Pradeep Narwal
-
PKL: వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. తేదీలు ఖరారు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ప్రారంభానికి ముందు ఈ నెల 15, 16తేదీల్లో ప్లేయర్ల వేలం జరగనుంది. పవన్ షెరావత్, ప్రదీప్ నర్వాల్, మణిందర్ సింగ్, ఫజల్ అట్రాచలీ, మొహమ్మద్ రెజా వంటి పలువురు స్టార్ ప్లేయర్లు ఈసారి వేలంలో పాల్గొంటున్నారు. 88 మంది ప్రధాన ప్లేయర్లను రీటెయిన్ చేసుకున్న 12 ఫ్రాంచైజీలు.. యువ ఆటగాళ్లను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.నాలుగు కేటగిరీలువేలంలో పాల్గొంటున్న ప్లేయర్లను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్ల కనీస ధర రూ. 30 లక్షలు కాగా.. ‘బి’ కేటగిరీలో ఉన్న వాళ్ల బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు. ‘సి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.13 లక్షలు, ‘డి’ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 9 లక్షలు ప్రాథమిక ధరగా నిర్ణయించారు. వేలంలో 500 మందికి పైగా ప్లేయర్లు పాల్గొననుండగా.. ఒక్కో ఫ్రాంచైజీ ఐదు కోట్లు ఖర్చు చేయనుంది. -
యూపీ, గుజరాత్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. బుధవారం యూపీ యోధ, గుజరాత్ జెయింట్స్ హోరాహోరీగా తలపడగా, 32–32 స్కోరుతో మ్యాచ్ సమమైంది. యూపీ తరఫున పర్దీప్ నర్వాల్ 11 పాయింట్లతో సత్తా చాటగా...గుజరాత్ ఆటగాళ్లలో రాకేశ్ నర్వాల్ 13 పాయింట్లతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 52–35 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. నవీన్ కుమార్ అద్భుత ప్రదర్శన ఢిల్లీని గెలిపించింది. అతనొక్కడే 24 పాయింట్లతో దూసుకుపోవడం విశేషం. బెంగాల్ ఆటగాళ్లలో కెప్టెన్ మణీందర్ సింగ్ 16 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌లలో జైపూర్‌తో యు ముంబా, హర్యానాతో బెంగళూరు తలపడతాయి. చదవండి: ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్‌గా కుల్ధీప్ యాదవ్.. -
నువ్వు నాకు చెప్పిన 'జేఎన్‌యూ' ఇదేనా?
‘నేను జేఎన్‌యూలో చేరే ముందు మా అమ్మ జేఎన్‌యూ గురించి అడిగింది. దేశంలోని ప్రఖ్యాత వర్సిటీలలో ఇది కూడా ఒకటి అని నేను సమాధానమిచ్చాను. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిమాణాలను మీడియాలో చూసి ఇదేనా నువ్వు చెప్పిన జేఎన్‌యూ అని మా అమ్మ ప్రశ్నిస్తోంద’ని జేఎన్‌యూ వర్సిటీ ఏబీవీపీ మాజీ సెక్రటరీ జనరల్ ప్రదీప్ నర్వాల్ వాపోయారు. జేఎన్‌యూలో తాజాగా జరుగుతున్న పరిమాణాలు కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ఇదే నెలలోనే ప్రదీప్, మరి కొంతమంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా వీరంతా కలిసి జేఎన్‌యూ వివాదంలో కలగజేసుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. ఇందులో యూనివర్సిటీలో జరుగుతున్న పరిమాణాల కారణంగా అక్కడి విద్యార్థులకు భద్రత లేకుండా పోతోందని వాపోయారు. భద్రత కల్పించాల్సిన పోలీసులను రాజకీయ అవసరాల కోసం పార్టీలు వాడుకుంటున్నాయని, ఇప్పటికైనా ప్రధానిగా మీరు కలగజేసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. ‘నాకు తెలిసి యూనివర్సిటీ అంటే ఒక స్వతంత్ర వ్యవస్థ. అందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. యూనివర్సిటీలోని విద్యార్థుల బాధలు తగ్గించాల్సింది పోయి జాతీయత పేరుతో అక్కడ వారిని ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా జేఎన్‌యూను ఓ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకే నేను పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది’ అని లేఖలో పేర్కొన్నారు.