
ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు ఐదో విజయం నమోదు చేసింది. దబంగ్ ఢిల్లీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 36–33తో గెలుపొందింది. హరియాణా తరఫున రెయిడర్ వికాశ్ కండోలా అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.మరో మ్యాచ్‌లో యూపీ యోధ 40–36తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో పుణేరి పల్టన్; యు ముంబాతో తెలుగు టైటాన్స్; జైపూర్ పింక్ పాంథర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.
చదవండి: హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కి బంఫర్ ఆఫర్.. ప్రపంచకప్ జట్టులో చోటు!