
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 42–34తో హరియాణా స్టీలర్స్‌పై, యూపీ యోధ 29–23తో పుణేరి పల్టన్‌పై గెలిచాయి. గురువారం విశ్రాంతి దినం. రేపు జరిగే పోటీల్లో పట్నాతో జైపూర్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.