టైటాన్స్‌కు తొలి గెలుపు
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు బోణీ చేసింది. చివరి సెకను వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 27-26తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. మేరాజ్ షేక్, మనోజ్ కుమార్ చెరో ఐదు పాయింట్లు సాధించారు. రాహుల్ చౌదురి మూడు రైడింగ్ పాయింట్లు సంపాదించాడు. పుణేరి జట్టులో మంజిత్ చిల్లర్ ఒక్కడే ఏడు పాయింట్లు తేవడం విశేషం. ఆఖర్లో స్కోరు 26-26తో సమమైన తర్వాత చివరి రైడింగ్ వెళ్లిన రాహుల్ చౌదురి ఊహించని రీతిలో పాయింట్ కొల్లగొట్టాడు. మరో మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ 27-18తో యు ముంబాపై నెగ్గింది.