తమిళ్‌ తలైవాస్, యు ముంబా మ్యాచ్‌ టై | PKL: Tamil Thalaivas Tie U Mumba 30 30 in closely fought match | Sakshi
Sakshi News home page

PKL 2021: తమిళ్‌ తలైవాస్, యు ముంబా మ్యాచ్‌ టై

Published Tue, Dec 28 2021 8:32 AM | Last Updated on Tue, Dec 28 2021 8:32 AM

PKL: Tamil Thalaivas Tie U Mumba 30 30 in closely fought match - Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో మూడో ‘టై’ నమోదైంది. తమిళ్‌ తలైవాస్, యు ముంబా జట్ల మధ్య సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌ 30–30 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యు ముంబా తరఫున వి.అజిత్‌ కుమార్‌ 15 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌ జట్టు ఖాతాలో ఇది రెండో ‘టై’ కావడం గమనార్హం.

లీగ్‌ తొలి రోజు తెలుగు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను తమిళ్‌ తలైవాస్‌ 40–40తో ‘టై’ చేసు కుంది. మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 32–29తో యూపీ యోధపై నెగ్గింది. నేడు పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్‌; తెలుగు టైటాన్స్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడతాయి.

చదవండి: Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌.. యాషెస్‌ సిరీస్‌ ఆస్ట్రేలియాదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement