Pro Kabbadi League
-
Pro Kabaddi League 2021: ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: చివరి సెకనులో నవీన్ కుమార్ రెయిడింగ్‌కు వెళ్లి పాయింట్‌తో తిరిగి రావడంతో... గుజరాత్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌ను దబంగ్ ఢిల్లీ జట్టు 24–24తో ‘టై’గా ముగించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ రెయిడర్ నవీన్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 36–35తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యు ముంబా; యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
డిసెంబర్లో ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 2021 ప్రారంభం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ డిసెంబర్ 22 నుంచి మొదలుకానుంది. అయితే మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎనిమిదో సీజన్ ఒకే ఒక వేదికలో నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌లన్నీ బెంగళూరులోనే నిర్వహిస్తామని లీగ్ కమిషనర్, మశాల్ స్పోర్ట్స్ సీఈఓ అనుపమ్ గోస్వామి తెలిపారు. గతేడాది వైరస్ భయాందోళనల నేపథ్యంలో ఈవెంట్‌ను రద్దు చేశారు. పీకేఎల్–7 చివరిసారిగా 2019లో జరగ్గా బెంగాల్ వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. -
ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?
ధరూరు: ప్రో కబడ్డీ పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావాసి ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న ప్రో కబడ్డీ పోటీల్లో తెలుగు టైటాన్స్ జట్టు తరఫున జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని భీంపురం గ్రామానికి చెందిన గాళ్ల రాజురెడ్డి బరిలోకి దిగనున్నాడు. తెలుగు టైటాన్స్ జట్టుకు నడిగడ్డ ప్రాంతానికి చెందిన యువకుడు ఎంపికవడంపై ఉమ్మడిజిల్లావ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంత కబడ్డీ ఆటగాళ్లతోపాటు అసోసియేషన్ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే జట్టుకు రాజురెడ్డి ఎంపికవడం జిల్లాకే గర్వకారణమని సామాజిక కార్యకర్త సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. పోటీల్లో బాగా రాణించి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రాజురెడ్డిని పలువురు అభినందించారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
గౌరవంగా భావిస్తున్నా : కమల్
ఇన్నాళ్లు ప్రచార కర్తగా వ్యవహరించేందుకు అంగీకరించని కమల్ హాసన్ ఇటీవల కాలంలో మనసు మార్చుకున్నాడు. పలు ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరించటంతో పాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం కమల్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తమిళ వర్షన్ ప్రసారం అవుతుండగా మరో కార్యక్రమం ద్వారా బుల్లితెరపై అలరించేందుకు రెడీ అవుతున్నాడు లోకనాయకుడు. తొలిసారిగా ప్రో కబడ్డి లీగ్ లో బరిలో దిగుతున్న తమిళ తలైవార్స్ టీంకు కమల్ హాసన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కమల్, కబడ్డీ టీం కోసం పనిచేయటం గౌరవంగా భావిస్తున్నానన్నారు. మన పూర్వీకుల ఆటను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు తన వంతు సాయం చేస్తానన్నారు. ఈ నెల 28 నుంచి ప్రొకబడ్డీ లీగ్ ప్రసారం కానుంది. -
సన్నీ లియోన్ పై పోలీసు ఫిర్యాదు
-
సన్నీ లియోన్ పై పోలీసు ఫిర్యాదు
న్యూఢిల్లీ: బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ జాతీయ గీతాన్ని అవమానించారంటూ ఢిల్లీ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు నమోదయింది. ప్రో కబడ్డీ లీగ్స్ లో భాగంగా గురువారం ముంబైలో జరిగిన ఓ మ్యాచ్ కు హాజరైన సన్నీ లియోన్.. మ్యాచ్ ప్రారంభానికి ముందు 'జనగణమన..'ను ఆలపించారు. అయితే పదాలు పలకడం దగ్గర్నుంచి, రాగం ఆలపించడం వరకు ఆమె పొరపాట్లు చేశారని, తద్వారా జాతీయ గీతాన్ని అవమానించారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ప్రో కబడ్డీ లీగ్స్ లో జాతీయ గీతాలాపనపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. గత సీజన్ లో ఓ మ్యాచ్ సందర్భంగా బిగ్ బి అమితాబ్ జనగణమన ను సరిగా ఆలపించలేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గురువారం ముంబైలో జాతీయ గీతాలపన సందర్భంలో సన్నీ లియోన్ ఉద్వేగానికి గురయ్యారు. భారత జాతీయ గీతం పాడటాన్ని గర్వంగా భావిస్తున్నట్లు, అసలీ అవకాశం లభిస్తుందని ఎన్నడూ అనుకోలేదని ఆమె చెప్పారు. తన తండ్రి కూడా కబడ్డీ అభిమాని అని, చిన్నప్పుడు కబడ్డీ ఆడేలా ప్రోత్సహించారని, వ్యక్తిగతంగా ఆ ఆటపై మక్కువలేక పోవడంతో కబడ్డీ నేర్చుకోలేకపోయానని సన్నీ చెప్పుకొచ్చారు. ఇక ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా ఇంకా తెలియరాలేదు. -
కార్పొరేట్ల కబడ్డీ కబడ్డీ ప్రారంభం
-
కార్పొరేట్ల కబడ్డీ కబడ్డీ..!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్, హాకీ లీగ్, బ్యాడ్మింటన్ లీగ్ మొదలైన వాటి తర్వాత కార్పొరేట్లు ప్రస్తుతం కబడ్డీపై దృష్టి సారించారు. ఐపీఎల్ క్రికెట్ తరహాలోనే ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)కి శ్రీకారం చుట్టారు. కిషోర్ బియానీ మొదలుకుని రోనీ స్క్రూవాలా వ్యాపార దిగ్గజాలు దేశవాళీ కబడ్డీని ప్రోత్సహించే ప్రయత్నాల్లో పడ్డారు. ఇటీవలే జరిగిన పీకేఎల్ తొలి విడత వేలంలో కార్పొరేట్లు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా పోటీపడ్డారు. భారీ మొత్తాలు వెచ్చించి జాతీయ స్థాయి ఆటగాళ్లను దక్కించుకున్నారు. వేలంలో మొత్తం 96 మంది ప్లేయర్స్ కోసం ఎనిమిది టీమ్స్ పోటీపడ్డాయి. ఈ టీమ్‌లలో కోర్ గ్రీన్ గ్రూప్‌నకు చెందిన విశాఖపట్నం జట్టు, ఉదయ్ కోటక్ సారథ్యంలోని పుణే ఫ్రాంచైజీ, కాస్మిక్ గ్లోబల్ మీడియా నేతృత్వంలోని బెంగళూరు, యస్ బ్యాంక్ ఎండీ రాణా కపూర్ కుమార్తె రాధా కపూర్‌కి చెందిన ఢిల్లీ ఫ్రాంచైజీ, రోనీ స్క్రూవాలా సారథ్యంలోని ముంబై జట్టు ఉన్నాయి. అభిషేక్ బచ్చన్‌కి చెందిన జైపూర్ టీమ్, ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీకి చెందిన కోల్‌కతా ఫ్రాంచైజీ, వ్యాపారవేత్త రాజేష్ షా టీమ్‌లు కూడా వేలంలో పాల్గొన్నాయి. కామెంటేటర్ చారు శర్మ సారథ్యంలోని మషాల్ స్పోర్ట్స్ సంస్థ ఈ కాన్సెప్టునకు రూపకల్పన చేసింది. ఒక్కొక్క టీమ్‌పై గరిష్టంగా రూ. 60 లక్షలు మాత్రమే వ్యయం చేసేందుకు వీలుంటుంది. ప్లేయర్లతో ఫ్రాంచైజీలు రెండేళ్ల కాంట్రాక్టులు కుదుర్చుకుంటాయి. రెండేళ్ల తర్వాత.. ఫ్రాంచైజీలు ఇతరత్రా ప్లేయర్లను కూడా తీసుకోవడానికి వీలుంటుంది. జూలై 26న ప్రారంభమయ్యే లీగ్‌ను స్టార్ ఇండియా స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేయనుంది. ప్రతీ టీమ్ తన సొంత ఊరిలో నాలుగు గేమ్స్ ఆడుతుంది. పెట్టుబడి ఏటా 5 కోట్లు..: ఫ్రాంచైజీ ఫీజు, స్పోర్ట్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్లు, ఇతరత్రా వ్యయాలు కలిపి ఒక్కో ఫ్రాంచైజీ ఏటా సుమారు రూ. 5 కోట్లు దాకా వెచ్చించాల్సి వస్తుంది. పదేళ్ల పాటు ఫ్రాంచైజీ హక్కుల కోసం కార్పొరేట్లు ఏటా దాదాపు రూ. 1 కోటి నుంచి 1.5 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. టీమ్ స్పాన్సర్షిప్, గేట్ ఫీజు, ప్రైజ్ మనీ రూపంలో ఫ్రాంచైజీలు ఆదాయం సమకూర్చుకోవచ్చు.