
పట్నా: ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఇప్పట్లో బోణీ కొట్టేలా కనిపించడం లేదు. గురువారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47–26తో ఓడిన టైటాన్స్ సీజన్‌లో మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 11 పాయింట్లతో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచినా... బుల్స్ రైడర్ పవన్ కుమార్ (17 పాయింట్లు) రైడింగ్ ముందు నిలబడలేకపోయాడు. దీంతో సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి, ఒక దాంట్లో ‘టై’తో సరిపెట్టుకున్న టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్‌తో యూపీ యోధ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment