
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ మూడో విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 39–33తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. దబంగ్ ఢిల్లీ తరఫున నవీన్ 9, మిరాజ్ 6, చంద్రన్ రంజిత్ 6 పాయింట్లు సాధించారు.
హరియాణా జట్టు తరఫున మోను గోయట్ 11 పాయింట్లు చేశాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 37–27తో యూపీ యోధాపై నెగ్గింది. నేటి నుంచి ముంబై వేదికగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. శుక్రవారం మ్యాచ్‌ల్లో యు ముంబాతో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment