ఆడటంతో తమిళ్ తలైవాస్ జట్టు ఆలౌటైంది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 17–11తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తలైవాస్ పుంజుకొని పోటీనిచ్చినా లాభం లేకపోయింది. తమిళ్ తలైవాస్ తరఫున కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో అమిత్ (6 పాయింట్లు) సత్తా చాటాడు. జోన్ ‘ఎ’లో భాగంగా గుజరాత్ ఫార్చూన్‌జెయింట్స్, దబంగ్ ఢిల్లీల మధ్య జరిగిన మరో మ్యాచ్ 32–32తో ‘డ్రా’గా ముగిసింది. ప్రారంభంలో తడబడిన ఢిల్లీ రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకొని చివరకు మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించగలిగింది. ఆట ఆరంభమైన ఏడు నిమిషాల లోపే ఢిల్లీ ఆలౌటైంది. ప్రత్యర్థి చక్కటి డిఫెన్స్‌కు తోడు తమ స్వీయ తప్పిదాలతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 12–17తో వెనుకంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తేరుకొని ప్రత్యర్థికి గట్టి పోటీని చ్చింది. దబంగ్ ఢిల్లీ తరఫున చంద్రన్ రంజిత్ 9 రైడ్ పాయింట్లతో చెలరేగగా... ట్యాకిల్‌లో రవీందర్ (3 పాయింట్లు) రాణించాడు. గుజరాత్ తరఫున సచిన్ 7 రైడ్ పాయింట్లతో ఆకట్టుకోగా... సునీల్ 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా, తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ జట్లు తలపడతాయి. -
పుణేరీ పల్టన్ శుభారంభం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్–6లో పుణేరీ పల్టన్ శుభారంభం చేసింది. సోమవారం జోన్ ‘ఎ’లో భాగంగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో రైడర్లు నితిన్ తోమర్ (7 పాయింట్లు), జీబీ మోరే (6), దీపక్ కుమార్ దహియా (5) రాణించడంతో... 34–22తో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. హరియాణా జట్టులో వికాస్ కండోలా 8 పాయింట్లతో సత్తా చాటినప్పటికీ అతనికి సహచరుల నుంచి తగిన సహకారం అందలేదు. మ్యాచ్ ఆరంభంలో ఇరుజట్లు పోటాపోటీగా తలపడటంతో పాయింట్లు నెమ్మదిగానే వచ్చాయి. 13వ నిమిషంలో 7–6తో దాదాపు ఇరు జట్లు సమానంగానే ఉన్నాయి. అయితే, మ్యాచ్ సాగిన కొద్ది పట్టు సాధించిన పుణేరి రైడర్లు ఆట 19వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి తొలి అర్ధభాగాన్ని 15–9తో ఆధిక్యంతో ముగించారు. రెండో అర్ధభాగంలో పుంజుకున్న హరియాణా వరుసగా 5 పాయింట్లు సాధించి 14–18తో రేసులోకి వచ్చింది. పల్టన్ ఆటగాళ్లు 36వ నిమిషంలో స్టీలర్స్‌ను రెండోసారి ఆలౌట్ చేసి 30–17తో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇదే జోరును చివరి వరకు సాగిస్తూ విజయాన్ని అందుకున్నారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌కు ఓటమి ఎదురైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌ను కంగుతినిపించిన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో 32–37తో యూపీ యోధచేతిలో ఓడిపోయింది. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ 12 రైడ్ పాయింట్లతో ఆకట్టుకోగా... ట్యాకిల్‌లో మన్జీత్ చిల్లర్ (4 పాయింట్లు) రాణించాడు. యూపీ యోధా తరఫున రైడర్లు ప్రశాంత్ కుమార్ (8), శ్రీకాంత్ (5), రిషాంక్ దేవడిగ (4) క్రమం తప్పకుండా స్కోర్ చేస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. -
రైతు బిడ్డ ఎలా కోటీశ్వరుడయ్యాడు.?
హైదరాబాద్ : అనమాక క్రికెటర్లను ఐపీఎల్ ప్రపంచానికి పరిచయం చేస్తే.. కబడ్డీ ఆటగాళ్లను ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) కోటీశ్వరులను చేస్తోంది. భారత దేశ ప్రాంతీయ క్రీడ అయిన కబడ్డీ ప్రస్తుతం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. భారత్‌లో ఐపీఎల్ తర్వాత అంత ఆదరణ పొందిన లీగ్‌గా ఇప్పటికే పీకేఎల్ గుర్తింపు పొందింది. ఐపీఎల్ తరహాలో దేశీయ, విదేశీ ఆటగాళ్లతో ప్రారంభమైన పీకేఎల్ ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరోసీజన్కు సిద్దమైంది. గత సీజన్ వరకు లక్షల్లో పలికిన ఆటగాళ్లు ఈసీజన్లో ఏకంగా కోట్లలో పలికారు. ఇలా ఓ రైతు బిడ్డ.. మోను గోయట్ ఇటీవల జరిగిన వేలంలో కోటిన్నర పలికి వార్తాల్లో నిలిచాడు. హర్యానా హిస్సార్ జిల్లాలోని హన్సీ అనే మారుమూల గ్రామానికి చెందిన మోను గోయట్ ఈ సీజన్ వేలంలో అధిక ధర పలికి చరిత్ర సృష్టించాడు. గతేడాది అత్యధికంగా పలికిన నితిన్ తోమర్ 96 లక్షల కన్నా ఇది 60 శాతం ఎక్కువ కాగా.. ఐపీఎల్లో విదేశీ స్టార్ ఆటగాళ్లు జాసన్ రాయ్, టీమ్ సౌథీ, సామ్ బిల్లింగ్స్‌లు పలికిన ధరల కన్నా కూడా ఎక్కువే. మూడు ఫ్రాంచైజీల పోటీ.. స్టార్ రైడర్ అయిన మోను గోయట్ కోసం మూడు ఫ్రాంచైజీలు దబాంగ్ ఢిల్లీ, యూ ముంబా, హర్యాన స్టీలర్స్ పోటీ పడ్డాయి. చివరకు ఈ 25 ఏళ్ల జవాన్‌ను రూ. 1.51 కోట్లకు హర్యానా స్టీలర్స్ సొంతం చేసుకుంది. వేలం తొలి రోజు ఇరానీ ప్లేయర్ ఫజల్ అట్రాచలీ కోటి పలకడంతోనే సోషల్ మీడియాలో ప్రశంసలు కురిసాయి. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే కబడ్డీకి మంచి రోజులొచ్చాయని ట్వీట్ చేశాడు. 9 ఏళ్ల నుంచే కబడ్డీ కూత.. మోను గోయట్ 9 ఏళ్లకే కబడ్డీ ఆడటం ప్రారంభించాడు. తన మామ అయిన మాజీ కబడ్డీ ప్లేయర్ విజేంధర్ సింగ్ శిక్షణలో రాటుదేలాడు. గోయట్ బాల్యం అంతా బివానీ జిల్లాలోని కుంగార్ గ్రామంలో కొనసాగింది. ఈ ఊరు నుంచి ఎంతో మంది జాతీయ స్థాయి ఆటగాళ్లు, కోచ్‌లు వచ్చారు. తన మామ కూడా 1990 బీజింగ్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశాన్ని మోకాలీ గాయంలో తృటిలో చేజార్చుకున్నారు.‘ గోయట్ చురుకైన వాడు.. అందుకే అతన్ని క్రీడలను ఎంచుకోమన్నాను. రెండేళ్లనంతరం స్టార్ రైడర్‌గా ఎదిగాడు’ అని ఆయన మురిసిపోయారు. ఉద్యోగం కోసమే ఆడేవాళ్లం.. ప్రభుత్వ ఉద్యోగం కోసమే తాము క్రీడలను ఎంచుకునేవాళ్లమని గోయట్ చెప్పుకొచ్చారు. అప్పుడు తమ దగ్గర డబ్బులు లేవని, ఇలాంటి లీగ్‌లు కూడా లేవని ఈ రైతు బిడ్డ అభిప్రాయపడ్డాడు. గోయట్ తండ్రి తనకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటర్ విలేజ్ టోర్నీ విజేతగా నిలిస్తే రూ.30వేల ప్రైజ్ మనీ అందిందని, అది తన డిగ్రీ చదువులకు ఉపయోగపడిందని గోయట్ తెలిపాడు. ఉద్యోగ లక్ష్యంలో కోసం క్రీడలను ఎంచుకున్న గోయట్.. 2010లో స్పోర్ట్స్ కోటా ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వృత్తీరీత్యా కొన్ని కారణాలతో తొలి మూడు సీజన్లకు దూరమైన గోయట్ నాలుగో సీజన్లో 18 లక్షలకు బెంగాల్ వారియర్స్.. ఐదో సీజన్లో రూ.44.5 లక్షలకు పట్నారైడర్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ డబ్బులతో తన ఊరులో ఇళ్లును కట్టుకున్నాడు. మరిన్నీ డబ్బులతో కారు కొనుక్కున్నాడు. అయితే ఈ సారి అనూహ్యంగా కోటి యాబై లక్షల పలకడంతో ఆ డబ్బును ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని గోయట్ చెప్పుకొచ్చాడు. కొంత డబ్బును తన అన్నపెళ్లికి ఖర్చుచేస్తానని తెలిపాడు. భారత్ తరుపున ఆడటమే తన లక్ష్యమని తెలిపాడు. గోయట్ ఆకల కూడా నెరవేరనుంది. భారత తరపున దుబాయకబడ్డీ మాస్టర్స్ టోర్నీలో అరంగేట్ర చేయనున్నాడు. అనంతరం ఆగష్టులో జరిగే జకర్తా ఆసియా గేమ్స్‌లో పాల్గొననున్నాడు. ఓ కబడ్డీ ఆటగాడిగా, ఆర్మీ ఉద్యోగిగా దేశానికి సేవచేయడమే నాకర్తవ్యం అని గోయట్ చెప్పుకొచ్చాడు. పీకేఎల్ 6వ సీజన్ అక్టోబర్ 19 నుంచి జరగనుంది. -
రాహుల్‌ను వదులుకున్న టైటాన్స్
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఆశ్చర్యకరంగా తమ స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరిని వద్దనుకుంది. ఆరో సీజన్ కోసం అతను వేలానికి రానున్నాడు. ఈ నెల 30, 31 తేదీల్లో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ముంబైలో జరిగే ఈ వేలం ప్రక్రియలో 422 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నట్లు పీకేఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో 14 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ఆటగాళ్లుండగా, 87 మంది ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ (ఎఫ్‌కేహెచ్) కార్యక్రమం ద్వారా అర్హత సాధించిన వారున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ పోటీల ద్వారా వీరంతా వేలానికి అర్హత పొందారు. మొత్తం 12 ఫ్రాంచైజీల్లో 9 ఫ్రాంచైజీలు 21 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. మూడు ఫ్రాంచైజీలు మాత్రం ఏ ఒక్కరినీ రిటెయిన్ చేసుకోలేదు. జట్టు మొత్తానికి కొత్త రూపు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ సహ యజమానిగా ఉన్న తమిళ్ తలైవాస్ అజయ్ ఠాకూర్, అమిత్ హుడా, అరుణ్‌లను అట్టి పెట్టుకుంది. తెలుగు టైటాన్స్ ఫ్రాంచైజీ రాహుల్‌ను కాదని నితేశ్ సాలుంకే, మోసెన్ (ఇరాన్)లను రిటెయిన్ చేసుకుంది. -
పట్నా పైరేట్స్కే పట్టం
ఇప్పటి వరకు ప్రొ కబడ్డీ లీగ్‌లు ఐదు జరిగాయి. ఇందులో ఏకంగా మూడు టైటిళ్లను పట్నా పైరేట్సే గెలుచుకుంది. అది కూడా వరుసగా! ఇకపై పీకేఎల్ అంటేనే పైరేట్స్ దోపిడి గుర్తొస్తుందేమో! ‘హ్యాట్రిక్’తో ఈ లీగ్ ఫేవరేట్‌గా మారిపోయింది పట్నా. కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ జట్టును అన్నీ తానై నడిపించాడు. మళ్లీ జట్టును గెలిపించాడు. చెన్నై: రైడింగ్‌లో ప్రదీప్ నర్వాల్ మెరిస్తే... టైటిల్స్‌లో పట్నా పైరేట్స్ గర్జించింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఐదో సీజన్లోనూ గెలిచిన పైరేట్స్ ‘హ్యాట్రిక్’ ధమాకా సృష్టించింది. రెండేళ్ల వ్యవధిలోనే పట్నా సాధించిన మూడో టైటిల్ ఇది. గతేడాది రెండు ఈవెంట్లు జరిగాయి. ఆ రెండు సార్లు పట్నానే గెలిచింది. శనివారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో పట్నా పైరేట్స్ 55–38 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. అరంగేట్రం చేసిన సీజన్లోనే టైటిల్ నెగ్గాలనుకున్న గుజరాత్ ఆశలపై పైరేట్స్ ఆటగాళ్లు నీళ్లు చల్లారు. ప్రదీప్ కూత... పట్నా కేక... మ్యాచ్ జరుగుతున్న కొద్దీ అత్యంత ప్రమాదకారిగా మారే ప్రదీప్ ఫైనల్లోనూ సరిగ్గా అదే పని చేశాడు. పట్నా 45... గుజరాత్ 36. మ్యాచ్ ఇంకా 4 నిమిషాల్లో ముగియనుంది. పైరేట్స్ది ఆధిక్యమే కానీ ఆలౌట్‌కు చేరువైంది. కోర్టులో ప్రదీప్‌కు జతగా ఒక్కరే మిగిలారు. వీళ్లిద్దరిని గుజరాత్ ఔట్ చేస్తే ఆలౌట్ పాయింట్లతో స్కోరు 40కి చేరుతుంది. కానీ ప్రదీప్ ఈ కీలక సమయంలో రైడింగ్‌లో జూలు విదిల్చాడు. రెండు పాయింట్లు తెచ్చాడు. అక్కడి నుంచి ఆలౌట్ రూటు గుజరాత్‌కు మారింది. ఆధిక్యం అంతకంతకూ పెంచుకున్న పట్నా దుర్భేద్యమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రదీప్ 19, మోను గోయట్ 9, విజయ్ 7 పాయింట్లు చేయగా... గుజరాత్ తరఫున సచిన్ 11, మహేంద్ర 5, చంద్రన్ 4 పాయింట్లు సాధించారు. మొత్తానికి మూడు నెలలపాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ పట్నా పైరేట్స్ ముచ్చటైన విజయంతో ముగిసింది. ప్రదీప్... ప్రదీప్... అవార్డులు, క్యాష్ రివార్డులు అన్నీ స్టార్ రైడర్ ప్రదీప్ చేతికే చిక్కాయి. బహుమతులిచ్చే వారే మారారు కానీ అతను మాత్రం మారలేదు. పర్ఫెక్ట్ రైడర్ (రూ. 50 వేలు) మొదలు... బెస్ట్ డూ ఆర్ డై రైడర్ (రూ.50వేలు), స్టార్ స్పోర్ట్స్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), లీగ్ టాప్ స్కోరర్ (రూ.10 లక్షలు), రైడర్ ఆఫ్ ద టోర్నీ (రూ. 10 లక్షలు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 15 లక్షలు) అవార్డులు ప్రదీప్ నర్వాల్‌ను ముంచెత్తాయి. వీటితో పాటు రెండు ‘టీవీఎస్’ జూపిటర్ స్కూటర్లనూ గెలుచుకున్నాడు. ఉత్తమ అరంగేట్ర ఆటగాడు అవార్డు సచిన్ (గుజరాత్; రూ. 10 లక్షలు)కు, డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు సురేందర్ నాడా (హరియాణా; రూ. 10 లక్షలు)కు లభించాయి. ఎవరికి ఎంతంటే... ►విజేత పట్నాకు రూ. 3 కోట్లు ►రన్నరప్ గుజరాత్‌కు రూ. 1.80 కోట్లు ►అత్యంత విలువైన ఆటగాడు ప్రదీప్‌కు రూ. 15 లక్షలు -
పట్నా పైరేట్స్ ఖాతాలో ఐదో ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ జట్టు ఐదో ‘టై’ నమోదు చేసింది. బెంగళూరు బుల్స్, పట్నా జట్ల మధ్య బుధవారం జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్ 29–29 పాయింట్లతో సమంగా ముగిసింది. జోన్ ‘ఎ’ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 38–15తో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును ఓడించింది. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; గుజరాత్ జెయింట్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
గెలుపు ముంగిట టైటాన్స్ బోల్తా
జైపూర్: రైడింగ్‌లో అదరగొట్టిన హరియాణా స్టీలర్స్ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైడర్ వజీర్ సింగ్ (14 పాయింట్లు) కీలక పాయింట్లు సాధించడంతో హరియాణా 32–30తో టైటాన్స్‌పై గెలుపొందింది. స్కోరు 30–30తో సమమైన దశలో వజీర్ సింగ్ 2 రైడ్ పాయింట్లు తెచ్చి హరియాణాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 25 రైడింగ్ పాయింట్లు సాధించిన హరియాణా ట్యాకిల్‌లో కేవలం ఒక పాయింట్ మాత్రమే చేయగలిగింది. మరోవైపు రాహుల్ చౌదరి (11 పాయింట్లు) రాణించడంతో తెలుగు టైటాన్స్ 22 రైడింగ్ పాయింట్లు స్కోర్ చేసింది. ట్యాకిల్‌లోనూ 5 పాయింట్లతో రాణించింది. ఇరుజట్లు చెరో 2 సార్లు ఆలౌటయ్యాయి. అయితే చివర్లో ఒత్తిడికి చిత్తయిన టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–32తో యు ముంబాపై విజయం సాధించింది. జైపూర్ జట్టులో జస్వీర్ సింగ్ (9 పాయింట్లు) ఆకట్టుకోగా, యు ముంబా జట్టులో కశ్‌లింగ్ అడాకే (6 పాయింట్లు) మెరుగ్గా ఆడాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
‘తమిళ్ తలైవాస్’ అంబాసిడర్‌గా కమల్
ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలిసారి బరిలోకి దిగనున్న ‘తమిళ్ తలైవాస్’ జట్టుకు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా ఉన్న ‘తమిళ్ తలైవాస్’ జట్టు తమ జెర్సీని గురువారం చెన్నైలో జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, సచిన్లతోపాటు సినీ నటులు చిరంజీవి, అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ పాల్గొంటారు. ప్రొ కబడ్డీ లీగ్ ఈనెల 28న హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.