
స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 13 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా... అతనికి సరైన సహకారం అందకపోవడంతో తెలుగు టైటాన్స్ కీలక సమయంలో మరో ఓటమి మూటగట్టుకుంది. హరియాణాలో మంగళవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌లో టైటాన్స్ 28–44తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది.
బుల్స్ తరఫున పవన్ 13, రోహిత్ కుమార్ 7 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో బెంగళూరు జోన్ ‘బి’ నుంచి ‘ప్లే ఆఫ్స్’కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 39–30తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది.