
ధరూరు: ప్రో కబడ్డీ పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావాసి ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న ప్రో కబడ్డీ పోటీల్లో తెలుగు టైటాన్స్ జట్టు తరఫున జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని భీంపురం గ్రామానికి చెందిన గాళ్ల రాజురెడ్డి బరిలోకి దిగనున్నాడు.
తెలుగు టైటాన్స్ జట్టుకు నడిగడ్డ ప్రాంతానికి చెందిన యువకుడు ఎంపికవడంపై ఉమ్మడిజిల్లావ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంత కబడ్డీ ఆటగాళ్లతోపాటు అసోసియేషన్ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే జట్టుకు రాజురెడ్డి ఎంపికవడం జిల్లాకే గర్వకారణమని సామాజిక కార్యకర్త సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. పోటీల్లో బాగా రాణించి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రాజురెడ్డిని పలువురు అభినందించారు.
చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు
Comments
Please login to add a commentAdd a comment