
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. బుధవారం యూపీ యోధ, గుజరాత్ జెయింట్స్ హోరాహోరీగా తలపడగా, 32–32 స్కోరుతో మ్యాచ్ సమమైంది. యూపీ తరఫున పర్‌దీప్ నర్వాల్ 11 పాయింట్లతో సత్తా చాటగా...గుజరాత్ ఆటగాళ్లలో రాకేశ్ నర్వాల్ 13 పాయింట్లతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 52–35 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది.
నవీన్ కుమార్ అద్భుత ప్రదర్శన ఢిల్లీని గెలిపించింది. అతనొక్కడే 24 పాయింట్లతో దూసుకుపోవడం విశేషం. బెంగాల్ ఆటగాళ్లలో కెప్టెన్ మణీందర్ సింగ్ 16 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌లలో జైపూర్‌తో యు ముంబా, హర్యానాతో బెంగళూరు తలపడతాయి.