ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ప్రారంభానికి ముందు ఈ నెల 15, 16తేదీల్లో ప్లేయర్ల వేలం జరగనుంది. పవన్ షెరావత్, ప్రదీప్ నర్వాల్, మణిందర్ సింగ్, ఫజల్ అట్రాచలీ, మొహమ్మద్ రెజా వంటి పలువురు స్టార్ ప్లేయర్లు ఈసారి వేలంలో పాల్గొంటున్నారు. 88 మంది ప్రధాన ప్లేయర్లను రీటెయిన్ చేసుకున్న 12 ఫ్రాంచైజీలు.. యువ ఆటగాళ్లను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
నాలుగు కేటగిరీలు
వేలంలో పాల్గొంటున్న ప్లేయర్లను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్ల కనీస ధర రూ. 30 లక్షలు కాగా.. ‘బి’ కేటగిరీలో ఉన్న వాళ్ల బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు. ‘సి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.13 లక్షలు, ‘డి’ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 9 లక్షలు ప్రాథమిక ధరగా నిర్ణయించారు. వేలంలో 500 మందికి పైగా ప్లేయర్లు పాల్గొననుండగా.. ఒక్కో ఫ్రాంచైజీ ఐదు కోట్లు ఖర్చు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment