![Bengaluru Bulls seal final spot in Pro Kabaddi - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/1/BENG-CATCH.jpg.webp?itok=LPQy-1u-)
కొచ్చి: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేల్)లో బెంగళూరు బుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో బెంగళూరు 41–29 స్కోరుతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై విజయం సాధించింది. రైడింగ్‌లో బుల్స్ ఆటగాడు పవన్ షెరావత్ చెలరేగాడు. 13 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను 13 పాయింట్లు తెచ్చి పెట్టాడు. రోహిత్ కుమార్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అతను 11 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో మహేందర్ సింగ్ 6 ట్యాకిల్ పాయింట్లు చేశాడు.
గుజరాత్ జట్టులో సచిన్ ఆకట్టుకున్నాడు. 12 సార్లు రైడింగ్‌కు వెళ్లిన సచిన్ 10 పాయింట్లు సాధించాడు. ఓడినా... గుజరాత్‌కు ఫైనల్ చేరే అవకాశం ఇంకా మిగిలే వుంది. ఈ నెల 3న యూపీ యోధతో జరిగే రెండో క్వాలిఫయర్‌లో గెలిస్తే ఆ జట్టు టైటిల్ పోరుకు అర్హత సంపాదించవచ్చు. ఎలిమినేటర్–3 మ్యాచ్‌లో యూపీ యోధ 45–33తో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత పొందింది.
Comments
Please login to add a commentAdd a comment