చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ సత్తా చాటాడు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న హరియాణా స్టీలర్స్‌ను తన రైడ్లతో మట్టికరిపించాడు. మ్యాచ్‌లో సూపర్ ‘టెన్’ (మొత్తం 16 పాయింట్లు)తో అదరగొట్టాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 40–29తో హరియాణా స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసిన టైటాన్స్ ఈ లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 30–30తో ‘డ్రా’గా ముగిసింది. సీజన్‌లో ఇది ఐదో ‘టై’ కావడం విశేషం. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్, రాహుల్ చౌదరిలు చెరో 8 పాయింట్లతో రాణించారు. నేటి మ్యాచ్‌ల్లో యుముంబాతో హరియాణా స్టీలర్స్; యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment