Telugu Titans team
-
తెలుగు టైటాన్స్ ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. బెంగాల్ వారియర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 25–45 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున వినయ్ ఎనిమిది పాయింట్లు, మోనూ గోయట్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ జట్టులో రెయిడర్లు మణీందర్ సింగ్ 11 పాయింట్లు, దీపక్ హుడా 11 పాయింట్లు, శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 41–39తో పుణేరి పల్టన్‌పై, జైపూర్ పింక్ పాంథర్స్ 35–30తో పట్నా పైరేట్స్‌పై నెగ్గాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో యు ముంబా; గుజరాత్ జెయింట్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. చదవండి: Women's Asia Cup 2022: మరో విజయమే లక్ష్యంగా... థాయ్‌లాండ్‌తో భారత్ ఢీ -
తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను తెలుగు టైటాన్స్ జట్టు 32–32 స్కోరుతో ‘టై’ చేసుకుంది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది నాలుగో ‘టై’ కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున అంకిత్ తొమ్మిది పాయింట్లు, రజనీశ్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ తరఫున మణీందర్ అత్యధికంగా 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–31తో గుజరాత్ జెయింట్స్ జట్టును ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో పట్నా పైరేట్స్ తలపడతాయి. చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..! -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మూడో ఓటమి చవిచూసింది. పట్నా పైరేట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–31తో పరాజయం పాలైంది. తెలుగు టైటాన్స్ తరఫున అంకిత్ బెనివాల్ 10 పాయింట్లు స్కోరు చేశాడు. మోనూ గోయట్ (7), సచిన్ (6), ప్రశాంత్ (5) రాణించి పట్నా విజయంలో కీలకపాత్ర పోషించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 31–28తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. వారియర్స్ స్టార్ ప్లేయర్ మణీందర్ సింగ్ 13 పాయింట్లు స్కోరు చేయడంతోపాటు పీకేఎల్ చరిత్రలో 800 రెయిడింగ్ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో యు ముంబా; యూపీ యోధతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. చదవండి: SA vs IND: టీమిండియాకు భారీ షాక్.. వన్డే సిరీస్‌కు కోహ్లి దూరం! -
ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?
ధరూరు: ప్రో కబడ్డీ పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావాసి ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న ప్రో కబడ్డీ పోటీల్లో తెలుగు టైటాన్స్ జట్టు తరఫున జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని భీంపురం గ్రామానికి చెందిన గాళ్ల రాజురెడ్డి బరిలోకి దిగనున్నాడు. తెలుగు టైటాన్స్ జట్టుకు నడిగడ్డ ప్రాంతానికి చెందిన యువకుడు ఎంపికవడంపై ఉమ్మడిజిల్లావ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంత కబడ్డీ ఆటగాళ్లతోపాటు అసోసియేషన్ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే జట్టుకు రాజురెడ్డి ఎంపికవడం జిల్లాకే గర్వకారణమని సామాజిక కార్యకర్త సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. పోటీల్లో బాగా రాణించి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రాజురెడ్డిని పలువురు అభినందించారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
సూపర్ సిద్ధార్థ్
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ సత్తా చాటాడు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న హరియాణా స్టీలర్స్‌ను తన రైడ్లతో మట్టికరిపించాడు. మ్యాచ్‌లో సూపర్ ‘టెన్’ (మొత్తం 16 పాయింట్లు)తో అదరగొట్టాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 40–29తో హరియాణా స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసిన టైటాన్స్ ఈ లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 30–30తో ‘డ్రా’గా ముగిసింది. సీజన్లో ఇది ఐదో ‘టై’ కావడం విశేషం. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్, రాహుల్ చౌదరిలు చెరో 8 పాయింట్లతో రాణించారు. నేటి మ్యాచ్‌ల్లో యుముంబాతో హరియాణా స్టీలర్స్; యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల బాట వీడటం లేదు. ట్యాక్లింగ్‌తో పాటు రైడింగ్‌లో విఫలమైన టైటాన్స్ సొంత ప్రేక్షకుల మధ్య కూడా సత్తా చాటలేక వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. నగరంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 27–29తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓడింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 12–17తో వెనుకంజలో ఉన్న టైటాన్స్ ఆ తర్వాత పుంజుకొని వరుస పాయింట్లు సాధించింది. ఓ దశలో 26–23తో ఆధిక్యంలోకి వచ్చింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... అనూహ్యంగా తడబడి ఓటమి మూటగట్టుకుంది. కీలక సమయంలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఔట్ కావడం ఫలితంపై ప్రభావం చూపింది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 10 పాయింట్లతో మెరవగా... టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరి 8 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 53–36తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో యు ముంబాతో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
రాహుల్... జిగేల్
పట్నా: స్టార్ రైడర్ రాహుల్ చౌదరి చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ నాలుగో విజయం సాధించింది. జోన్ ‘బి’లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 53–32తో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. రైడింగ్‌లో రాహుల్ 17, నీలేశ్ 7 పాయింట్లతో సత్తా చాటడంతో పాటు ట్యాక్లింగ్‌లో విశాల్ (9 పాయింట్లు) రాణించడంతో టైటాన్స్ సునాయాసంగా గెలుపొందింది. 11వ నిమిషంలో 8–9తో వెనుకబడి ఉన్న టైటాన్స్... నీలేశ్ ‘సూపర్‌రైడ్’తో 3 పాయింట్లు సాధించడంతో 11–9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా చెలరేగి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పట్నా తరఫున వికాస్ 9 రైడ్ పాయింట్లు సాధించగా... ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ (4 పాయింట్లు) విఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 37–27తో పుణేరీ పల్టన్స్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో పుణేరీ పల్టన్, పట్నా పైరేట్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. -
టైటాన్స్‌కు మనోజ్, మహేందర్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆరో సీజన్ కోసం రెండు రోజుల పాటు నిర్వహించిన వేలం గురువారంతో ముగిసింది. రెండోరోజూ వేలంలో ఫ్రాంచై జీలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లపై దృష్టి సారించాయి. కృష్ణా జిల్లా క్రీడాకారుడు చందన మనోజ్ కుమార్, హైదరాబాద్ ప్లేయర్ మహేందర్ రెడ్డిలకు తొలిసారిగా ప్రొ కబడ్డీ లీగ్‌లో చోటు దక్కిం ది. తెలుగు టైటాన్స్ యాజమాన్యం వీరిద్దరినీ చెరో రూ. 8 లక్షలకు (సి కేటగిరీ) దక్కించుకుంది. ఓవరా ల్గా 12 ఫ్రాంచైజీలు రూ. 45.93 కోట్లు వెచ్చించి 181 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. తెలుగు టైటాన్స్ జట్టు రూ. 3.98 కోట్లు ఖర్చుచేసి 18 మంది ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ప్రశాంత్ కుమార్‌కు రూ. 79 లక్షలు తొలిరోజు స్టార్ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించిన యజమానులు... రెండోరోజు వేలంలో రెండో శ్రేణికి చెందిన ‘బి’ కేటగిరీ, తదుపరి స్థాయి ‘సి’, ‘డి’ కేటగిరీ ప్లేయర్లను కొనుగోలు చేశాయి. యూపీ యోధ జట్టు, రైడర్ ప్రశాంత్ కుమార్ రాయ్‌ని రూ. 79 లక్షలకు చేజిక్కించుకుంది. దీంతో పీకేఎల్ ‘బి’ కేటగిరీలో అత్యధిక మొత్తం దక్కించుకున్న క్రీడాకారుడిగా ప్రశాంత్ ఘనతకెక్కాడు. అతని తర్వాత చంద్రన్ రంజిత్ (రూ. 61.25 లక్షలు– దబంగ్ ఢిల్లీ), వికాస్ ఖండోలా (రూ. 47 లక్షలు– హరియాణా స్టీలర్స్)లు పెద్ద మొత్తాలను దక్కించుకున్నారు. తెలుగు టైటాన్స్ జట్టు: రాహుల్ చౌదరి (రూ. 1.29 కోట్లు), నీలేశ్ సాలుంకే (రూ. 56.8 లక్షలు), మోసీన్ జఫారి (రూ. 24.5 లక్షలు), రక్షిత్ (రూ. 6.60 లక్షలు), సోమ్‌బీర్ (రూ. 6.60 లక్షలు), విశాల్ భరద్వాజ్ (రూ. 6.60 లక్షలు), రజ్నీశ్ (రూ. 6.60 లక్షలు), అంకిత్ బెనివాల్ (రూ. 6.60 లక్షలు), కమల్ సింగ్ (రూ. 6.60 లక్షలు), అబోజర్ మోహజెర్మింగని (రూ. 76 లక్షలు), ఫర్హాద్ రహిమి మిలాగర్డన్ (రూ. 21.5 లక్షలు), సి. మనోజ్ కుమార్ (రూ. 8 లక్షలు), సంకేత్ చవాన్ (రూ. 8 లక్షలు), ఆర్మాన్ (రూ. 5 లక్షలు), అనూజ్ కుమార్ (రూ. 5 లక్షలు), దీపక్ (రూ. 5 లక్షలు), రాకేశ్ సింగ్ కుమార్ (రూ. 12 లక్షలు), మహేందర్ రెడ్డి (రూ. 8 లక్షలు). -
రాహుల్‌ను వదులుకున్న టైటాన్స్
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఆశ్చర్యకరంగా తమ స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరిని వద్దనుకుంది. ఆరో సీజన్ కోసం అతను వేలానికి రానున్నాడు. ఈ నెల 30, 31 తేదీల్లో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ముంబైలో జరిగే ఈ వేలం ప్రక్రియలో 422 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నట్లు పీకేఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో 14 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ఆటగాళ్లుండగా, 87 మంది ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ (ఎఫ్‌కేహెచ్) కార్యక్రమం ద్వారా అర్హత సాధించిన వారున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ పోటీల ద్వారా వీరంతా వేలానికి అర్హత పొందారు. మొత్తం 12 ఫ్రాంచైజీల్లో 9 ఫ్రాంచైజీలు 21 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. మూడు ఫ్రాంచైజీలు మాత్రం ఏ ఒక్కరినీ రిటెయిన్ చేసుకోలేదు. జట్టు మొత్తానికి కొత్త రూపు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ సహ యజమానిగా ఉన్న తమిళ్ తలైవాస్ అజయ్ ఠాకూర్, అమిత్ హుడా, అరుణ్‌లను అట్టి పెట్టుకుంది. తెలుగు టైటాన్స్ ఫ్రాంచైజీ రాహుల్‌ను కాదని నితేశ్ సాలుంకే, మోసెన్ (ఇరాన్)లను రిటెయిన్ చేసుకుంది. -
తెలుగు టైటాన్స్ ఘనవిజయం
చెన్నై: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు ఓ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు 58–37 స్కోరుతో తమిళ్ తలైవాస్‌పై జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టును ఏకంగా నాలుగు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. రైడర్లు రాహుల్ చౌదరి (16), మోసిన్ (12), నీలేశ్ సాలుంకే (11) చెలరేగారు. దీంతో రైడింగ్‌లోనే జట్టు 36 పాయింట్లు సంపాదించింది. టాకిల్‌లో మరో 11 పాయింట్లు వచ్చాయి. తమిళ్ తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ (20) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో డాంగ్ జియోన్ లీ 5, ప్రపంజన్ 4 పాయింట్లు చేశారు. జోన్ ‘బి’లో 20 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కు ఇది ఏడో గెలుపు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అంతకుముందు జరిగిన తొలి పోరులో గుజరాత్ ఫార్చూన్‌జెయింట్స్ 42–22 స్కోరుతో దబంగ్ ఢిల్లీపై ఘనవిజయం సాధించింది. గుజరాత్ రైడర్లు సచిన్ (11), చంద్రన్ రంజీత్ (9) రాణించారు. వరుసగా పాయింట్లు తెచ్చిపెట్టారు. రాకేశ్ నర్వాల్, సునీల్ కుమార్ చెరో 6 పాయింట్లు సాధించారు. ఢిల్లీ జట్టు తరఫున అబొల్ ఫజల్ 7, శ్రీరామ్ 6 పాయింట్లు చేశారు. మొత్తం 11 విజయాలతో గుజరాత్ జోన్ ‘ఎ’లో అగ్రస్థానంలో నిలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్‌తో యూపీ యోధ తలపడతాయి. -
చివర్లో టైటాన్స్ తడబాటు
సోనెపట్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా తెలుగు టైటాన్స్ జట్టు ప్రదర్శన ఓ విజయం... అంతలోనే పరాజయం అన్నట్టుగా సాగుతోంది. మంగళవారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో తడబాటుకు గురై తగిన మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా టైటాన్స్ జట్టు 30–20 పాయింట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయితే ఆ తర్వాత ఆటతీరు ఒక్కసారిగా గతి తప్పడంతో మరో ఐదు నిమిషాల వరకు కూడా ఒక్క పాయింట్ సాధించలేకపోయింది. అటు బెంగాల్ ఒక్కసారిగా జోరు పెంచడంతో చివరికి టైటాన్స్ 31–32 తేడాతో ఓడాల్సి వచ్చింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (4 పాయింట్లు) విఫలం కాగా... నీలేశ్ సలుంకే అత్యధికంగా 10 రైడింగ్ పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ విజయంలో జంగ్ కున్ లీ (9 పాయింట్లు) కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 27–24 తేడాతో దబంగ్ ఢిల్లీని ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యూపీ యోధ; హరియాణా స్టీలర్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
టైటాన్స్ గెలిచిందోచ్
లక్నో: ప్రొ కబడ్డీ లీగ్‌లో 8 మ్యాచ్‌ల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో నెగ్గిన టైటాన్స్... ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఇందులో ఏడింట ఓడిపోగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. తాజాగా శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 37–32 స్కోరుతో యు ముంబాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండర్ సోంబిర్ ప్రత్యర్థి రైడర్లను వణికించాడు. 8 టాకిల్ పాయింట్లు సాధించాడు. రైడింగ్‌లో రాహుల్ చౌదరి అదరగొట్టాడు. 20 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను 13 పాయింట్లు చేశాడు. వీరిద్దరి ప్రతిభతో టైటాన్స్ జట్టు యు ముంబాను రెండు సార్లు ఆలౌట్ చేసింది. మిగతా వారిలో నీలేశ్ సాలుంకే, విశాల్ భరద్వాజ్ చెరో 3 పాయింట్లు సాధించారు. యు ముంబా జట్టులో రైడర్ అనూప్ కుమార్ (9) రాణించాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 36–29తో యూపీ యోధ జట్టుపై విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్, యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. ‘స్టార్ స్పోర్ట్స్–2’ చానల్ ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
తెలుగు టైటాన్స్ తడాఖా
* బెంగళూరు బుల్స్‌పై విజయం * ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: రైడింగ్‌తోపాటు డిఫెన్స్‌లోనూ రాణించిన తెలుగు టైటాన్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు బుల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 32-24 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాహుల్ చౌదరి తొమ్మిది రైడింగ్ పాయింట్లు సంపాదించగా... సందీప్ నర్వాల్ ఐదు ట్యాకిల్ పాయింట్లు సాధించి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన పోటీలో బెంగళూరు చేతిలో ఓడిన టైటాన్స్ జట్టు... బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఓడించి లెక్క సరిచేసింది. ప్రస్తుతం టైటాన్స్ జట్టు 24 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మ్యాచ్ రెండో నిమిషంలో రాహుల్ చౌదరీ రైడింగ్‌కు వెళ్లి విజయవంతంగా తిరిగి రావడంతో టైటాన్స్ పాయింట్ల బోణీ చేసింది. నాలుగో నిమిషంలో తాడోపేడో తేల్చుకోవాల్సిన రైడింగ్‌లో నీలేశ్ సాలూంకే సఫలం కావడంతో టైటాన్స్ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఏడు నిమిషాలు పూర్తయ్యే సమయానికి బెంగళూరు జట్టులో ఒక్కరే కోర్టులో నిలిచాడు. ఆ వెంటనే టైటాన్స్ ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో 10-1తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత టైటాన్స్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ నిలకడగా పాయింట్లు సాధించింది. విరామ సమయానికి టైటాన్స్ 16-10తో ముందంజలో ఉంది. రెండో అర్ధభాగంలోనూ టైటాన్స్ ఆటగాళ్ల జోరు కొనసాగడంతో బెంగళూరు బుల్స్ తేరుకోలేకపోయింది. బెంగాల్ వారియర్స్, పుణెరి పల్టన్ల మధ్య జరిగిన మ్యాచ్ 34-34 పాయింట్ల వద్ద టైగా ముగిసింది. బుధవారం జరిగే ఏకైక మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడుతుంది. -
తెలుగు టైటాన్స్‌కు రెండో ఓటమి
జైపూర్ చేతిలో పరాజయం ప్రొ కబడ్డీ లీగ్ జైపూర్: ఆరంభంలో నిలకడగా ఆడినా.. చివర్లో నిరాశపర్చిన తెలుగు టైటాన్స్ జట్టు... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 28-24తో టైటాన్స్‌పై గెలిచింది. దీంతో టైటాన్స్ జట్టు రెండు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. జైపూర్ తరఫున రాజేశ్ నర్వాల్ (8 పాయింట్లు) అత్యధిక పాయింట్లు సాధించగా, జస్వీర్ సింగ్, అమిత్ హుడా తలా మూడు పాయింట్లు తెచ్చారు. మహిపాల్ నర్వాల్ రెండు ట్యాకిల్ పాయింట్లతో రాణించాడు. టైటాన్స్ టీమ్‌లో సందీప్ నర్వాల్ (6), వినోత్ కుమార్ (4), నీలేశ్ (4) రాణించగా, వినోద్ (3) ఒక్కడే క్యాచింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36-34తో యు ముంబాపై నెగ్గింది. పట్నా ఆటగాడు ప్రదీప్ నర్వాల్ 18 రైడింగ్ పాయింట్లు సాధించగా, కుల్దీప్ సింగ్ (5), బాజీరావ్ (4)లు ట్యాకిల్‌లో అదరగొట్టారు. యు ముంబా తరఫున రిషాంక్ దేవడిగా (11), అనూప్ కుమార్ (6), సుర్జీత్ (3), రాకేశ్ (3), సునీల్ కుమార్ (3)లు ఆకట్టుకున్నారు. గురువారం జరిగే ఏకైక మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడుతుంది. -
కూతకు వేళాయె
► నేటినుంచి ప్రొ కబడ్డీ లీగ్ ► సీజన్-4 వేలంతో మారిన ఆటగాళ్లు ► జూలై 31న హైదరాబాద్‌లో ఫైనల్ తొలి ఏడాది సక్సెస్... కొన్ని సార్లు టీవీ రేటింగ్‌లు ఐపీఎల్ మ్యాచ్‌ల స్థాయిలో ఉన్నాయి. రెండో సంవత్సరం సూపర్ సక్సెస్... కబడ్డీ గురించి తెలియనివారు కూడా ఒక్కసారిగా ఇదేదో చూసేద్దాం అనే ఆసక్తి చూపించారు. అదే ఉత్సాహంలో మూడో సీజన్‌ను కూడా జనం మెచ్చేశారు... ఇక ప్రొ కబడ్డీ భారత అభిమానుల స్పోర్ట్స్ మెనూలో భాగమైపోయింది. అంతే... మీ ఆదరణ ఉంటే ఏడాదికి రెండుసార్లు అంటూ నిర్వాహకులు సిద్ధమయ్యారు. అటు నగరాలను, ఇటు గ్రామాలను ఏకకాలంలో అలరించిన ఫలితమే... ఇప్పుడు 2016లో రెండోసారి ప్రొ కబడ్డీ లీగ్. కొత్త జట్లకు మారిన ఆటగాళ్లు నాలుగో సీజన్లో ‘అస్లీ పంగా’ అంటూ తొడకొట్టేందుకు సిద్ధమైపోయారు. ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సీజన్-4లో భాగంగా నేటి (శనివారం) నుంచి మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌లో పుణేరీ పల్టన్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుండగా, మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబై అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మూడు సీజన్లలాగే ఈ సారి కూడా ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లతో పాటు నాలుగు నాకౌట్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. పుణే మినహా మిగతా ఏడు జట్లకు చెందిన నగరాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. జూలై 29న సెమీ ఫైనల్, జూలై 31న ఫైనల్ మ్యాచ్‌లకు హైదరాబాద్ వేదిక కానుంది. రూ. 12.82 కోట్లతో... ఐపీఎల్ తరహాలోనే ప్రొ కబడ్డీ లీగ్‌లో కూడా మూడు సీజన్ల తర్వాత ఆటగాళ్ల కోసం గత నెలలో మళ్లీ వేలం నిర్వహించారు. ప్రతీ జట్టు ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం కల్పించారు. వేలంలో 198 మంది ఆటగాళ్లు పోటీ పడగా, 96 మందిని ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరికి చెల్లించిన మొత్తం రూ. 12.82 కోట్లు. అత్యధికంగా మంజీత్ ఛిల్లర్ కోసం బెంగళూరు బుల్స్ రూ. 53 లక్షలు వెచ్చించింది. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఫజెల్ అత్రాచలి (ఇరాన్)కు రూ. 38 లక్షలు దక్కాయి. డిఫెన్స్ సర్వీసెస్‌లో పని చేస్తున్న 15 మంది సైనికులు లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిభాన్వేషణలో భాగంగా ప్రతీ జట్టు గతంలో లీగ్ ఆడిన అనుభవం లేని 18-22 ఏళ్ల వయసు గల ముగ్గురు యువ ఆటగాళ్లను కూడా ఎంచుకున్నాయి. పెరుగుతున్న ఆదరణ ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈసారి భారత్‌తో పాటు 12 దేశాలకు చెందిన 24 మంది ఆటగాళ్లు పాల్గొంటుండటం విశేషం. వీటిలో కెన్యా, జపాన్, ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇద్దరు పాకిస్తానీలు తెలుగు టైటాన్స్ టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. మూడు సీజన్లలో టీవీ రేటింగ్‌ను అంతకంతకూ పెంచుకున్న ఈ లీగ్ నాలుగో సీజన్‌ను దాదాపు వంద దేశాల్లో ప్రసారం చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. టైటాన్స్ టైటిల్ కల! ప్రొ కబడ్డీ లీగ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న టైటాన్స్ జట్టు గత మూడు ప్రయత్నాల్లోనూ ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. హైదరాబాద్‌లో జరిగిన 2015 సీజన్లో మెరుగ్గా రాణించిన జట్టు మూడో స్థానంలో నిలిచింది. తొలి ఏడాది, ఆ తర్వాత మూడో సీజన్లో మాత్రం ఐదో స్థానంతోనే సరిపెట్టుకుంది. రాహుల్ చౌదరి రూపంలో స్టార్ ప్లేయర్ జట్టులో ఉండగా, సుకేశ్ హెగ్డే మరో కీలక ఆటగాడు. ఈ సారి సందీప్ నర్వాల్, జస్మీర్ సింగ్‌లను తీసుకోవడంతో టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. మూడు సీజన్లలో కలిపి 44 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 22 గెలిచి 16 ఓడింది. మరో 6 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. ఈసారి జట్టు తొలి లక్ష్యం సెమీ ఫైనల్ చేరుకోవడం. హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని జట్టు... సెమీస్ చేరితే సొంతగడ్డపై విజయావకాశాలుంటాయి. తెలుగు టైటాన్స్ జట్టు: రాహుల్ చౌదరి (కెప్టెన్), సుకేశ్ హెగ్డే, సందీప్ నర్వాల్, సందీప్ ధుల్, జస్మేర్ సింగ్ గులియా, రూపేశ్ తోమర్, వినోద్ కుమార్, ప్రపంజన్, నీలేశ్ సాలుంకే, వినోత్ కుమార్, శశాంక్ వాంఖడే, సాగర్ కృష్ణ, విశాల్ భరద్వాజ్, అతుల్, సోంబిర్ గులియా (భారత్), మొహమ్మద్ మగ్సూద్ (ఇరాన్), అఖ్లాఖ్ హుస్సేన్, మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్). -
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్‌లో సొంతగడ్డపై తమ పోరాటాన్ని తెలుగు టైటాన్స్ జట్టు ఓటమితో ముగించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 17-25 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో విశాఖపట్నంలో ప్రొ కబడ్డీ లీగ్ దశ పోటీలు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో ఓడిపోయి... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్నట్లు కనిపించిన టైటాన్స్ జట్టుకు బెంగాల్ జట్టు షాక్ ఇచ్చింది. దాంతో టైటాన్స్ సొంతగడ్డపై ‘హ్యాట్రిక్’ విజయాలను నమోదు చేయడంలో విఫలమైంది. తొలి అర్ధభాగంలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఫలితంగా విరామ సమయానికి రెండు జట్లు 9-9తో సమఉజ్జీగా నిలిచాయి. రెండో అర్ధభాగం తొలి ఐదు నిమిషాల్లోనూ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. స్కోరు 14-14తో సమంగా ఉన్న దశలో బెం గాల్ జట్టు వరుసగా మూడు పాయింట్లు సాధించి 17-14తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇదే జోరును కనబరిచిన బెంగాల్ నిలకడగా రాణించి విజ యాన్ని ఖాయం చేసుకుంది. టైటాన్స్ జట్టు లో రోహిత్ బలియాన్, రాహుల్ చౌదరీ నాలుగేసి పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ జట్టులో నితిన్ తోమర్ ఆరు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... గిరీవ్ మారుతి ఐదు పాయింట్లు... నీలేశ్ షిండే, మహేశ్ గౌడ్, మహేంద్ర గణేశ్ రాజ్‌పుత్ మూడేసి పాయింట్లు సాధించారు. బుధవారం బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్; దబంగ్ ఢిల్లీతో పుణేరి పల్టన్ తలపడతాయి. -
టైటాన్స్ ఘనవిజయం
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై అద్భుత ఆటతీరు కనబరిచిన తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఢిల్లీ దబంగ్ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 45-34 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 26-10తో 16 పాయింట్ల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో అర్ధభాగంలోనూ టైటాన్స్ తమ జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. టైటాన్స్ జట్టులో కెప్టెన్ రాహుల్ చౌదరీ, రోహిత్ బలియాన్ 11 పాయింట్ల చొప్పున సాధించి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఢిల్లీ జట్టులో కాశీలింగ్ 12 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 10 పాయింట్లు స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 29-28తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. ప్రొ కబడ్డీ లీగ్ తెలుగు టైటాన్స్ X బెంగాల్ వారియర్స్ వేదిక: విశాఖపట్నం రాత్రి గం. 8.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
టైటాన్స్‌కు తొలి గెలుపు
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు బోణీ చేసింది. చివరి సెకను వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 27-26తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. మేరాజ్ షేక్, మనోజ్ కుమార్ చెరో ఐదు పాయింట్లు సాధించారు. రాహుల్ చౌదురి మూడు రైడింగ్ పాయింట్లు సంపాదించాడు. పుణేరి జట్టులో మంజిత్ చిల్లర్ ఒక్కడే ఏడు పాయింట్లు తేవడం విశేషం. ఆఖర్లో స్కోరు 26-26తో సమమైన తర్వాత చివరి రైడింగ్ వెళ్లిన రాహుల్ చౌదురి ఊహించని రీతిలో పాయింట్ కొల్లగొట్టాడు. మరో మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ 27-18తో యు ముంబాపై నెగ్గింది. -
‘భళ్లాల’ కూత...
ప్రొ కబడ్డీ లీగ్ అంబాసిడర్‌గా రానా సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ మూడో సీజన్‌కు సినీ నటుడు దగ్గుబాటి రానా ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. టాలీవుడ్‌తో పాటు ఇటీవల ‘బాహుబలి’ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్న రానాను తమ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరిగా ఎంచుకున్నట్లు స్టార్ గ్రూప్ ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో రానాతో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. లీగ్‌లో భాగమైన తెలుగు టైటాన్స్ జట్టు ప్రచార వీడియోలో కూడా రానా నటించాడు. ‘గ్రామీణ క్రీడగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న కబడ్డీని సినిమాల్లోనే ఎక్కువగా చూశాం. ఈ స్థాయికి క్రీడ ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రొ కబడ్డీ విజయవంతం కావడం సంతోషకరం. ఈ లీగ్‌లో భాగం అయినందుకు గర్వపడుతున్నా’ అని రానా వ్యాఖ్యానించాడు. తొలి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీ లీగ్ చూసే టీవీ ప్రేక్షకుల సంఖ్య నాలుగు రెట్లు కావడం ఈ ప్రాంతాల్లో లీగ్‌కు ఉన్న ఆదరణను సూచిస్తోందని, వైజాగ్‌లోనూ అదే స్పందనను ఆశిస్తున్నట్లు స్టార్ గ్రూప్ ప్రతినిధి అనుపమ్ గోస్వామి వెల్లడించారు. ఈ నెల 30న విశాఖపట్నంలో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమవుతుంది. మార్చి 5న ఢిల్లీలో ఫైనల్ నిర్వహిస్తారు. -
తెలుగు టైటాన్స్ పరాజయం
బెంగళూరు : ప్రొ కబడ్డీ లీగ్-2లో తెలుగు టైటాన్స్ జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. బెంగళూరు బుల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-43 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ జట్టు ఏడు విజయాలు నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడి, మరో మూడింటిని ‘డ్రా’ చేసుకొని మొత్తం 45 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు నిరుటి రన్నరప్ యు ముంబా తమ జోరు కొనసాగిస్తోంది. పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 32-27తో నెగ్గి ఈ సీజన్లో 11వ విజయాన్ని తమ ఖాతాలో జమచేసుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో ఢిల్లీ దబంగ్; జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
సెమీస్‌కు చేరువలో...
తెలుగు టైటాన్స్‌కు ఏడో విజయం ♦ 22 పాయింట్లతో పట్నా చిత్తు ♦ బెంగాల్‌పై బెంగళూరు విజయం సాక్షి, హైదరాబాద్ : సొంతగడ్డపై చెలరేగిన తెలుగు టైటాన్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్‌కు చేరువైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 54-32 స్కోరుతో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది. పట్నాను టైటాన్స్ ఏకంగా నాలుగుసార్లు ఆలౌట్ చేయడం విశేషం. అలాగే ఈ సీజన్లో తొలిసారి 50 పాయింట్లు చేసిన జట్టుగా టైటాన్స్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 10 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 39 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. సూపర్ కెప్టెన్: టాస్ గెలిచిన తెలుగు టైటాన్స్ కోర్టును ఎంచుకుంది. ఆరంభంలో రాహుల్, దీపక్ రైడింగ్‌తో టైటాన్స్ వరుస పాయింట్లు సాధించి 5-0తో ఆధిక్యంలో నిలిచింది. సురేశ్ కుమార్ సూపర్ ట్యాకిల్‌తో పైరేట్స్ పాయింట్ల బోణీ చేసింది. అయితే ఆ తర్వాత డిఫెన్స్‌లోనూ అద్భుతంగా రాణించడంతో టైటాన్స్ జట్టుకు తిరుగు లేకుండా పోయింది. తొలి పది నిమిషాల్లోనే ప్రత్యర్థిని టైటాన్స్ రెండు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. 17వ నిమిషంలో తెలుగు కెప్టెన్ మిరాజ్ సూపర్ రైడ్‌తో అద్భుతం చేశాడు. అతను ఈ రైడ్‌లో ఏకంగా 4 పాయింట్లు కొల్లగొట్టాడు. ఆ వెంటనే పట్నా మూడోసారి ఆలౌట్ అయింది. 20వ నిమిషంలో మిరాజ్ మళ్లీ చెలరేగి ఇంకో సూపర్ రైడ్‌తో సత్తా చాటాడు. ఈ సారి కూడా అతను 4 పాయింట్లతో తిరిగి రావడంతో తొలి అర్ధ భాగం ముగిసే సరికి టైటాన్స్ 38-12తో ఆధిక్యంలో నిలిచింది. కాస్త తడబాటు: రెండో అర్ధ భాగం రెండో నిమిషంలోనే టైటాన్స్ మళ్లీ చెలరేగింది. నాలుగో సారి పైరేట్స్‌ను ఆలౌట్ చేసి ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. అయితే ఈ దశలో పట్నా కోలుకునే ప్రయత్నం చేసింది. భారీ ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ కాస్త ఉదాసీనత ప్రదర్శించడంతో 33వ నిమిషంలో తెలుగు జట్టు ఆలౌట్ అయింది. అయితే ఆలౌట్ తర్వాత టైటాన్స్ మరో అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడటంతో మరో విజయం జట్టు ఖాతాలో చేరింది. బెంగాల్‌కు మరో పరాజయం: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం జరిగిన మొదటి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33-22 స్కోరుతో బెంగాల్‌ను ఓడించింది. తొలి అర్ధ భాగంలో 16-10తో ముందంజ వేసిన బెంగళూరు చివరి వరకు ఆధిక్యం నిలబెట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు జైపూర్ పింక్ పాంథర్స్ x యు ముంబా రా. గం. 8 నుంచి తెలుగు టైటాన్స్ x పుణెరి పల్టాన్ రా. గం. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్ 2 లో ప్రత్యక్ష ప్రసారం -
తొడకొట్టిన టైటాన్స్
♦ సత్తా చాటిన తెలుగు జట్టు ♦ బెంగాల్ వారియర్స్‌పై ఘన విజయం ♦ ప్రొ కబడ్డీ లీగ్ సాక్షి, హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు సొంతగడ్డపై రెండో రోజు అద్భుతంగా ఆడి అలరించింది. ఏకపక్షంగా సాగిన పోరులో 16 పాయింట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 44-28తో బెంగాల్ వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల విరామం తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆది నుంచి దూకుడుగా: టాస్ గెలిచిన బెంగాల్ కోర్టును ఎంచుకుంది. ఆరంభంనుంచే దూకుడు ప్రదర్శించిన టైటాన్స్ వరుసగా పాయింట్లు సాధించి ఒక దశలో 7-1తో ముందంజ వేసింది. ఆ తర్వాత కూడా రాహుల్, దీపక్ రైడింగ్‌లో చెలరేగడంతో టైటాన్స్ జోరు ఎక్కడా తగ్గలేదు. మరో వైపు బెంగాల్ పదే పదే సబ్స్టిట్యూట్లను మార్చినా ఫలితం రాబట్టలేకపోయింది. ఆరో నిమిషంలోనే టైటాన్స్ తొలి ఆలౌట్ నమోదు చేసింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి తెలుగు టీమ్ 27-9తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. తొలి అర్ధ భాగంలోనే ప్రత్యర్థిని టైటాన్స్ రెండు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. చెలరేగిన మహేంద్ర: రెండో అర్ధభాగంలో వారియర్స్ కోలుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జంగ్ కున్ లీ, మహేంద్ర గణేశ్ వరుస పాయింట్లు రాబట్టగా, విజిన్ సూపర్ ట్యాకిల్‌తో బెంగాల్ పుంజుకుంది. మరో వైపు రాహుల్ చౌదరి 35వ నిమిషంలో ఒకే రైడ్‌లో 3 పాయింట్లు రాబట్టగా... దీపక్, సుకేశ్ రాణించడంతో తెలుగు టీమ్‌కు సమస్య లేకుండా పోయింది. తారల సందడి హైదరాబాద్‌లో రెండో రోజు కబడ్డీ మ్యాచ్‌లకు భారీగా తారలు తరలివచ్చారు. వెంకటేశ్, మంచు లక్ష్మీ తొడగొట్టారు. అల్లరి నరేశ్‌తో పాటు పలువురు సినీ నటులు వచ్చారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు సింధు, కశ్యప్, శ్రీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు బెంగాల్ వారియర్స్ ఁ బెంగళూరు బుల్స్ రాత్రి గం. 8.00 నుంచి తెలుగు టైటాన్స్ ఁ పట్నా పైరేట్స్ రాత్రి గం. 9.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
జైపూర్‌కు తెలుగు టైటాన్స్ షాక్
ప్రొ కబడ్డీ లీగ్-2 జైపూర్: గతేడాది రన్నరప్ యు ముంబా చేతిలో ఆదివారం రాత్రి ఒక పాయింట్ తేడాతో ఎదురైన ఓటమి నుంచి తెలుగు టైటాన్స్ జట్టు వెంటనే తేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌తో సోమవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ అద్వితీయ ఆటతీరును ప్రదర్శించి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. రైడింగ్‌లోనూ, డిఫెన్స్‌లోనూ తిరుగులేని విధంగా రాణించిన తెలుగు టైటాన్స్ జట్టు 33-22 పాయింట్ల తేడాతో జైపూర్‌ను చిత్తుగా ఓడించి నాలుగో విజయాన్ని దక్కించుకుంది. ఈ ఫలితంతో జైపూర్ ఖాతాలో వరుసగా నాలుగో ఓటమి చేరింది. రైడింగ్‌లో రాహుల్ చౌదరీ, దీపక్ హుడా, సుకేశ్ హెగ్డే చాకచక్యంగా వ్యవహరించి జైపూర్ ఆటగాళ్లను బోల్తా కొట్టించి నిలకడగా పాయింట్లు చేశారు. రాహుల్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... సుకేశ్ ఏడు, దీపక్ ఆరు, ప్రసాద్ మూడు పాయింట్లు సంపాదించారు. విరామ సమయానికి 8-7తో ఒక పాయింట్ ఆధిక్యంలోనే ఉన్న తెలుగు టైటాన్స్ రెండో అర్ధభాగంలో చెలరేగిపోయింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33-18తో ఢిల్లీ దబాంగ్ జట్టును ఓడించింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన బెంగళూరు విరామ సమయానికి 17-8తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. రెండో అర్ధభాగంలోనూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని బెంగళూరు తమ ఖాతాలో మూడో విజయాన్ని జమచేసుకుంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడుతుంది.