ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆరో సీజన్ కోసం రెండు రోజుల పాటు నిర్వహించిన వేలం గురువారంతో ముగిసింది. రెండోరోజూ వేలంలో ఫ్రాంచై జీలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లపై దృష్టి సారించాయి. కృష్ణా జిల్లా క్రీడాకారుడు చందన మనోజ్ కుమార్, హైదరాబాద్ ప్లేయర్ మహేందర్ రెడ్డిలకు తొలిసారిగా ప్రొ కబడ్డీ లీగ్‌లో చోటు దక్కిం ది. తెలుగు టైటాన్స్ యాజమాన్యం వీరిద్దరినీ చెరో రూ. 8 లక్షలకు (సి కేటగిరీ) దక్కించుకుంది. ఓవరా ల్‌గా 12 ఫ్రాంచైజీలు రూ. 45.93 కోట్లు వెచ్చించి 181 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. తెలుగు టైటాన్స్ జట్టు రూ. 3.98 కోట్లు ఖర్చుచేసి 18 మంది ఆటగాళ్లను సొంతం చేసుకుంది.
ప్రశాంత్ కుమార్‌కు రూ. 79 లక్షలు
తొలిరోజు స్టార్ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించిన యజమానులు... రెండోరోజు వేలంలో రెండో శ్రేణికి చెందిన ‘బి’ కేటగిరీ, తదుపరి స్థాయి ‘సి’, ‘డి’ కేటగిరీ ప్లేయర్లను కొనుగోలు చేశాయి. యూపీ యోధ జట్టు, రైడర్ ప్రశాంత్ కుమార్ రాయ్‌ని రూ. 79 లక్షలకు చేజిక్కించుకుంది. దీంతో పీకేఎల్ ‘బి’ కేటగిరీలో అత్యధిక మొత్తం దక్కించుకున్న క్రీడాకారుడిగా ప్రశాంత్ ఘనతకెక్కాడు. అతని తర్వాత చంద్రన్ రంజిత్ (రూ. 61.25 లక్షలు– దబంగ్ ఢిల్లీ), వికాస్ ఖండోలా (రూ. 47 లక్షలు– హరియాణా స్టీలర్స్)లు పెద్ద మొత్తాలను దక్కించుకున్నారు. తెలుగు టైటాన్స్ జట్టు: రాహుల్ చౌదరి (రూ. 1.29 కోట్లు), నీలేశ్ సాలుంకే (రూ. 56.8 లక్షలు), మోసీన్ జఫారి (రూ. 24.5 లక్షలు), రక్షిత్ (రూ. 6.60 లక్షలు), సోమ్‌బీర్ (రూ. 6.60 లక్షలు), విశాల్ భరద్వాజ్ (రూ. 6.60 లక్షలు), రజ్‌నీశ్ (రూ. 6.60 లక్షలు), అంకిత్ బెనివాల్ (రూ. 6.60 లక్షలు), కమల్ సింగ్ (రూ. 6.60 లక్షలు), అబోజర్ మోహజెర్మింగని (రూ. 76 లక్షలు), ఫర్హాద్ రహిమి మిలాగర్డన్ (రూ. 21.5 లక్షలు), సి. మనోజ్ కుమార్ (రూ. 8 లక్షలు), సంకేత్ చవాన్ (రూ. 8 లక్షలు), ఆర్మాన్ (రూ. 5 లక్షలు), అనూజ్ కుమార్ (రూ. 5 లక్షలు), దీపక్ (రూ. 5 లక్షలు), రాకేశ్ సింగ్ కుమార్ (రూ. 12 లక్షలు), మహేందర్ రెడ్డి (రూ. 8 లక్షలు).
టైటాన్స్‌కు మనోజ్, మహేందర్
Published Fri, Jun 1 2018 1:52 AM | Last Updated on Fri, Jun 1 2018 1:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment